ధర రూ.15000 కంటే తక్కువ ధరకు 6000mAh బ్యాటరీ, IP69 రేటింగ్‌తో 5G స్మార్ట్‌ఫోన్..!
ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌ల తయారీ సంస్థ రియల్‌మి (Realme India) నుంచి గత నెలలో రియల్‌మి GT 7 ప్రో హ్యాండ్‌సెట్ భారత్ మార్కెట్‌లో లాంచ్ అయింది. అదే నెలలో తొలి సేల్ ప్రారంభం అయింది. త్వరలో రియల్‌మి నుంచి మరో హ్యాండ్‌సెట్ విడుదల కానుంది. రియల్‌మి 14x స్మార్ట్‌ఫోన్ (Realme 14x 5G Smartphone) భారత్ మార్కెట్‌లో డిసెంబర్ 18 వ తేదీన లాంచ్ కానుంది. దీంతోపాటు ఈ హ్యాండ్‌సెట్ రూ.15,000 కంటే తక్కువ ధరకే లభిస్తుందని రియల్‌మి తెలిపింది. అయితే హ్యాండ్‌సెట్ గురించి మరిన్ని వివరాలు వెల్లడయ్యాయి.
రియల్‌మి 14x స్మార్ట్‌ఫోన్ బ్యాటరీ వివరాలు తాజాగా వెల్లడయ్యాయి. సంస్థ అందించిన వివరాల ఆధారంగా ఈ హ్యాండ్‌సెట్ 45W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టుతో 6000mAh బ్యాటరీతో పనిచేస్తుంది. 50 శాతం ఛార్జింగ్ కేవలం 38 నిమిషాల్లో పూర్తవుతుందని తెలిపింది. అదే 100 శాతం ఛార్జింగ్‌ను కేవలం 93 నిమిషాల్లో పూర్తి చేయవచ్చని వెల్లడించింది. స్మార్ట్ ఛార్జింగ్ అల్గారిథమ్‌ను కలిగి ఉంది.

దీంతోపాటు ఈ రియల్‌మి స్మా్ర్ట్‌ఫోన్ కెమెరా, డిస్‌ప్లే వంటి వివరాలపై సంస్థ ఎటువంటి ప్రకటన చేయలేదు. అయితే ఇప్పటికే వచ్చిన లీక్‌ల ఆధారంగా రియల్‌మి 14x స్మార్ట్‌ఫోన్ 6.67 అంగుళాల HD+ LCD డిస్‌ప్లేను కలిగి ఉంటుందని తెలుస్తోంది. కెమెరా విభాగం పరంగా 50MP ప్రైమరీ కెమెరాను కలిగి ఉండే అవకాశం ఉంది.
ఈ హ్యాండ్‌సెట్ మీడియాటెక్ డైమెన్సిటీ 6300 SoC చిప్‌సెట్ తో లాంచ్ కానుందని తెలుస్తోంది. ఈ చిప్‌సెట్ 8GB ర్యామ్ మరియు గరిష్ఠంగా 256GB స్టోరేజీతో జతచేయబడి ఉంటుందని సమాచారం. ఈ హ్యాండ్‌సెట్ స్టోరేజీ వేరియంట్‌ల వివరాలు తెలియాల్సి ఉంది. దీంతోపాటు ఈ హ్యాండ్‌సెట్ కుడివైపున పవర్, వాల్యూమ్ బటన్‌లను కలిగి ఉంటుందని తెలుస్తోంది.
దీంతోపాటు ఈ హ్యాండ్‌సెట్ IP69 రేటింగ్‌తో కూడిన డస్ట్ మరియు వాటర్ రెసిస్టెంట్‌గా అందుబాటులోకి రానుందని రియల్‌మి వెల్లడించింది. మరియు ఈ రియల్‌మి 14X స్మార్ట్‌ఫోన్ మూడు రంగుల్లో విడుదల కానుంది. యెల్లో, బ్లాక్, రెడ్ రంగుల్లో లభిస్తుంది.
అయితే డిసెంబర్ 18 వ తేదీన భారత్ మార్కెట్‌లో విడుదల కానుంది. ఈ హ్యాండ్‌సెట్ కోసం పైన తెలిపిన కొన్ని వివరాలపై సంస్థ ఎటువంటి అధికారిక ప్రకటన చేయలేదు. త్వరలో కచ్చితమైన వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది. ఈ హ్యాండ్‌సెట్ రూ.15,000 కంటే తక్కువ ధరలో అందుబాటులోకి రానుందని తెలిపింది.
గత నెలలో విడుదలైన రియల్‌మి GT 7 ప్రో స్మార్ట్‌ఫోన్ 6.78 అంగుళాల FHD+ LTPO అమోలెడ్ క్వాడ్ కర్వడ్ డిస్‌ప్లేను కలిగి ఉంది. ఆండ్రాయిడ్ 15 ఆధారిత రియల్‌మి UI 6.0, స్నాప్‌డ్రాగన్ 8 Elite SoC చిప్‌సెట్‌తో పనిచేస్తుంది. కెమెరా విభాగం పరంగా 50MP + 50MP+ 8MP కెమెరాలు సహా 16MP సెల్ఫీ కెమెరాలను కలిగి ఉంది. 120W ఫాస్ట్ ఛార్జర్‌ను సపోర్టుతో 5800mAh బ్యాటరీని కలిగి ఉంది.
రియల్‌మి GT 7 ప్రో స్మార్ట్‌ఫోన్ 12GB ర్యామ్ + 256GB స్టోరేజీ, 16GB ర్యామ్ + 512GB స్టోరేజీ వేరియంట్‌లలో అందుబాటులో ఉంది. 12GB ర్యామ్ ధర రూ.59,999, 16GB ర్యామ్ వేరియంట్ ధర రూ.65999 కు కొనుగోలు చేయవచ్చు.


Click it and Unblock the Notifications








