యూజర్లకు ఆర్‌కామ్ షాక్, బిగ్ టీవి అవుట్

Written By:

డిటిహెచ్‌ రంగంలో దూసుకెళుతున్న ఆర్‌కామ్ యూజర్లకి షాకిచ్చింది. తన డిటిహెచ్‌ విభాగం రిలయన్స్‌ బిగ్‌ టీవీని పాంటెల్‌ టెక్నాలజీస్‌ అండ్‌ వీకాన్‌ మీడియా, టెలివిజన్‌ సంస్థకు విక్రయించింది.రుణ భారాన్ని తగ్గించుకునేందుకు బిగ్‌ టీవీని విక్రయించినట్టు ఆర్‌కామ్‌ ప్రకటించింది. అయితే డీల్‌ విలువ ఎంత అన్నది కంపెనీ ఇంకా ప్రకటించలేదు.

జియో నుంచి మరో శుభవార్త, కొందరికి మాత్రమే !

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

ఆర్‌కామ్‌ కొత్త అవతారంలో..

కాగా ఆర్‌కామ్‌ కొత్త అవతారంలో బి2బి వ్యాపారాల పైనే దృష్టి సారించే లక్ష్యానికి అనుగుణంగానే బిగ్‌ టివి విక్రయం జరిగినట్టు కంపెనీ తెలిపింది.

12 లక్షల మంది బిగ్‌ టీవీ కస్టమర్ల ప్రసారాలకు

ఈ లావాదేవీ వల్ల 12 లక్షల మంది బిగ్‌ టీవీ కస్టమర్ల ప్రసారాలకు ఎలాంటి అంతరాయం ఉండదు. అలాగే ఆర్‌బిటీవీలోని 500 మంది ఉద్యోగులు కూడా యథాతథంగా ఉద్యోగాల్లో కొనసాగిస్తారు.

ఆర్‌బిటీవీ షేర్‌ హోల్డింగ్‌ అంతటినీ

కాగా ఉన్నదున్నట్టుగా స్వీకరించే ప్రాతిపదికపై ఆర్‌బిటీవీ షేర్‌ హోల్డింగ్‌ అంతటినీ పాంటెల్‌ టెక్నాలజీస్‌ స్వాధీనం చేసుకుంటుందని కంపెనీ వివరించింది.

ఆర్‌కామ్‌పై చైనా అభివృద్ధి బ్యాంకు

ఇదిలా ఉంటే ఆర్‌కామ్‌పై చైనా అభివృద్ధి బ్యాంకు ఇన్‌సాల్వెన్సీ పిటిషన్‌ దాఖలు చేసిందని వెలువడిన వార్త సంచలనం సృష్టించింది. ఈ వార్తలతో మంగళవారం ఆర్‌కామ్‌ షేర్లు నాలుగు శాతం పతనమయ్యాయి.

ఈ వార్తలను..

అయితే ఈ వార్తలను ఆర్‌కామ్‌ ఖండించింది. అలాంటిదేమి మా దృష్టికి రాలేదని కొట్టిపారేసింది.

సుమారు రూ.11,593 కోట్ల మేర..

కాగా సుమారు రూ.11,593 కోట్ల మేర ఇన్‌ సాల్వెన్సీ కేసు దాఖలు చేసినట్టు చైనా డెవలప్‌మెంట్‌ బ్యాంకు (సీడీబీ) ప్రకటించింది. ఈ మేరకు ఆర్‌కాంకు నోటీసులు పంపినట్టు తెలిపింది.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
RCom to sell DTH arm Reliance BIG TV to Pantel, Veecon Media Read more News at Gizbot Telugu
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting