రెండవ సారి అద్భుతమైన ఆఫర్లతో ఫ్లిప్ కార్ట్ లో రియల్మీ 3 ప్రో అమ్మకాలు

Realme 3 ప్రో భారతదేశంలో రెండవ సారి ఫ్లిప్ కార్ట్ మరియు రియల్ మి ఆన్లైన్ స్టోర్ ద్వారా విక్రయించబడుతోంది.

|

Realme 3 ప్రో భారతదేశంలో రెండవ సారి ఫ్లిప్ కార్ట్ మరియు రియల్ మి ఆన్లైన్ స్టోర్ ద్వారా విక్రయించబడుతోంది. గత వారం భారతదేశం లో Oppo స్పిన్-ఆఫ్ బ్రాండ్ నుండి కొత్త ఫ్లాగ్ షిప్ ప్రారంభించబడింది. మరియు సోమవారం ఏప్రిల్ 29న భారతదేశం లో మొదటి సారి అమ్మకాలు జరిగాయి.

realme 3 pro may 3 second sale flipkart realme store price in india specifications

ముఖ్యంగా ఆ రోజు కంపెనీ రియల్ మి3 ప్రో 12pm (మధ్యాహ్నం) 4pm మరియు 8pm IST - మూడు వేర్వేరు సమయాలలో అమ్మకాలు జరిగాయి. శుక్రవారం నాడు ఒకటిన్నరకు ఫ్లాష్ అమ్మకాలలో రియల్ మి3ప్రో ఫోన్ అందుబాటులో ఉంటుంది అని తెలియడంతో ఈ రోజు 12 గంటల (మధ్యాహ్నం) IST షెడ్యూల్ సమయంలో మాత్రమే అమ్మకాలు జరుగుతాయి. Realme 3 ప్రో రెండో అమ్మకం రియల్లీ 1 వ వార్షికోత్సవ అమ్మకం మధ్యలో వస్తుంది ఇది గురువారం ప్రారంభమై శనివారం ముగిస్తుంది.

రియల్మీ 3 ప్రో ధరలు:

రియల్మీ 3 ప్రో ధరలు:

ఇండియాలో రియల్మీ 3 ప్రో 4GB RAM+ 64GB ఇంటర్నల్ స్టోరేజి వేరియంట్ కోసం రూ.13,999గాను 6GB RAM + 64GBఇంటర్నల్ స్టోరేజి వేరియంట్ రూ.15,999గాను మరియు దాని 6GB RAM + 128GB ఇంటర్నల్ స్టోరేజి వేరియంట్ కోసం రూ.16.999గా నిర్ణయించారు. ఇది కార్బన్ గ్రే, నైట్రో బ్లూ, మరియు మెరుపు పర్పుల్ రంగులలో వస్తుంది. ఇది ఈ రోజు నుంచి రియల్ మి ఆన్లైన్ స్టోర్ మరియు ఫ్లిప్ కార్ట్ ద్వారా మళ్ళీ వినియోగదారులుకు అందుబాటులో ఉంటాయి.

రియల్మీ 3 ప్రో ఆఫర్స్ :

రియల్మీ 3 ప్రో ఆఫర్స్ :

ఆఫర్లను ఇవ్వడంలో ముందు ఉండే ఈ సంస్థ ఇప్పుడు కూడా మంచి ఆఫర్స్ ని ప్రకటించింది.సంస్థ యొక్క ఆన్లైన్ స్టోర్ ద్వారా కొనుగోలుదారులు Mobikwik ద్వారా చెల్లింపులో 15 శాతం సూపర్ క్యాష్ బ్యాక్ (రూ .1,500 వరకు)పొందవచ్చు.


ఫ్లిప్ కార్ట్ ద్వారా రియల్ మి3ప్రోని కొనుగోలు చేసిన వారికి HDFC బ్యాంక్ క్రెడిట్ కార్డులు, డెబిట్ కార్డులు మీద రూ.1000 డిస్కౌంట్ కూడా ఉంటుంది.అంతేకాకుండా ఫ్లిప్ కార్ట్ లొ EMI ద్వారా కొనుగోలు చేసే ప్రతి ఒక్కరికి ఆరు నెలల వరకు EMI కాస్ట్ ఉండదు.

 

రియల్ మి 3 ప్రో స్పెసిఫికేషన్స్ :

రియల్ మి 3 ప్రో స్పెసిఫికేషన్స్ :

డ్యూయల్-సిమ్ (నానో) రియల్ మి 3 ప్రో ColorOS 6.0తో Android 9 పై నడుస్తుంది. 19.5: 9 కాపర్ రేషియో మరియు గొరిల్లా గ్లాస్ 5 తో 6.3-inch ఫుల్ HD స్క్రీన్ కలిగి ఉంది. ఇది క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్710 SoC చేత 4GB / 6GB RAM మరియు అడ్రినో 616 GPU తో జత చేయబడింది. మైక్రో SD కార్డు ( 256GB వరకు) విస్తరించవచ్చు. దీని ఇంటర్నల్ స్టోరేజీ 64GB /128GBగా ఉంది.

ఈ మొబైల్ బ్యాక్ సైడ్ డ్యూయల్ కెమెరా సెటప్ను కలిగి ఉంది ఇది 16 మెగాపిక్సెల్ ప్రాధమిక కెమెరాని f /1.7 ఎపర్చరు మరియు 5 మెగాపిక్సెల్ సెకండరీ కెమెరాతో f / 2.4 ఎపర్చరుతో ఉంటుంది. Realme 3 ప్రో ముందు వైపు f/2.0 ఎపర్చరుతో 25-మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఉంటుంది.

 

రియల్ మి 3 ప్రో స్పెసిఫికేషన్స్ :

రియల్ మి 3 ప్రో స్పెసిఫికేషన్స్ :

డిస్ప్లే ---- 6.3-inch
ప్రాసెసర్ ------ ఆక్టా -కోర్
ఫ్రంట్ కెమెరా ---- 25 మెగాపిక్సెల్
బ్యాక్ కెమెరా ----- 16-మెగాపిక్సెల్+ 5-మెగాపిక్సెల్
RAM ----- 6GB
OS ----- ఆండ్రాయిడ్ 9
స్టోరేజీ ----- 64GB
బ్యాటరీ కెపాసిటీ ---- 4045mAh
ధర ----- రూ. 13,999/రూ.16,999

Best Mobiles in India

English summary
realme 3 pro may 3 second sale flipkart realme store price in india specifications

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X