Home
News

64MP టెలిఫోటో కెమెరా, 256GB స్టోరేజీ రియల్‌మి స్మార్ట్‌ఫోన్‌ పై బెస్ట్ ఆఫర్లు.. ధర, సేల్‌ వివరాలు!

రియల్‌మి 12 ప్రో సిరీస్‌ను భారత్‌లో జనవరి 29న లాంచ్‌ చేశారు. ఈ ఫోన్‌ ముందస్తు బుకింగ్‌లు కూడా ప్రముఖ ఈ-కామర్స్‌ సంస్థ ఫ్లిప్‌ కార్ట్‌ ( Flipkart ) ద్వారా చేసుకోవచ్చు. ఈ సందర్భంగా ఫ్లిప్‌ కార్ట్‌ ఆకర్షణీయమైన ఆఫర్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఫలితంగా ఈ హ్యాండ్‌సెట్‌ను తక్కువ ధరకు కొనుగోలు చేయవచ్చు.

రియల్‌మి 12 ప్రో+ స్పెసిఫికేషన్లు : రియల్‌మి 12 ప్రో+ స్మార్ట్‌ఫోన్ ( Realme 12 Pro Plus Smartphone ) 6.7 అంగుళాల OLED కర్వడ్‌ డిస్‌ప్లేను కలిగి ఉంది. మరియు 120Hz రీఫ్రెష్‌ రేట్‌, 950 నిట్స్‌ గరిష్ఠ బ్రైట్‌నెస్‌తో వస్తుంది. ఈ హ్యాండ్‌సెట్ క్వాల్‌కాం స్నాప్‌ డ్రాగన్‌ 7s జెన్‌ 2 CPU మరియు అడెన్నో 710 చిప్‌సెట్‌ పైన పనిచేస్తుంది.

realme-12-pro-plus

67W ఛార్జర్‌. 5000mAh బ్యాటరీ : రియల్‌మి 12 ప్రో+ స్మార్ట్‌ ఫోన్‌ ఆండ్రాయిడ్‌ 14 ఆధారిత రియల్‌మి UI 5.0 OS ను కలిగి ఉంటుంది. దీంతోపాటు ఈ హ్యాండ్‌సెట్‌ 67W ఫాస్ట్‌ ఛార్జింగ్‌ సపోర్టుతో 5000mAh బ్యాటరీ ప్యాక్‌ను కలిగి ఉంటుంది. మరియు మెరుగైన మల్టీమీడియా సపోర్టు కోసం ఈ హ్యాండ్‌సెట్‌ డాల్బీ అట్మా్స్‌ ఆధారిత స్టీరియో స్పీకర్లను కలిగి ఉంది.

ఆకట్టుకొనే ఫొటోగ్రఫీ కోసం : రియల్‌మి 12 ప్రో+ స్మార్ట్‌ ఫోన్‌ వెనుకవైపు ట్రిపుల్ కెమెరాను కలిగి ఉంటుంది. ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్‌ (OIS) సపోర్టుతో 50MP ప్రధాన కెమెరా, 8MP అల్ట్రావైడ్‌ యాంగిల్‌ కెమెరా, 64MP టెలిఫోటో కెమెరాను కలిగి ఉంది. సెల్ఫీ, వీడియో కాల్స్‌ కోసం ఈ ఫోన్‌ 32MP కెమెరాను కలిగి ఉంది.

realme-12-pro-plus

ఫ్లిప్‌కార్ట్‌లో ప్రస్తుతం రియల్‌మీ 12 ప్రో+ స్మార్ట్‌ ఫోన్‌ 8GB ర్యామ్‌ +256GB అంతర్గత స్టోరేజీ వేరియంట్‌ ధర రూ.31,999 గా ఉంది. మరియు 12GB ర్యామ్‌+ 256GB స్టోరేజీ వేరియంట్‌ ధర రూ.33,999 గా ఉంది. అయితే ఎంపిక చేసిన బ్యాంకు కార్డుల ద్వారా కొనుగోలు చేస్తే రూ.2000 తగ్గింపును పొందవచ్చు. దీంతోపాటు ఎక్స్చేంజీ ఆఫర్‌ కింద రూ.4000 తగ్గింపును పొందవచ్చు.

రెండు రంగుల్లో లభిస్తుంది : ఎక్స్చేంజీ ఆఫర్‌ ద్వారా రూ.4000 నుంచి గరిష్ఠంగా రూ.32,750 వరకు తగ్గింపును పొందవచ్చని ఫ్లిప్‌కార్ట్‌ పేజీ ఆధారంగా తెలుస్తోంది. ఈ స్మార్ట్‌ఫోన్‌ నేవిగేటర్‌ బీజ్‌, సబ్‌మెరెన్‌ బ్లూ రంగుల్లో ప్రస్తుతం అందుబాటులో ఉంది. కనెక్టివిటీ పరంగా ఈ స్మార్ట్‌ ఫోన్‌ వైఫై 6, బ్లూటూత్‌ 5.2 మరియు USB-C ఛార్జింగ్‌ పోర్టును కలిగి ఉంది.

గిజ్‌బాట్‌ తెలుగు వెబ్‌సైట్ గ్యాడ్జెట్లు సహా ఇతర టెక్‌ న్యూస్‌కు సంబంధించిన ఆసక్తికరమైన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా వార్తల కోసం సోషల్‌ మీడియా ఖాతాలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.

Best Mobiles in India

English summary
Realme 12 Pro Plus attracts with offers on flipkart
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X