టెలికం వ్యాపారానికి అనిల్ అంబాని గుడ్‌బై, తరువాత వ్యూహం ఇదే !

టెలికం రంగంలో దూసుకుపోతున్న ఆర్‌కామ్‌ తమ వినియోగదారులకు షాకిచ్చింది. తన టెలికం సర్వీసులను మూసివేసేందుకు రెడీ అయినట్లుగా తెలుస్తోంది.

By Hazarath
|

టెలికం రంగంలో దూసుకుపోతున్న ఆర్‌కామ్‌ తమ వినియోగదారులకు షాకిచ్చింది. తన టెలికం సర్వీసులను మూసివేసేందుకు రెడీ అయినట్లుగా తెలుస్తోంది. వ్యాపార రంగంలో తనదైన ముద్ర వేసుకున్న అనిల్ అంబాని తన టెలికం సేవలను మూసివేస్తున్నారనే వార్తలు ఇప్పుడు ఉద్యోగులను ఎక్కువగా ఆందోళనకు గురిచేస్తున్నాయి. అయితే 2జీ సేవలను మాత్రమే మూసివేస్తామని 4జీ సేవలను అందిస్తామని ఆ దిశగా అడుగులు వేస్తున్నామని కంపెనీ తెలిపింది.

 

షియోమి ఫోన్లకు MIUI 9 అప్‌డేట్, ఈ ఫోన్లకు మాత్రమే !షియోమి ఫోన్లకు MIUI 9 అప్‌డేట్, ఈ ఫోన్లకు మాత్రమే !

 వచ్చే నెల 30 నుంచి..

వచ్చే నెల 30 నుంచి..

నష్టాల్లో కొనసాగుతున్న టెలికం సేవల సంస్థ రిలయన్స్ కమ్యూనికేషన్‌ను వచ్చే నెల 30 నుంచి వైర్‌లెస్ టెలిఫోన్ వ్యాపారాన్ని మూసివేస్తున్నట్లుగా కంపెనీ ప్రకటించింది. ప్రస్తుతం సంస్థకు రూ.46 వేల కోట్ల అప్పు ఉంది.

 4 కోట్ల మంది వినియోగదారులు..

4 కోట్ల మంది వినియోగదారులు..

ప్రస్తుతం కంపెనీకి ఉన్న 4 కోట్ల మంది వినియోగదారులు 4జీకి అప్‌గ్రేడ్ కావడమా లేదా ఇతర నెట్‌వర్క్‌లను ఎంచుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.

4జీ ఇంటర్‌నెట్ సేవలను..

4జీ ఇంటర్‌నెట్ సేవలను..

2జీ సర్వీసును మూసివేస్తున్నప్పటికీ 4జీ ఇంటర్‌నెట్ సేవలను యథాతథంగా కొనసాగించనున్నట్లు కంపెనీ వర్గాలు వెల్లడించాయి.

రిలయన్స్ జియోతో స్పెక్ట్రం..
 

రిలయన్స్ జియోతో స్పెక్ట్రం..

4జీ మొబైల్ సేవలకు సంబంధించి ముకేశ్ అంబానీకి చెందిన రిలయన్స్ జియోతో స్పెక్ట్రం పంచుకుంటున్నది. ఐఎల్‌డీ వాయిస్, కన్జ్యూమర్ వాయిస్, 4జీ డోంగిల్ పోస్ట్ పెయిడ్ సర్వీసులను కొనసాగించనున్నది.

1500-2000 మంది సిబ్బంది భవిష్యత్తుపై

1500-2000 మంది సిబ్బంది భవిష్యత్తుపై

దీంతో ఆర్‌కామ్‌లో పనిచేస్తున్న 1500-2000 మంది సిబ్బంది భవిష్యత్తుపై నీలినీడలు నెలకొన్నాయి. ఈ విషయంపై కంపెనీ వర్గాలు స్పందించడానికి నిరాకరించాయి.

లాభాలు తెచ్చే 4జీ సేవలపై..

లాభాలు తెచ్చే 4జీ సేవలపై..

లాభాలు తెచ్చే 4జీ సేవలపై ప్రత్యేక దృష్టి సారించనున్నట్లు, మిగతా వాటిని తగ్గించుకోవాలని చూస్తున్నట్లు ఇటీవల కంపెనీ ప్రకటించిన విషయం తెలిసిందే.

చ్చే నెల రోజుల్లో ఈ సేవలకు స్వస్తి ..

చ్చే నెల రోజుల్లో ఈ సేవలకు స్వస్తి ..

ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా టెలికం సేవలను ఇంకా కొనసాగించలేమని, వచ్చే నెల రోజుల్లో ఈ సేవలకు స్వస్తి పలుకాలనుకుంటున్నట్లు ఉద్యోగులకు పంపిన ఈ-మెయిల్స్‌లో ఆర్‌కామ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గుర్‌దీప్ సింగ్ పేర్కొన్నారు.

డీటీహెచ్ వ్యాపారానికి సంబంధించి..

డీటీహెచ్ వ్యాపారానికి సంబంధించి..

అలాగే డీటీహెచ్ వ్యాపారానికి సంబంధించి లైసెన్స్ గడువు ముగిసిన వెంటనే ఈ బిజినెస్‌ను కూడా మూసివేయనున్నట్లు తెలిపింది. నవంబర్ 21 వరకు లైసెన్స్ గడువు ఉంది.

Best Mobiles in India

English summary
RCom pulls plug on 2G services; 1,500 jobs to go more news at Gizbot Telugu

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X