రూ.148కే 70జీబి 4జీ డేటా

అనిల్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ కమ్యూనికేషన్స్, సూపర్ వాల్యూ పేరుతో సరికొత్త టారిఫ్ ప్లాన్‌ను లాంచ్ చేసింది. ఈ ప్లాన్‌లో భాగంగా RCom యూజర్లు రూ.148 చెల్లించినట్లయితే 70జీబి 4జీ డేటా లభిస్తుంది. ఈ డేటాను రోజుకు ఒక డేటా చొప్పున 70 రోజుల పాటు ఉపయోగించుకునే వీలుంటుంది.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సర్కిల్స్‌‌కు మాత్రమే..

ఈ ఆఫర్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సర్కిల్స్‌లోని RCom యూజర్లకు మాత్రమే అందుబాటులో ఉంటుంది.

అదనంగా 50 రూపాయల టాక్‌టైమ్‌ కూడా..

ఈ డేటా ప్యాక్‌లో అదనంగా 50 రూపాయల టాక్‌టైమ్‌ను కూడా ఆర్‌కామ్ ఆఫర్ చేస్తోంది. ఈ ప్లాన్‌లో ఉన్నంత వరకు దేశంలో ఏ నెట్‌వర్క్‌కు కాల్ చేసుకున్నా నిమిషానికి 25 పైసలు మాత్రమే ఛార్జ్ చేయబడుతుంది.

మరో రెండు ఆసక్తికర ప్లాన్స్..

తాజాగా తెలియవచ్చిన సమాచారం ప్రకారం రిలయన్స్ కమ్యూనికేషన్స్ నుంచి FRC 54, FRC 61 ప్లాన్స్ కూడా మార్కెట్లోకి రాబోతున్నట్లు తెలుస్తోంది.

రూ.54 ప్లాన్‌‍లో..

రూ.54 ప్లాన్‌‍లో భాగంగా 28 రోజుల పాటు రోజుకు 1జీబి 4జీ డేటా అందుబాటులో ఉంటుంది. ఈ ప్లాన్‌లో రిలయన్స్ టు రిలయన్స్ మధ్య చేసుకునే వాయిస్ కాల్స్ పై నిమిషానికి 10 పైసలు ఛార్జ్ చేస్తారు. ఇతర నెట్‌వర్క్‌లకు చేసుకునే కాల్స్ పై నిమిషానికి 25 పైసలు ఛార్జ్ చేస్తారు.

 

రూ.61 ప్లాన్‌లో..

రూ.61 ప్లాన్‌లో భాగంగా భాగంగా 28 రోజుల పాటు రోజుకు 1జీబి 4జీ డేటా అందుబాటులో ఉంటుంది. ఈ ప్లాన్‌లో రిలయన్స్ టు రిలయన్స్ మధ్య చేసుకునే వాయిస్ కాల్స్ పై 2 సెకన్లకు 1 పైసా ఛార్జ్ చేస్తారు. ఇతర నెట్‌‌వర్క్‌లకు చేసుకునే కాల్స్ పై 6 సెకన్లకు 1 పైసా ఛార్జ్ చేస్తారు.

 

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
RCom Is Offering 70 GB 4G data for 70 days at Rs 148. Read More in Telugu Gizbot..
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot