Home
News

Realme స్మార్ట్ టీవీ నియో బడ్జెట్ ధరలో ఎందుకు స్పెషల్ గా ఉంది! ఫ్లిప్‌కార్ట్ సేల్స్ లో అమ్మకాలు

ప్రముఖ టెక్ దిగ్గజం రియల్‌మి భారతదేశంలో రియల్‌మి స్మార్ట్ టీవీ నియో పేరుతో ఎంట్రీ లెవల్ ధర వద్ద ఆండ్రాయిడ్ స్మార్ట్ టీవీని విడుదల చేసింది. ఈ కొత్త రియల్‌మి స్మార్ట్ TV నియో 32-అంగుళాల (80cm) ప్రీమియం బెజెల్స్ LED డిస్‌ప్లేతో ఉంటుంది. డాల్బీ ఆడియో, సినిమాటిక్ అనుభవం మరియు అనేక ఇతర స్మార్ట్ ఫీచర్లను కలిగి ఉంది. రియల్‌మి నార్జో 50 సిరీస్ మరియు రియల్‌మి బ్యాండ్ 2 లతో పాటుగా ఆండ్రాయిడ్ టీవీ-పవర్డ్ స్మార్ట్ టీవీ విడుదల చేయబడింది.

Realme స్మార్ట్ టీవీ నియో ధర వివరాలు

Realme స్మార్ట్ టీవీ నియో ధర వివరాలు

రియల్‌మి ఆండ్రాయిడ్ స్మార్ట్ టీవీ నియో ఇండియాలో రూ.14,999 సరసమైన ధర వద్ద లాంచ్ చేయబడింది. ఈ రియల్‌మి స్మార్ట్ టీవీ నియో అక్టోబర్ 3 నుండి Realme.com, Flipkart మరియు దేశవ్యాప్తంగా ఇతర ఆఫ్‌లైన్ స్టోర్‌లలో కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంటుంది.

Realme స్మార్ట్ టీవీ నియో స్పెసిఫికేషన్స్

Realme స్మార్ట్ టీవీ నియో స్పెసిఫికేషన్స్

Realme యొక్క కొత్త స్మార్ట్ TV నియో 32-అంగుళాల బెజెల్ -లెస్ LED డిస్‌ప్లేతో మరియు బ్లూ లైట్ సర్టిఫికేషన్ TUV Rheinland తో అందించబడింది. ఈ స్మార్ట్ టీవీలోని క్రోమా బూస్ట్ పిక్చర్ ఇంజిన్ మొత్తం చిత్ర నాణ్యతను మెరుగుపరుస్తుంది. అంతేకాకుండా మెరుగైన ప్రకాశం, కలర్, కాంట్రాస్ట్ మరియు స్పష్టతను అందిస్తుందని పేర్కొంది. ఇది డాల్బీ ఆడియో సపోర్ట్‌తో 20W డ్యూయల్ స్పీకర్‌లను కూడా తీసుకువస్తుంది మరియు "బలమైన సౌండ్ క్వాలిటీ" అందిస్తుందని పేర్కొంది.

Realme

Realme యొక్క కొత్త స్మార్ట్ TV నియోలో డాల్బీ ఆడియో స్పీకర్ల ఉంటాయి. ఇవి "క్రిస్టల్ క్లియర్ సరౌండ్ సౌండ్" అందిస్తుందని మరియు సినిమా లాంటి అనుభవాన్ని అందిస్తుందని రియల్‌మి సంస్థ పేర్కొంది. హార్డ్‌వేర్ విషయానికొస్తే రియల్‌మి స్మార్ట్ టీవీ నియో క్వాడ్-కోర్ ARM కార్టెక్స్- A35 CPU మరియు మాలి -470 GPU ద్వారా క్రోమా బూస్ట్ టెక్నాలజీకి మద్దతును ఇస్తుంది. దీని యొక్క ప్రాసెసర్ "అద్భుతమైన మృదువైన అనుభవం మరియు స్మార్ట్ ఆపరేషన్" అందిస్తుందని కంపెనీ పేర్కొంది.

క్విక్ కాస్ట్

ఆండ్రాయిడ్ పవర్డ్ స్మార్ట్ టీవీ "క్విక్ కాస్ట్" అని కూడా పిలువబడుతుంది. ఇది ప్రాథమికంగా వినియోగదారులు తమ స్మార్ట్‌ఫోన్ లేదా టాబ్లెట్ నుండి నేరుగా తమకు ఇష్టమైన గేమ్‌లు లేదా వీడియోలను ప్లే చేయడానికి వీలు కల్పిస్తుంది. కొత్త 32-అంగుళాల స్మార్ట్ టీవీ వైఫై సపోర్ట్, HDMI, USB, AV మరియు LAN వంటి పోర్ట్‌ల సంఖ్య, యూట్యూబ్ వంటి యాప్‌లు వంటి వాటితో వస్తుంది.

Best Mobiles in India

English summary
Realme 32-inch Smart TV Neo Released in India at Rs 14,999: Specifications, Features, Sale Date and More
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X