Realme నుంచి మూడు కొత్త ఫోన్లు వస్తున్నాయి ! లైవ్ ఫోటోలు లీక్ అయ్యాయి.చూడండి.

By Maheswara
|

Realme 10 సిరీస్ ఫోన్ ఈ నవంబర్‌లో లాంచ్ కాబోతోంది అని మీకు ముందుగానే తెలుసు. అయితే, ఖచ్చితమైన లాంచ్ తేదీ ఇంకా ధృవీకరించబడలేదు. Realme 10 4G, Realme 10 5G మరియు Realme 10 Pro+ వేరియంట్ లలో ఈ రాబోయే స్మార్ట్‌ఫోన్ల లైనప్‌ ఉంటుందని ఇటీవలి పుకార్లు సూచించాయి. ఇంకా, ఒక టిప్‌స్టర్ సమాచారం ప్రకారం Realme 10 Pro+ ఫోన్ యొక్క లైవ్ ఫోటోలను లీక్ చేసింది. ఈ ఫోన్ హోల్-పంచ్ స్లాట్‌తో వంపు తిరిగిన డిస్‌ప్లే డిజైన్ ను కలిగి ఉన్నట్లు కనిపిస్తోంది. లీక్ అయిన చిత్రాలలో హ్యాండ్‌సెట్ యొక్క బాక్స్ యొక్క ప్యాకేజింగ్ కూడా ఉంది, ఇది Realme 10 Pro+ యొక్క రిటైల్ వెర్షన్ అని సూచించవచ్చు.

Realme 10 Pro+

Realme 10 Pro+

ప్రముఖ  టిప్‌స్టర్ గౌరవ్ అగర్వాల్ (ట్విట్టర్: @Agrawalji_Tech) ట్వీట్ చేసిన ఫోటోల ప్రకారం, Realme 10 Pro+ సెంట్రల్ హోల్-పంచ్ స్లాట్‌తో కర్వ్డ్ డిస్‌ప్లేను కలిగి ఉండవచ్చు. ఇది కుడి వైపు అంచున వాల్యూమ్ రాకర్స్ మరియు పవర్ బటన్‌ను కలిగి ఉన్నట్లు కూడా డిజైన్ లో కనిపిస్తుంది.

Realme 10 Pro+ స్మార్ట్ ఫోన్ LED ఫ్లాష్‌తో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌ను కలిగి ఉండే అవకాశం కనిపిస్తోంది. ఈ లీకైన హ్యాండ్‌సెట్ గ్రే కలర్‌లో చూపబడింది. ఈ ఫోటోలలో దాని బాక్స్ ప్యాకేజింగ్ కూడా ఉన్నట్లు అనిపిస్తుంది, ఇది రాబోయే Realme స్మార్ట్‌ఫోన్ యొక్క రిటైల్ మోడల్ అని సూచించవచ్చు.

Realme 10 సిరీస్

Realme 10 సిరీస్

Realme 10 సిరీస్ ఫోన్లు నవంబర్‌లో లాంచ్ అవుతాయని రియల్‌మీ గత వారం ప్రకటించింది. అయితే, ఇది ఇంకా ఖచ్చితమైన ప్రారంభ తేదీ మరియు సమయాన్ని వెల్లడించలేదు. టిప్‌స్టర్ పరాస్ గుగ్లానీ సమాచారం ప్రకారం (ట్విట్టర్: @passionategeekz) ఈ లైనప్ శనివారం లాంచ్ కావొచ్చని సూచించింది.

ఇటీవలి నివేదిక ప్రకారం, Realme 10 Pro+ 6.7-అంగుళాల పూర్తి-HD+ కర్వ్డ్ AMOLED డిస్‌ప్లేను కలిగి ఉందని చెప్పబడింది. ఇది MediaTek డైమెన్సిటీ 1080 SoC ద్వారా అందించబడుతుందని భావిస్తున్నారు. ఈ స్మార్ట్‌ఫోన్ 108-మెగాపిక్సెల్ మెయిన్ సెన్సార్, 8-మెగాపిక్సెల్ లెన్స్ మరియు 2-మెగాపిక్సెల్ సెకండరీ సెన్సార్‌తో సహా ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌ను పొందవచ్చు. ఇది 16-మెగాపిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాను కూడా కలిగి ఉండే అవకాశం ఉంది. హ్యాండ్‌సెట్ 67W ఫాస్ట్ ఛార్జింగ్‌కు మద్దతుతో 4,890mAh బ్యాటరీని ప్యాక్ చేయగలదు. Realme 10 Pro+ 8.1mm సన్నగా మరియు 172.5g బరువు ఉండవచ్చు అని అంచనాలున్నాయి.

రియల్‌మి కంపెనీ 2022లో ఎన్ని 5G ఫోన్‌లను లాంచ్ చేయనున్నదో తెలుసా?

రియల్‌మి కంపెనీ 2022లో ఎన్ని 5G ఫోన్‌లను లాంచ్ చేయనున్నదో తెలుసా?

రియల్‌మి ఇండియా CEO మాధవ్ షేత్ తన యొక్క ట్విట్టర్‌ అకౌంటులో పోస్ట్‌ చేసిన సమాచారం ప్రకారం "రియల్‌మీ ఎగ్జిక్యూటివ్ సంస్థ ఈ సంవత్సరం భారతదేశంలో కొత్తగా 5G స్మార్ట్‌ఫోన్‌ను పరిచయం చేయనున్నట్లు తెలిపారు. "మేము దీని యొక్క విశిష్టత మరియు ప్రత్యేక డిజైన్‌పై అధికంగా దృష్టిని పెడుతున్నందున రాబోయే పండుగ సీజన్‌లో వినియోగదారులకు అందుబాటులో ఉండి దీని యొక్క డిమాండ్ పుంజుకుంటుంది అని భావిస్తున్నాము. మేము 5G స్మార్ట్‌ఫోన్‌తో సహా నాలుగు కొత్త ఉత్పత్తులను కూడా పరిచయం చేయనున్నాము" అని కంపెనీ రాబోయే స్మార్ట్‌ఫోన్ గురించి వివరాలను వెల్లడించకుండా పోస్ట్‌లో రాశారు.

 భారతదేశం యొక్క #5G రోల్‌అవుట్‌

భారతదేశం యొక్క #5G రోల్‌అవుట్‌

"2022లో భారతదేశం యొక్క #5G రోల్‌అవుట్‌కి ముందు ఇది అదనంగా ఉంటుంది" అని ఆయన చెప్పారు. ట్విట్టర్‌ ప్లాట్‌ఫారమ్‌లో ఒక ప్రత్యేక పోస్ట్‌లో "భారతదేశంలో 5G స్మార్ట్‌ఫోన్‌లను మరింత అందుబాటులోకి తీసుకురావడానికి కంపెనీ కృషి చేస్తోందని మరియు త్వరలో భారతదేశంలో రియల్‌మి 9i 5Gని ప్రారంభించాలని కంపెనీ యోచిస్తోందని" షెత్ ఇది వరకే ట్విట్టర్ ద్వారా చెప్పారు.

Best Mobiles in India

Read more about:
English summary
Realme 10 Pro+ Real Life Images Leaked Online Ahead Of The Next Month November Launch.

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X