Realme కొత్త ఫోన్ వివరాలు లీక్.. 100MP కెమెరా, 5000mAh బ్యాటరీ సహా..!
ప్రముఖ స్మార్ట్‌ఫోన్ల తయారీ సంస్థ రియల్‌మీ భారత్‌లో కొత్త ఫోన్‌ను విడుదల చేయనుంది. తైవాన్‌లో అధికారికంగా ప్రకటించిన తర్వాత Realme 11 5G సిరీస్ ఫోన్‌ను భారత్‌లో లాంచ్ చేయనుంది. ఈ సిరీస్‌లో రియల్‌మీ 11 ప్రో 5G, రియల్‌మీ 11 ప్రో ప్లస్ 5G స్మార్ట్‌ఫోన్లు ఉన్నాయి.
రియల్‌మీ 11 5G స్మార్ట్‌ఫోన్ల సిరీస్ భారత్‌లో మరో పది రోజుల్లో విడుదల అవుతుందని టిప్‌స్టర్ అభిషేక్ యాదవ్ తన ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. దాంతోపాటు ఫోన్‌కు సంబంధించిన కొన్ని స్పెసిఫికేషన్లు, ఫోటోలను షేర్ చేశారు. ఈ ఫోన్ వృత్తాకార కెమెరా మాడ్యుల్‌ను కలిగి ఉంది.

టిప్‌స్టర్ అభిషేక్ యాదవ్ వెల్లడించిన వివరాలు ఆధారంగా రియల్‌మీ 11 5G ఫోన్లు 6.72 అంగుళాల పుల్ HD+ IPS LCD డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. 120Hz రీఫ్రెష్ రేట్‌ను కలిగి ఉంటుంది. 680nits గరిష్ఠ బ్రైట్‌నెస్‌తో వస్తుంది. మరియు ఈ ఫోన్ 190 గ్రాముల బరువు, 8.05 గ్రాముల థిక్‌నెస్‌తో వస్తుంది.
కొత్త రియల్‌మీ ఫోన్ 6nm మీడియాటెక్ డైమెన్సిటీ 6100+ చిప్‌సెట్‌తో Mail MC2 GPU పై పనిచేస్తుంది. ఆండ్రాయిడ్ 13 ఆధారిత రియల్‌మీ UI 4.0తో వస్తుంది. మరియు ఈ రియల్‌మీ 11 5G స్మార్ట్‌ఫోన్ గోల్డ్, బ్లాక్ రంగుల్లో అందుబాటులో వచ్చే అవకాశం ఉంది.
రియల్‌మీ 11 5G స్మార్ట్‌ఫోన్ 67W ఛార్జింగ్ సపోర్టుతో 5000mAh బ్యాటరీ సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. మరియు ఈ ఫోన్ వెనుకవైపు 100MP ప్రైమరీ కెమెరా, 2MP సెకండరీ కెమెరా లెన్స్‌ను కలిగి ఉంటుంది. ముందువైపు 16MP కెమెరాను కలిగి ఉంటుంది.
ఈ ఫోన్ Wi-Fi 5, బ్లూటూత్ 5.2, USB టైప్-C పోర్టు, సైట్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్‌తో వస్తుంది. ఫోన్ బేస్ వేరియంట్ ధర రూ.20,000 కంటే తక్కువ ధరకు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. అయితే ఈ ఫోన్ డిజైన్, ధర, ఫీచర్లు, స్పెసిఫికేషన్లపై రియల్‌మీ సంస్థ ఎటువంటి అధికారిక ప్రకటన చేయలేదు. రానున్న రోజుల్లో ఈ ఫోన్ గురించి మరిన్ని వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.
* రియల్‌మీ C53 ఫోన్ ఇటీవల సేల్‌లోకి వచ్చింది. 90Hz రీఫ్రెష్ రేట్‌తో 6.74 అంగుళాల HD+ డిస్‌ప్లేను కలిగి ఉంది. 720*1600 పిక్సల్ రిజల్యూషన్‌తో వస్తుంది. ఈ ఫోన్ మిని క్యా్ప్సుల్ ఫీచర్‌ను కలిగి ఉంటుంది. ఈ ఫీచర్ డిస్‌ప్లేను అడ్జస్ట్ చేస్తుంది. ఈ ఫీచర్ ఐఫోన్ 14 ప్రో, ఐఫోన్ 14 ప్రో మ్యాక్స్ మోడల్‌లోని డైనమిక్ ఐలాండ్ తరహాలో ఉంటుంది.
రియల్‌మీ C53 స్మార్ట్‌ఫోన్ ప్రధానంగా 108MP కెమెరాను కలిగి ఉంటుంది. ఈ కెమెరా 3x సెన్సార్‌లను కలిగి ఉంది. మరియు అనేక రకాల కెమెరా మాడ్యూల్‌లను కలిగి ఉంటుంది. 108MP మోడ్, వీడియో, నైట్ మోడ్, పనోరమిక్ వ్యూ, ఎక్స్‌పర్ట్, టైమ్‌ల్యాప్స్, పొర్ట్రెయిట్ మోడ్, హెచ్‌డీఆర్, AI టెక్నాలజీ, ఫిల్టర్, స్లో మోషన్ మోడ్‌లను కలిగి ఉంటుంది. ముందువైపు 8MP కెమెరాను కలిగి ఉంటుంది.
రియల్‌మీ C53 స్మార్ట్‌ఫోన్ ఆక్టాకోర్ Unisoc T612 చిప్‌సెట్‌పై పనిచేస్తుంది. రెండు ర్యామ్, స్టోరేజీ వేరియంట్లలో ఈ ఫోన్ అందుబాటులో ఉంది. మైక్రో SD కార్డు ద్వారా ఫోన్ స్టోరేజీని పెంచుకోవచ్చు. ఈ ఫోన్ డ్యూయల్ సిమ్ కార్డును సపోర్టు చేస్తుంది. ఆండ్రాయిడ్ 13 ఆధారిత రియల్‌మీ UI ఎడిషన్‌పై పనిచేయనుంది. ఈ స్మార్ట్‌ఫోన్ 5000mAh బ్యాటరీ ఆధారంగా పనిచేస్తుంది. మరియు 18W SuperVooc ఛార్జింగ్ సపోర్టుతో రానుంది.


Click it and Unblock the Notifications








