Home
News

200MP కెమెరా తో వచ్చే, రియల్ మీ ఫోన్ డిజైన్ లీక్! వివరాలు

By Maheswara

రియల్ మీ సంస్థ నుంచి త్వరలో అంటే, మే 10న రియల్ మీ 11 ప్రో + 5G ఫోన్ చైనాలో లాంచ్ అవుతుందని వార్తలు వెలువడిన నేపథ్యంలో, రియల్ మీ11 సిరీస్‌లను ప్రారంభించనున్నట్లు ప్రకటించింది. అయితే ఈ సిరీస్ లో ఎన్ని ఫోన్లు లాంచ్ అవుతాయని వివరాలు వెల్లడించలేదు. కానీ, అంచనా నివేదికల ప్రకారం ఈ సిరీస్‌లో రియల్ మీ 11 ప్రో మరియు రియల్ మీ11 5G మరియు రియల్ మీ 11 ప్రో + 5G ఉండవచ్చు.

వీటిలో, టాప్ మోడల్ అయిన రియల్ మీ 11 ప్రో + 5G ఫోన్ యొక్క డిజైన్ మరియు కెమెరా ఫీచర్ల వివరాలు అందించే కొత్త టీజర్‌ను రియల్ మీ విడుదల చేసింది. ఈ టీజర్ ప్రకారం, రియల్ మీ 11 ప్రో + 5G నివేదికలో చూపినట్లుగా ముఖ్యమైన కెమెరా అప్‌గ్రేడ్‌లను అందిస్తుంది. ఈ ఫోన్ యొక్క డిజైన్, స్పెసిఫికేషన్‌లు మరియు ఇతర వివరాలను అధికారికంగా లాంచ్ చేయడానికి ముందే ఇక్కడ తెలుసుకోండి.

Realme 11 Pro Plus With 200MP Camera Design Revealed, Ahead Of The May 10 Launch. Specifications Details.

రియల్ మీ 11 ప్రో+ ఫాక్స్ లెదర్ బ్యాక్‌ను కలిగి ఉంటుంది. రియల్ మీ 11 ప్రో + 5G యొక్క తాజా టీజర్ ప్రకారం వెనుక వైపు పెద్ద వృత్తాకార కెమెరా మాడ్యూల్‌ను కలిగి ఉంటుందని, బంగారం మరియు నలుపు షేడ్స్‌లో డ్యూయల్ టోన్ డిజైన్‌తో వస్తుంది. కెమెరా సెటప్‌లో 200MP భారీ ప్రైమరీ కెమెరా ఉంటుంది, అయితే మిగిలిన రెండు సెన్సార్ల గురించి ఎలాంటి వివరాలు వెల్లడించలేదు. కెమెరా మాడ్యూల్ పైభాగంలో LED ఫ్లాష్ కూడా అమర్చబడ్డారు

ఇక ఈ ఫోన్ యొక్క డిజైన్ ను గమనిస్తే, ప్రముఖ సంస్థ అయిన GUCCI మాజీ డిజైనర్ మాటియో మెనోట్టో ఈ ఫోన్ ను డిజైన్ చేసారు. ఈ ఫోన్ "సన్‌రైజ్ సిటీ" అని పిలువబడే లేత గోధుమరంగు ఫాక్స్ లెదర్ బ్యాక్ ప్యానెల్‌తో వంగిన వెనుక మరియు ఫ్రేమ్‌ను కలిగి ఉంటుంది. వెనుక ప్యానెల్ బంగారం మరియు వెండి కుట్టుతో నిలువు గీతను కలిగి ఉంటుంది. ఈ ఫోన్ యొక్క కుడి వైపున, పవర్ మరియు వాల్యూమ్ బటన్లు ఉన్నాయి, అయితే SIM ట్రే, USB టైప్-C పోర్ట్ మరియు స్పీకర్ గ్రిల్ దిగువ అంచున ఉన్నాయి.

ఇక ఈ రియల్ మీ 11 ప్రో+ ఫోన్ యొక్క అంచనా స్పెసిఫికేషన్లను గమనిస్తే,
FHD+ రిజల్యూషన్‌తో కూడిన పెద్ద 6.7 అంగుళాల అమోలెడ్ డిస్‌ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్ మరియు 2160Hz PWM హై ఫ్రీక్వెన్సీ డిమ్మింగ్‌తో సహా అనేక రకాల హై-ఎండ్ స్పెసిఫికేషన్‌లతో ఈ రియల్ మీ 11 ప్రో+ ఫోన్ ప్యాక్ చేయబడుతుందని అంచనా వేయబడింది. ఇందులో డైమెన్సిటీ 7 సిరీస్ ప్రాసెసర్‌ మరియు గరిష్టంగా 16GB RAM మరియు స్టోరేజీ గరిష్టంగా 1TB వరకు మద్దతు అందించవచ్చని భావిస్తున్నారు.

అంతేకాకుండా, ఈ ఫోన్ 100W ఫాస్ట్ ఛార్జింగ్‌ మద్దతుతో శక్తివంతమైన 5,000mAh బ్యాటరీని తీసుకువస్తుందని అంచనా వేయబడింది. పరికరాన్ని నిమిషాల వ్యవధిలో ఛార్జ్ చేయవచ్చని కూడా నివేదికలు చెప్తున్నాయి. Realme 11 Pro+ తో పాటు, Realme 11 Pro మరియు స్టాండర్డ్ వెర్షన్ Realme 11ని కూడా లాంచ్ చేసే అవకాశం ఉంది నివేదికలు తెలియచేస్తున్నాయి.

Best Mobiles in India

English summary
Realme 11 Pro Plus With 200MP Camera Design Revealed, Ahead Of The May 10 Launch. Specifications Details.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X