టెలికాంకు ఆర్‌కామ్ గుడ్ బై , కొత్త వ్యాపారంలోకి సునామి ఎంట్రీ !

ఒకప్పుడు టెలికం రంగంలో సంచలనాలు సృష్టించిన రిలయన్స్‌ కమ్యూనికేషన్స్‌ (ఆర్‌కామ్‌) మొత్తానికి ఆ వ్యాపారం నుంచే పూర్తిగా వైదొలగనుంది.

|

ఒకప్పుడు టెలికం రంగంలో సంచలనాలు సృష్టించిన రిలయన్స్‌ కమ్యూనికేషన్స్‌ (ఆర్‌కామ్‌) మొత్తానికి ఆ వ్యాపారం నుంచే పూర్తిగా వైదొలగనుంది. టెలికాం వ్యాపారం నుంచి పూర్తిగా వైదొలగుతున్నట్లు రిలయన్స్‌ కమ్యూనికేషన్స్‌(ఆర్‌కామ్‌) ఛైర్మన్‌ అనిల్‌ అంబానీ వెల్లడించారు. భవిష్యత్‌లో రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారంపై దృష్టి సారించనున్నట్లు పేర్కొన్నారు. ఈరోజు జరిగిన 14 వార్షిక సర్వసభ్య సమావేశం సందర్భంగా అనిల్‌ అంబానీ మాట్లాడారు. అన్నింటికన్నా ముందుగా ఆర్‌కామ్‌కు ఉన్న రూ. 40,000 కోట్ల రుణభారాన్ని పరిష్కరించుకోనున్నట్లు ఆయన పేర్కొన్నారు.

బిగ్ టివి బంపరాఫర్, ఏడాది పాటు అన్నీ ఫ్రీ, నిర్ణీత మొత్తంతో..బిగ్ టివి బంపరాఫర్, ఏడాది పాటు అన్నీ ఫ్రీ, నిర్ణీత మొత్తంతో..

2000 సంవత్సరంలో..

2000 సంవత్సరంలో..

2000 సంవత్సరంలో అత్యంత తక్కువ ధరకు టెలికాం సేవలను అందించే లక్ష్యంతో ఆర్‌కామ్‌ సేవలను ప్రారంభమ్యాయి.

ఇప్పుడు రూ.40వేలకోట్ల అప్పులు

ఇప్పుడు రూ.40వేలకోట్ల అప్పులు

కాగా ఇప్పుడు రూ.40వేలకోట్ల అప్పులు మిగిలాయి. టెలికం రంగం భవిష్యత్‌ స్పష్టంగా కనిపిస్తోంది. ఈ రంగంలో ఇక కొనసాగరాదని నిర్ణయించుకున్నాం. ఇంకా చాలా కంపెనీలు కూడా ఇలాంటి నిర్ణయమే తీసుకున్నాయని అనిల్ అంబాని తెలిపారు.

మొబైల్‌ రంగం నుంచి ..

మొబైల్‌ రంగం నుంచి ..

మొబైల్‌ రంగం నుంచి వైదొలగుతున్నాం. మరో వ్యాపారంలోకి మేము అడుగు పెట్టబోతున్నాం. ఈ కంపెనీకి రిలయన్స్‌ రియాల్టీ కొత్త ఉత్తేజాన్ని ఇవ్వబోతోందని అనిల్ అంబాని పేర్కొన్నారు.

133 ఎకరాల్లో ..

133 ఎకరాల్లో ..

ముంబయి శివార్లలో 133 ఎకరాల్లో విస్తరించి ఉన్న ధీరూభాయి అంబానీ నాలెడ్జ్‌ సెంటర్‌(డీఏకేసీ)పై మాట్లాడుతూ.. స్థిరాస్తి వ్యాపారంలో అపరిమిత అవకాశాలు ఉన్నాయని తెలిపారు. డీఏకేసీ కేంద్రంగా ముందుకు సాగుతామని పేర్కొన్నారు.

దాదాపు రూ. 25,000 కోట్ల మేర విలువను ..

దాదాపు రూ. 25,000 కోట్ల మేర విలువను ..

ఈ సైట్‌ ద్వారా దాదాపు రూ. 25,000 కోట్ల మేర విలువను సృష్టించేందుకు పుష్కలంగా అవకాశాలు ఉన్నాయని అంబానీ చెప్పారు.కంపెనీ రుణభారానికి మరికొద్ది నెలల్లో తగు పరిష్కార మార్గం లభించగలదని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

ఇతరత్రా విభాగాల విక్రయం..

ఇతరత్రా విభాగాల విక్రయం..

టెలికం ఇన్‌ఫ్రా, ఫైబర్‌ వ్యాపారాలను రిలయన్స్‌ జియోకి విక్రయించే ప్రక్రియ తుది దశలో ఉందని.. ఇలాగే ఇతరత్రా విభాగాల విక్రయం తదితర చర్యలతో నిధులు సమీకరించుకునే ప్రయత్నాల్లో ఉన్నామని అనిల్‌ అంబానీ చెప్పారు.

