Home
News

రియల్‌మీ నుంచి కొత్త స్మార్ట్‌ఫోన్లు.. తాజాగా కీలక స్పెసిఫికేషన్లు, ఫీచర్లు లీక్‌..!

రియల్‌మి నుంచి త్వరలో రెండు స్మార్ట్‌ఫోన్లు విడుదల కానున్నాయి. జనవరి 29 మధ్యాహ్నం 12 గంటలకు రియల్‌మి 12 ప్రో సిరీస్‌ (Realme 12 Pro+) స్మార్ట్‌ఫోన్లు లాంచ్‌ కానున్నాయి. ఈ సిరీస్‌లో రియల్‌మి 12 ప్రో, రియల్‌మి 12 ప్రో ప్లస్‌ స్మార్ట్‌ఫోన్లు ఉన్నాయి. ఈ హ్యాండ్‌సెట్‌లకు సంబంధించిన అనేక లీక్‌లు ఇప్పటికే వచ్చాయి.

64MP పెరిస్కోపిక్‌ జూమ్‌ లెన్స్‌ : అయితే తాజాగా ఈ స్మార్ట్‌ఫోన్‌కు సంబంధించిన రిటైల్‌ ప్యాకేజింగ్‌ ఫోటో బయటకు వచ్చింది. దీని ఆధారంగా కీలక స్పెసిఫికేషన్ల గురించి తెలిసింది. రియల్‌మి 12 ప్రో ప్లస్‌ హ్యాండ్‌సెట్ 64MP పెరిస్కోపిక్‌ జూమ్‌ లెన్స్‌ను కలిగి ఉంటుందని తెలుస్తోంది. ఈ కెమెరా ఆప్టికల్‌ ఇమేజ్‌ స్టెబిలైజేషన్‌ ఫీచర్‌ను సపోర్టు చేస్తుందని సమాచారం. చిప్‌సెట్‌, రిఫ్రెష్‌ రేట్‌ కూడా వెలుగులోకి వచ్చాయి.

 realme-12-pro-series-latest news,

ఇన్‌ డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్‌ సెన్సార్‌ : ఇప్పటికే వచ్చిన కొన్ని లీక్‌ల ఆధారంగా రియల్‌మి 12 ప్రో ప్లస్‌ స్మార్ట్‌ఫోన్‌ 6.7 అంగుళాల కర్వడ్‌ అమోలెడ్‌ పుల్‌ HD+ డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. మరియు 120Hz రిఫ్రెష్‌ రేట్‌తో వస్తుంది. దీంతోపాటు ఇన్‌ డిస్‌ప్లే ఫింగర్‌ ప్రింట్‌ సెన్సార్‌తో వస్తుందని తెలుస్తోంది.

ఆండ్రాయిడ్‌ 14 ఆధారిత OS : రియల్‌మి 12 ప్రో ప్లస్‌ అండర్‌ ది హుడ్‌ స్నాప్‌ డ్రాగన్‌ 7 జెన్‌ 2 చిప్‌సెట్‌ ను కలిగి ఉంటుందని తెలుస్తోంది. ఈ చిప్‌ 12GB ర్యామ్‌ మరియు 512GB స్టోరేజీతో జతచేయబడినట్లు సమాచారం. ప్రో ప్లస్‌ స్మార్ట్‌ఫోన్‌ ఆండ్రాయిడ్‌ 14 ఆధారిత రియల్‌మి UI 5 పైన పనిచేస్తుందని భావిస్తున్నారు.

 realme-12-pro-series-latest news,

అధికారిక ఫోటోల ఆధారంగా రియల్‌మి 12 ప్రో ప్లస్‌ వెనుకవైపు ట్రిపుల్‌ కెమెరాలతో కూడిన వృత్తాకార మాడ్యూల్‌ను కలిగి ఉంది. 50MP సోనీ IMX890 ప్రధాన కెమెరా, 120X జూమ్‌ సామర్థ్యాలు కలిగిన 64MP పెరిస్కోప్‌ లెన్స్‌ను అమర్చినట్లు తెలుస్తోంది. అయితే మూడో కెమెరా వివరాలు తెలియాల్సి ఉంది. 8MP అల్ట్రా వైడ్‌ లెన్స్‌ను అమర్చే అవకాశం ఉంది. అలాగే కెమెరా మాడ్యుల్ గోల్డెన్‌ మెటాలిక్‌ డయల్‌ను పొందుతుంది.

ఈ ప్రో మోడల్‌ 67W ఫాస్ట్‌ ఛార్జింగ్‌ సపోర్టుతో 5000mAh బ్యాటరీ సామర్థ్యాన్ని కలిగి ఉండనుంది. దీంతోపాటు ఈ హ్యాండ్‌సెట్‌ నావిగేటర్‌ బీజ్‌ మరియు సబ్‌మెరైన్‌ బ్లూ రంగుల్లో లభిస్తుందని తెలుస్తోంది. విడుదల దగ్గర పడే కొద్ది మరిన్ని ఫీచర్లు, స్పెసిఫికేషన్ల వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది. అయితే ఇప్పటికే లీక్‌ అయిన స్పెసిఫికేషన్లపై రియల్‌మి అధికారికంగా స్పందించలేదు.

 realme-12-pro-series-latest news,

గిజ్‌బాట్‌ తెలుగు వెబ్‌సైట్ గ్యాడ్జెట్లు సహా ఇతర టెక్‌ న్యూస్‌కు సంబంధించిన ఆసక్తికరమైన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా వార్తల కోసం సోషల్‌మీడియా ఖాతాలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.

More from GizBot

Best Mobiles in India

English summary
Realme 12 Pro series key specifications leaked ahead of launch on january 29
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X