జియోకు షాక్.. RComm నుంచి కొత్త వెల్‌కమ్ ఆఫర్‌

ముఖేష్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ జియోకు పోటీగా అనిల్ అంబానీ నేతృత్వంలోని ఆర్‌కామ్ (RComm) సరికొత్త వెల్‌కమ్ ఆఫర్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది.

 జియోకు షాక్.. RComm నుంచి కొత్త వెల్‌కమ్ ఆఫర్‌

Read More : ప్రమాదంలో గూగుల్ ప్లే స్టోర్, చిక్కుల్లో 400 యాప్స్

కొత్త యూజర్లును ఆకట్టుకునేందుకు ఆర్‌కామ్ ఈ సరికొత్త ఆఫర్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ ప్లాన్‌లో భాగంగా 1జీబి 3జీ డేటాను రూ.50కంటే తక్కువ ధరకే అందించే ప్రయత్నం చేస్తున్నారు. కొత్త ఆర్‌కామ్ కనెక్షన్ తీసుకునే వారికి ఈ ఆఫర్స్ వర్తిస్తాయి...

లేటెస్ట్ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

ఆర్‌కామ్ అందిస్తోన్న వెలకమ్ ఆఫర్..

ఆర్‌కామ్ అందిస్తోన్న వెలకమ్ ఆఫర్ రెండు రకాలుగా అందుబాటులో ఉంటుంది. మొదటి ఆఫర్‌లో భాగంగా యూజర్ రూ.496 చెల్లించినట్లయితే 10 జీబి 3జీ డేటాతో పాటు 496 నిమిషాల టాక్ టైమ్ లభిస్తుంది. ప్లాన్ వ్యాలిడిటీ మూడు నెలలు.

రెండవ ఆఫర్‌లో భాగంగా..

రెండవ ఆఫర్‌లో భాగంగా రూ.295 చెల్లించినట్లయితే 3జీబి 3జీ డేటాతో పాటు 295 నిమిషాల టాక్ టైమ్ మీకు లభిస్తుంది. ప్లాన్ వ్యాలిడిటీ మూడు నెలలు.

లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ప్రత్యేకించి 2జీ యూజర్ల కోసం..

ప్రత్యేకించి 2జీ యూజర్ల కోసం ఆర్‌కామ్ సరికొత్త ఆఫర్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ ఆఫర్‌లో భాగంగా రూ.141 చెల్లించినట్లయితే, 5జీబి 2జీ డేటాతో పాటు 141 నిమిషాల టాక్‌టైమ్ లభిస్తుంది. . ప్లాన్ వ్యాలిడిటీ మూడు నెలలు.

వెల్‌కమ్ ఆఫర్‌తో పాటుగా..

వెల్‌కమ్ ఆఫర్‌తో పాటుగా సరికొత్త వాయిస్ ప్లాన్‌లను కూడా ఆర్‌కామ్ ఆవిష్కరించింది. ఈ ప్లాన్‌లో భాగంగా రూ.153 చెల్లించినట్లయితే 1000 నిమిషాల లోకల్, ఎస్డీడీ కాల్స్ మీకు లభిస్తాయి. ప్రస్తుతానికి అన్ని ప్రాంతాల్లో ఈ ప్లాన్ అందుబాటులో లేదు.

లేటెస్ట్ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
RComm Announces 'Welcome Offer' for New Users to Compete With Reliance Jio: 5 Things to Know. Read More in Telugu Gizbot..
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot