రిలయన్స్ కాల్ చార్జీలు పెరిగాయోచ్!

By Prashanth
|
Rcom Hikes Mobile Tariff


న్యూఢిల్లీ: రిలయన్స్ కమ్యూనికేషన్స్ (ఆర్‌కామ్) కాల్ చార్జీలను గరిష్టంగా 25 శాతం మేర పెంచింది. సెకనుకు 1.2 పైసాగా ఉన్న చార్జీలను 1.5 పైసలకు పెంచింది. వ్యయాలు పెరుగుతుండటం వల్లే ఈ నిర్ణయం తీసుకున్నట్లు కంపెనీ వివరించింది. పెంచిన చార్జీలు పోస్ట్-పెయిడ్, ప్రీ-పెయిడ్ ఖాతాదారులందరికీ వర్తిస్తాయి. బీహార్, గుజరాత్, హిమాచల్‌ప్రదేశ్, మధ్యప్రదేశ్‌లో రెండు వారాల నుంచి కొత్త టారిఫ్‌లు అమలవుతున్నాయి. వచ్చే 30 రోజుల్లో మిగతా రాష్ట్రాల్లోనూ అమలు చేస్తామని సంస్థ ప్రెసిడెంట్ (వైర్‌లెస్ విభాగం) గుర్దీప్ సింగ్ పేర్కొన్నారు. కొత్త కనెక్షన్లు తీసుకునే వారు పెరిగిన టారిఫ్‌ను చెల్లించాల్సి ఉండగా.. ఇప్పటికే ఉన్న కస్టమర్లు తమ ప్రస్తుత ప్లాన్స్ వ్యాలిడిటీ పూర్తయిన తర్వాత నుంచి కొత్త చార్జీలు చెల్లించాల్సి ఉంటుందని వివరించారు. ప్రస్తుత రేట్లతో లాభదాయక వృద్ధి సాధించడం సాధ్యపడదని ఆర్‌కామ్ తెలిపింది.

ఎయిర్‌టెల్ స్మార్ట్‌డ్రైవ్ అప్లికేషన్!

ఏదైనా కొత్త ప్రాంతానికి వెళ్లినప్పుడు గమ్యస్థానానికి తడబడకుండా చేరుకోవటం.. వెళ్లే దారిలో ట్రాఫిక్ అప్‌డేట్‌ను ముందుగానే తెలుసుకోవటం వంటి విశేషాలతో కూడిన ‘స్మార్ట్ డ్రైవ్’ మొబైల్ అప్లికేషన్‌ను ప్రముఖ టెలికామ్ ప్రొవైడర్ ఎయిర్‌టెల్ ఆవిష్కరించింది. యూజర్ తన మొబైల్‌లో ఈ అప్లికేషన్‌ను డౌన్‌లోడ్ చేసకున్నట్లయితే రూట్ అడ్ర‌ లతో పాటు ట్రాఫిక్ సమాచారాన్ని వాయిస్ ఆధారితంగా తెలుసుకోవచ్చు. దేశంలో ఈ ‘రియల్ టైమ్ నేవిగేషన్’ సర్వీస్‌ను ప్రారంభించిన ఏకైక సంస్థగా తాము గుర్తింపు పొందినట్లు ఎయిర్‌టెల్ వర్గాలు ఒ ప్రకటనలో పేర్కొన్నాయి.

ఈ అప్లికేషన్‌ను పొందాలనుకునే సదరు ఎయిర్‌టెల్ వినియోగదారు తన మొబైల్ ద్వారా ‘‘డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.ఎయిర్‌టెల్‌లైవ్.కామ్/స్మార్ట్‌డ్రైవ్’’లోకి లాగినై డౌన్‌‌లోడ్ చేసుకోవచ్చు. లేదా ‘‘స్మార్ట్’’ అని టైప్ చేసి ‘543221’కి ఎస్ఎంఎస్ పంపితే సరిపోతుంది. ఈ అప్లికేషన్ ద్వారా రియల్ టైమ్ ట్రాఫిక్ అప్డేట్ ను నెల మొత్తం పొందాలనుకున్న వారు నెలసరి ప్యాక్ కింద రూ.49 చెల్లించాల్సి ఉంటుంది. ఒక రోజు అప్‌డేట్ కోసం రూ.3 చెల్లించాల్సి ఉంది. టర్న్ బై టర్న్ నేవిగేషన్ అప్లికేషన్‌ను నెల మొత్తం ఉపయోగించుకోవాలనుకునే వారు నెలసరి ప్యాక్ కింద రూ.99 చెల్లించాల్సి ఉంటుంది. డైలీ ప్యాక్ విలువ రూ.10. ఆండ్రాయిడ్, సింబియాన్, బ్లాక్‌బెర్రీ ఇంకా విండోస్ ప్లాట్‌ఫామ్‌లను ఈ అప్లికేషన్ సపోర్ట్ చేస్తుంది.

Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X