Home
News

రియల్‌మి 12 ప్రో ప్లస్‌ స్పెషల్‌ ఎడిషన్‌ స్మార్ట్‌ఫోన్‌.. ఆకట్టుకున్న డిజైన్‌, లాంచ్‌ వివరాలు..!

రియల్‌మి సంస్థ భారత్‌లో తమ ఫోర్ట్‌ఫోలియోను (Realme India) క్రమంగా విస్తరిస్తోంది. ఇందులో భాగంగా జనవరి 29న రియల్‌మి 12 ప్రో సిరీస్‌ స్మార్ట్‌ఫోన్లను లాంచ్‌ చేసింది. ఈ సిరీస్‌లో రియల్‌మి 12 ప్రో, రియల్‌మి 12 ప్రో ప్లస్‌ స్మార్ట్‌ఫోన్లు ఉన్నాయి. ప్రస్తుతం భారత్‌లో ఈ రెండు ఫోన్ల సేల్‌ ప్రారంభం అయింది.

అయితే తాజాగా రియల్‌మి సంస్థ రియల్‌ 12 ప్రో ప్లస్‌ (Realme 12 pro plus transparent back) ప్రత్యేక వేరియంట్‌ను విడుదల చేయాలని భావిస్తోంది. ఇందుకు సంబంధించిన వివరాలను రియల్‌మి సంస్థ యూరప్‌ సీఈవో ప్రాన్సిస్‌ వాంగ్‌ తన X ఖాతా ద్వారా వెల్లడించారు. ఈ కొత్త వేరియంట్ పరిమిత సంఖ్యలో మాత్రమే అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని, త్వరలో విడుదల కానుందని తెలుస్తోంది.

realme 12 pro plus may get transparent back edition

రియల్‌మి 12 ప్రో ప్లస్‌ స్మార్ట్‌ఫోన్ స్పెసిఫికేషన్లు :
ఇటీవల విడుదలైన రియల్‌మి 12 ప్రో ప్లస్‌ స్మార్ట్‌ఫోన్ 6.7 అంగుళాల OLED కర్వడ్‌ డిస్‌ప్లేను కలిగి ఉంది. మరియు 120Hz రీఫ్రెష్‌ రేట్‌, 950 నిట్స్‌ గరిష్ఠ బ్రైట్‌నెస్‌తో వస్తుంది. ఈ హ్యాండ్‌సెట్ క్వాల్‌కాం స్నాప్‌ డ్రాగన్‌ 7s జెన్‌ 2 CPU మరియు అడెన్నో 710 చిప్‌సెట్‌ పైన పనిచేస్తుంది.

రియల్‌మి 12 ప్రో+ స్మార్ట్‌ఫోన్‌ ఆండ్రాయిడ్‌ 14 ఆధారిత రియల్‌మి UI 5.0 OS ను కలిగి ఉంటుంది. దీంతోపాటు ఈ హ్యాండ్‌సెట్‌ 67W ఫాస్ట్‌ ఛార్జింగ్‌ సపోర్టుతో 5000mAh బ్యాటరీ ప్యాక్‌ను కలిగి ఉంటుంది. మరియు మెరుగైన మల్టీమీడియా సపోర్టు కోసం ఈ హ్యాండ్‌సెట్‌ డాల్బీ అట్మా్స్‌ ఆధారిత స్టీరియో స్పీకర్లను కలిగి ఉంది.

రియల్‌మి 12 ప్రో+ స్మార్ట్‌ఫోన్‌ వెనుకవైపు ట్రిపుల్ కెమెరాను కలిగి ఉంటుంది. ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్‌ (OIS) సపోర్టుతో 50MP ప్రధాన కెమెరా, 8MP అల్ట్రావైడ్‌ యాంగిల్‌ కెమెరా, 64MP టెలిఫోటో కెమెరాను కలిగి ఉంది. సెల్ఫీ, వీడియో కాల్స్‌ కోసం ఈ ఫోన్‌ 32MP కెమెరాను కలిగి ఉంది.

రియల్‌మి 12 ప్రో 5G స్మార్ట్‌ఫోన్‌ 6.7 అంగుళాల OLED కర్వడ్‌ డిస్‌ప్లేను కలిగి ఉంది. మరియు 120Hz రీఫ్రెష్‌ రేట్‌, 950 నిట్స్‌ గరిష్ఠ బ్రైట్‌నెస్‌తో వస్తుంది. ఆండ్రాయిడ్‌ 14 ఆధారిత రియల్‌మి UI 5.0 OS ను కలిగి ఉంటుంది. స్నాప్‌ డ్రాగన్‌ 6 జెన్‌ 2 SoC చిప్‌ను కలిగి ఉంటుంది. 67W ఫాస్ట్‌ ఛార్జింగ్‌ సపోర్టుతో 5000mAh బ్యాటరీ ప్యాక్‌ను కలిగి ఉంటుంది.

ఈ ఫోన్ వెనుకవైపు ట్రిపుల్‌ కెమెరాలను కలిగి ఉంటుంది. OIS (ఆప్టికల్‌ ఇమేజ్ స్టెబిలైజేషన్‌) సపోర్టుతో 50MP సోని IMX882 ప్రధాన కెమెరాను కలిగి ఉంటుంది. మరియు 32MP సోనీ IMX709 టెలిఫోటో పోర్ట్రెయిట్‌ కెమెరా, 8MP అల్ట్రావైడ్‌ లెన్స్‌ను కలిగి ఉంది. ముందువైపు 16MP సెల్ఫీ కెమెరాను కలిగి ఉంది.

గిజ్‌బాట్‌ తెలుగు వెబ్‌సైట్ గ్యాడ్జెట్లు సహా ఇతర టెక్‌ న్యూస్‌కు సంబంధించిన ఆసక్తికరమైన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా వార్తల కోసం సోషల్‌మీడియా ఖాతాలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.

More from GizBot

Best Mobiles in India

English summary
Realme planning to launch realme 12 pro plus with transparent back edition
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X