Realme 12 Pro 5G సిరీస్ సేల్ ప్రారంభం అయింది.. ధర, ఆఫర్ల వివరాలు..!
రియల్‌మి 12 ప్రో సిరీస్ ఇటీవల భారత్‌లో విడుదల అయింది. ఈ సిరీస్‌లో భాగంగా Realme 12 Pro 5G, Realme 12 Pro Plus 5G స్మార్ట్‌ఫోన్లు అందుబాటులోకి వచ్చాయి. ఈ రెండు స్మార్ట్‌ఫోన్లు ఇవాళ్టి నుంచి కొనుగోలుకు అందుబాటులోకి వచ్చాయి.
రియల్‌మి 12 ప్రో సిరీస్ స్మార్ట్‌ఫోన్లను.. Realme.com, ప్రముఖ ఈ-కామర్స్ ప్లాట్‌ఫాం ఫ్లిప్‌కార్ట్ సహా ఇతర భాగస్వామ్య ప్లాట్‌ఫాంల నుంచి కొనుగోలు చేయవచ్చు. ఇవాళ్టి మధ్యాహ్నం 12 గంటల నుంచి సేల్ ప్రారంభం అయింది. రియల్‌మి 12 ప్రో.. 8GB ర్యామ్ +128GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.25,999గా ఉంది. అదే 8GB ర్యామ్+ 256GB అంతర్గత స్టోరేజీ రూ.26,999 గా ఉంది.

రియల్‌మి 12 ప్రో ప్లస్ 5G స్మార్ట్‌ఫోన్.. 8GB ర్యామ్+ 128GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.29,999గా ఉంది. అదే 8GB ర్యామ్ +256GB వేరియంట్ ధర రూ.31,999గా ఉంది. మరియు 12GB ర్యామ్ +256GB అంతర్గత స్టోరేజీ వేరియంట్ ధర రూ.33,999 గా ఉంది.
రియల్‌మి అధికారిక వెబ్‌సైట్ నుంచి ఈ స్మార్ట్‌ఫోన్లను కొనుగోలు చేసేవారికి రూ.2000 విలువైన డిస్కౌంట్ కూపన్‌ను పొందవచ్చు. దీంతోపాటు ఇయర్‌బడ్స్‌ను ఉచితంగా పొందవచ్చు. అదే ఫ్లిప్‌కార్ట్ ద్వారా ఎంపిక చేసిన బ్యాంకు కార్డుల ద్వారా కొనుగోలు చేస్తే రియల్‌మి 12 ప్రో 5G స్మార్ట్‌ఫోన్‌పైన రూ.1000, రియల్‌మి 12 ప్రో ప్లస్ 5G స్మార్ట్‌ఫోన్‌పైన రూ.2000 తగ్గింపును పొందవచ్చు.
రియల్‌మి 12 ప్రో ప్లస్ స్మార్ట్‌ఫోన్ స్పెసిఫికేషన్లు :
రియల్‌మి 12 ప్రో ప్లస్ స్మార్ట్‌ఫోన్ (Realme 12 Pro Plus) 6.7 అంగుళాల OLED కర్వడ్ డిస్‌ప్లేను కలిగి ఉంది. మరియు 120Hz రీఫ్రెష్ రేట్, 950 నిట్స్ గరిష్ఠ బ్రైట్‌నెస్‌తో వస్తుంది. ఈ హ్యాండ్‌సెట్ క్వాల్‌కాం స్నాప్ డ్రాగన్ 7s జెన్ 2 CPU మరియు అడెన్నో 710 చిప్‌సెట్ పైన పనిచేస్తుంది.
రియల్‌మి 12 ప్రో ప్లస్ స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ 14 ఆధారిత రియల్‌మి UI 5.0 OS ను కలిగి ఉంటుంది. దీంతోపాటు ఈ హ్యాండ్‌సెట్ 67W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టుతో 5000mAh బ్యాటరీ ప్యాక్‌ను కలిగి ఉంటుంది. మరియు మెరుగైన మల్టీమీడియా సపోర్టు కోసం ఈ హ్యాండ్‌సెట్ డాల్బీ అట్మా్స్ ఆధారిత స్టీరియో స్పీకర్లను కలిగి ఉంది.
రియల్‌మి 12 ప్రో ప్లస్ స్మార్ట్‌ఫోన్ వెనుకవైపు ట్రిపుల్ కెమెరాలను కలిగి ఉంటుంది. ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (OIS) సపోర్టుతో 50MP ప్రధాన కెమెరా, 8MP అల్ట్రావైడ్ యాంగిల్ కెమెరా, 64MP టెలిఫోటో కెమెరాను కలిగి ఉంది. సెల్ఫీ, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ 32MP కెమెరాను కలిగి ఉంది.
రియల్‌మి 12 ప్రో 5G స్పెసిఫికేషన్లు: ఈ స్మార్ట్‌ఫోన్ 6.7 అంగుళాల OLED కర్వడ్ డిస్‌ప్లేను కలిగి ఉంది. 120Hz రీఫ్రెష్ రేట్, 950 నిట్స్ గరిష్ఠ బ్రైట్‌నెస్‌తో వస్తుంది. ఆండ్రాయిడ్ 14 ఆధారిత రియల్‌మి UI 5.0 OS ను కలిగి ఉంటుంది. స్నాప్ డ్రాగన్ 6 జెన్ 2 SoC చిప్‌ను కలిగి ఉంటుంది. 67W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టుతో 5000mAh బ్యాటరీ ప్యాక్‌ను కలిగి ఉంటుంది.
ఈ ఫోన్ OIS (ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్) సపోర్టుతో 50MP సోని IMX882 ప్రధాన కెమెరాను కలిగి ఉంటుంది. మరియు 32MP సోనీ IMX709 టెలిఫోటో పోర్ట్రెయిట్ కెమెరా, 8MP అల్ట్రావైడ్ లెన్స్‌ను కలిగి ఉంది. ముందువైపు 16MP సెల్ఫీ కెమెరాను కలిగి ఉంది. రియల్‌మి 12 ప్రో, ప్రో ప్లస్ మోడళ్లు సబ్‌మెరెన్ బ్లూ, నావిగేటర్ బీజ్ రంగుల్లో వేగాన్ లెదర్ వెనుక ప్యానళ్లను కలిగి ఉంటుంది.


Click it and Unblock the Notifications