రూ.13 వేల సెగ్మెంట్లో బెస్ట్ స్మార్ట్‌ఫోన్, తగ్గింపుకు వచ్చింది

By Gizbot Bureau
|

మొబైల్స్ తయారీదారు ఒప్పోకు చెందిన సబ్‌బ్రాండ్ రియల్‌మి త‌న రియ‌ల్‌మి 3 ప్రో స్మార్ట్‌ఫోన్‌ను 2019లో మార్కెట్లోకి తీసుకువచ్చిన సంగతి విదితమే. ఈ ఫోన్ రియల్‌మి 5 ప్రోకి సక్సెసర్ గా వచ్చింది. ఈ ఫోన్ మార్కెట్లో సునామి అమ్మకాలతో దూసుకుపోతోంది. ఆకట్టుకునే పీచర్లు ఈ ఫోన్లో ఉండటం వల్ల యూజర్లు కూడా దీనివైపు మొగగ్గు చూపుతున్నారు. కాగా ఈ ఈ ఫోన్‌ను ఫ్లిప్‌కార్ట్ సైట్‌లో ప్ర‌త్యేకంగా విక్ర‌యానికి వచ్చింది. ఇప్పుడు బిగ్ బిలియన్ డేస్ సేల్ లో ఈ ఫోన్ భారీ తగ్గింపును అందుకోనుంది. లాంచింగ్ సమయంలో దీని ధర రూ.13,999గా ఉంది.అయితే ఇప్పుడు మూడు వేల రూపాయల డిస్కౌంట్ అందుకుని రూ. 10,999కే అందుబాటులోకి రానుంది.

రియ‌ల్‌మి 3 ప్రొ ఫీచ‌ర్లు...
 

రియ‌ల్‌మి 3 ప్రొ ఫీచ‌ర్లు...

6.3 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్ల‌స్ డిస్‌ప్లే, 2340 × 1080 పిక్స‌ల్స్ స్ర్కీన్ రిజ‌ల్యూష‌న్‌, గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్ష‌న్‌, ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగ‌న్ 710 ప్రాసెస‌ర్‌, 4/6 జీబీ ర్యామ్‌, 64/128 జీబీ స్టోరేజ్‌, 256 జీబీ ఎక్స్‌పాండ‌బుల్ స్టోరేజ్‌, డ్యుయ‌ల్ సిమ్‌, ఆండ్రాయిడ్ 9.0 పై, 16, 5 మెగాపిక్స‌ల్ డ్యుయ‌ల్ బ్యాక్ కెమెరాలు, 25 మెగాపిక్స‌ల్ సెల్ఫీ కెమెరా, ఫింగ‌ర్ ప్రింట్ సెన్సార్‌, డ్యుయ‌ల్ 4జీ వీవోఎల్‌టీఈ, డ్యుయ‌ల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 5.0, 4045 ఎంఏహెచ్ బ్యాట‌రీ, ఫాస్ట్ చార్జింగ్‌.

6జీబీ ర్యామ్‌, 64 జీబీ స్టోరేజ్ వేరియెంట్‌

6జీబీ ర్యామ్‌, 64 జీబీ స్టోరేజ్ వేరియెంట్‌

రియ‌ల్‌మి త‌న రియ‌ల్‌మి 3 ప్రొ స్మార్ట్‌ఫోన్‌కు గాను 6జీబీ ర్యామ్‌, 64 జీబీ స్టోరేజ్ వేరియెంట్‌ను కూడా భార‌త మార్కెట్‌లో విడుద‌ల చేసింది. రూ.15,999 ధ‌ర‌కు ఈ ఫోన్ అందుబాటులో ఉంది. ఈ ఫోన్లో మిగిలిన ఫీచ‌ర్ల‌న్నీ అలాగే ఉన్నాయి.

మొద‌టి ఫ్లాష్ సేల్‌లో..

మొద‌టి ఫ్లాష్ సేల్‌లో..

రియ‌ల్‌మి 3 ప్రొకు గాను నిర్వ‌హించిన మొద‌టి ఫ్లాష్ సేల్‌లో కేవ‌లం 8 నిమిషాల వ్య‌వ‌ధిలోనే 1.7 ల‌క్ష‌ల‌కు పైగా ఫోన్లు అమ్ముడ‌య్యాయి. ఏప్రిల్ నెలలో ఈ ఫోన్ విడుద‌ల కాగా దీనికి ఫ్లిప్‌కార్ట్‌, రియ‌ల్‌మి ఆన్‌లైన్ స్టోర్స్‌లో మొదటి ఫ్లాష్ సేల్ నిర్వ‌హించారు. అందులో 1.7 ల‌క్ష‌ల‌కు పైగా రియ‌ల్‌మి 3 ప్రొ ఫోన్ల‌ను విక్ర‌యించామ‌ని రియ‌ల్‌మి తెలిపింది.

రూ. 10 వేల బడ్జెట్లో బెస్ట్ ఫోన్
 

రూ. 10 వేల బడ్జెట్లో బెస్ట్ ఫోన్

ఒప్పో నుంచి వచ్చిన రియల్ మి 3ప్రో రూ. 10 వేల సెగ్మెంట్లో బెస్ట్ స్మార్ట్ ఫోన్ అని చెప్పవచ్చు. ఇందులో కెమెరాలు సోనీ సెన్సార్లను కలిగి ఉన్నాయి. ఈ సెన్సారు ఇంతకు ముందు వన్ ప్లస్ 5టీలో పొందుపరిచారు. ఇతర ఫోన్లకు ధీటుగా ఇది ఫోటోలను తన కెమెరాలో బంధిస్తుంది.

Most Read Articles
Best Mobiles in India

English summary
Flipkart Big Billion Days Sale 2019: Realme 3 Pro Offers And Discounts

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X