తుది అనుమతుల కోసం

తుది అనుమతుల కోసం

స్పెక్ట్రం షేరింగ్, ట్రేడింగ్‌కు సంబంధించి టెలికం శాఖ నుంచి తుది అనుమతుల కోసం ఎదురుచూస్తున్నామన్నారు.

పెద్దన్న ముకేశ్‌ అంబానీకి..

పెద్దన్న ముకేశ్‌ అంబానీకి..

అప్పట్లో అవిభాజ్య రిలయన్స్‌ గ్రూప్‌ను టెలికం రంగం వైపు నడిపించడంతో పాటు ప్రస్తుతం సంక్షోభంలో ఉన్న ఆర్‌కామ్‌ అసెట్స్‌ను కొనుగోలు చేయడం ద్వారా ఇప్పుడు కూడా ఆర్థికంగా తోడ్పాటు అందిస్తున్న పెద్దన్న ముకేశ్‌ అంబానీకి అనిల్‌ ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు.

ఇది సరైన సమయమని..

ఇది సరైన సమయమని..

వ్యక్తిగతంగా నాకు, ఆర్‌కామ్‌కు, .. మార్గనిర్దేశనం చేసి, తోడ్పాటు అందించిన నా సోదరుడు ముకేశ్‌ భాయ్‌ అంబానీకి కృతజ్ఞతలు తెలుపుకోవడానికి ఇది సరైన సమయమని అనిల్‌ పేర్కొన్నారు.

టెలికం రంగంలో..

టెలికం రంగంలో..

టెలికం రంగంలో సృజనాత్మక విధ్వంసం జరుగుతోందని.. సాముదాయిక గుత్తాధిపత్యానికి దారి తీసిందని చెప్పారు. తర్వాత రోజుల్లో ఇది ద్విదాధిపత్యం (రెండే కంపెనీల ఆధిపత్యం), అటు పైన పూర్తి గుత్తాధిపత్యానికి కూడా దారితీయొచ్చని అనిల్‌ అంబానీ పేర్కొన్నారు.

రిలయన్స్‌ సామ్రాజ్యం విభజన అనంతరం..

రిలయన్స్‌ సామ్రాజ్యం విభజన అనంతరం..

రిలయన్స్‌ సామ్రాజ్యం విభజన అనంతరం టెలికంతో పాటు కొన్ని విభాగాలు అనిల్‌ అంబానీకి, రిఫైనరీ తదితర వ్యాపార విభాగాలు ముకేశ్‌ అంబానీకి లభించిన సంగతి తెలిసిందే. ముకేశ్‌ అంబానీ తాజాగా మళ్లీ రిలయన్స్‌ జియోతో.. టెలికం రంగంలోకి ప్రవేశించారు.

జియోకి విక్రయించేసిన తర్వాత ..

జియోకి విక్రయించేసిన తర్వాత ..

మొబైల్‌ వ్యాపార విభాగాన్ని జియోకి విక్రయించేసిన తర్వాత ఆర్‌కామ్‌ ప్రస్తుతం ఎంటర్‌ప్రైజ్, డేటా సెంటర్స్, అండర్‌సీ కేబుల్స్‌ మొదలైన వ్యాపార విభాగాల ద్వారా 35,000 సంస్థలకు సర్వీసులు అందిస్తోందని అనిల్‌ అంబానీ చెప్పారు.

బ్యాంకులకు రుణాలను ..

బ్యాంకులకు రుణాలను ..

వీటన్నింటి నుంచి వైదొలగడంతో పాటు బ్యాంకులకు రుణాలను తిరిగి చెల్లించడానికి కూడా ఆర్‌కామ్‌ కట్టుబడి ఉందని.. దీనిపై తగు సమయంలో నిర్ణయం తీసుకుంటామని ఆయన చెప్పారు.

12-18 నెలల్లో ఆర్థికేతర వ్యాపార విభాగాల నుంచి ..

12-18 నెలల్లో ఆర్థికేతర వ్యాపార విభాగాల నుంచి ..

రిలయన్స్‌ క్యాపిటల్‌ వచ్చే 12-18 నెలల్లో ఆర్థికేతర వ్యాపార విభాగాల నుంచి వైదొలగడం ద్వారా రుణభారం తగ్గించుకోవాలని భావిస్తున్నట్లు కంపెనీ 32వ వార్షిక సాధారణ సమావేశంలో చైర్మన్‌ అనిల్‌ అంబానీ తెలిపారు.

రిలయన్స్‌ హోమ్‌ ఫైనాన్స్‌ సంస్థలో ..

రిలయన్స్‌ హోమ్‌ ఫైనాన్స్‌ సంస్థలో ..

తమ రిలయన్స్‌ హోమ్‌ ఫైనాన్స్‌ సంస్థలో గణనీయమైన వాటాల కొనుగోలు కోసం వ్యూహాత్మక భాగస్వామితో చర్చలు జరుగుతున్నాయని.. మరికొద్ది నెలల్లో ఈ డీల్‌ పూర్తి కాగలదని అనిల్‌ పేర్కొన్నారు.

 

Best Mobiles in India

English summary
RCom to exit telecom biz completely, focus on real estate: Anil Ambani more news at gizbot telugu

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X