Home
News

రియల్‌మి నుంచి ఫస్ట్ 5జీ స్మార్ట్‌ఫోన్‌, జూన్‌లో విడుదల

బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ తయారీలో దూసుకుపోతున్న రియల్‌మి దిగ్గజాలతో పోటీపడేందుకు సిద్దమవుతోంది. కొత్త కొత్త స్మార్ట్‌ఫోన్స్ లాంచ్ చేస్తూ జోరు మీదున్న ఈ కంపెనీ మరో అడుగు ముందుకు వేస్తూ 5జీ స్మార్ట్‌ఫోన్ తీసుకువచ్చేందుకు ప్రణాళికలు రూపొందిస్తోంది. రియల్‌మి ఇండియా సీఈవో మాధవ్ సేత్ కూడా ఈ విషయాన్ని ధ్రువీకరించారు.

రియల్‌మి నుంచి ఫస్ట్  5జీ  స్మార్ట్‌ఫోన్‌, జూన్‌లో విడుదల

ట్విట్టర్ వేదికగా 5జీ స్మార్ట్‌ఫోన్ అంశాన్ని వెల్లడించారు. 5జీ ప్రొడక్టులను ఈ ఏడాదిలోనే ఆవిష్కరించబోతున్నామని రియల్‌మి ఇండియా సీఎండీ మాధవ్ సేథ్‌ ప్రకటించారు. స్కైలితో సమావేశం అనంతరం సేథ్‌ ఈ విషయాన్ని ప్రకటించారు. సాధ్యమైనంత త్వరలో భారతదేశానికి అత్యుత‍్తమ సాంకేతిక పరిజ్ఞానాన్నిఅందించబోతున్నామన్నారు. చైనా, ఇండియాలోలో 5జీ నెట్‌వర్క్‌ అందుబాటులోకి వచ్చిన నెలరోజుల్లోనే తమ ఉత్పత్తులను ప్రవేశపెడతామని తెలిపింది.

 5జీ ఫీచర్‌తో కొత్త స్మార్ట్‌ఫోన్

5జీ ఫీచర్‌తో కొత్త స్మార్ట్‌ఫోన్

కంపెనీ 5జీ ఫీచర్‌తో కొత్త స్మార్ట్‌ఫోన్ లాంచ్ చేస్తుందా? లేకపోతే రియల్‌మి ఎక్స్ స్మార్ట్‌ఫోన్‌లోనే 5జీ ఫీచర్‌తో కొత్త వేరియంట్ ఆవిష్కరిస్తుందా? అనే విషయంపై ఇంకా ఎటువంటి స్పష్టత లేదు. శాంసంగ్, మోటరోలా, హువాయి వంటి కంపెనీలు ఇప్పటికే 5జీ స్మార్ట్‌ఫోన్లపై పనిచేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పుడు రియల్‌మి వీటితో పోటీ పడనుంది. కంపెనీ ఈ ఏడాది చివరి కల్లా 5జీ ఫోన్‌ను ఆవిష్కరించే అవకాశముంది.

ధర సుమారు. రూ. 15400

ధర సుమారు. రూ. 15400

రియల్‌మి లేటెస్ట్‌గా రియల్‌మి ఎక్స్‌ పేరుతో ఒక స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్‌ చేసిన సంగతి తెలిసందే. 8జీబీ, 48ఎంపీ కెమెరా లాంటి ఫీచర్లతో చైనాలో లాంచ్‌ చేసింది. ఈ ఏడాది అర్థభాగానికి ఈ స్మార్ట్‌ఫోన్​ ఇండియన్‌ మార్కెట్లను పలకరించనుంది. ధర సుమారు. రూ. 15400గా ఉంది.

 రియ‌ల్‌మి ఎక్స్ ఫీచ‌ర్లు

రియ‌ల్‌మి ఎక్స్ ఫీచ‌ర్లు

6.5 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్ల‌స్ అమోలెడ్ డిస్‌ప్లే, 2340 × 1080 పిక్స‌ల్స్ స్క్రీన్ రిజ‌ల్యూష‌న్‌, 2.2 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ ప్రాసెస‌ర్‌, 4/6 జీబీ ర్యామ్‌, 64/128 జీబీ స్టోరేజ్‌, డ్యుయ‌ల్ సిమ్‌, ఆండ్రాయిడ్ 9.0 పై, 48, 5 మెగాపిక్స‌ల్ డ్యుయ‌ల్ బ్యాక్ కెమెరాలు, 16 మెగాపిక్స‌ల్ సెల్ఫీ కెమెరా, ఇన్ డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్‌, డ్యుయ‌ల్ 4జీ వీవోఎల్‌టీఈ, డ్యుయ‌ల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 5.0, 3700 ఎంఏహెచ్ బ్యాట‌రీ, ఫాస్ట్ చార్జింగ్‌.

 రియల్‌మి సీ2

రియల్‌మి సీ2

ఇప్పటికే రియల్‌మి సీ2 స్మార్ట్‌ఫోన్‌ అమ్మకాలు ప్రారంభం అయ్యాయి. ఫ్లిప్‌కార్ట్, రియల్‌మి ఆన్‌లైన్ స్టోర్ల ద్వారా వినియోగదారులు కొనుగోలు చేయవచ్చని సంస్థ వెల్లడించింది. 2జీబీతోపాటు 16జీబీ వేరియంట్ గల రియల్‌మి సీ2 స్మార్ట్‌ఫోన్‌ ప్రారంభ ధర రూ. 5,999 నుంచి మొదలవుతుందని కంపెనీ పేర్కొంది. 3జీబీతోపాటు 32జీబీ వేరియంట్ గల రియల్‌మి సీ2 స్మార్ట్‌ఫోన్‌ రూ. 7,999 అందుబాటులో ఉంటుందని రియల్‌మి సంస్థ తెలిపింది. డైమండ్ బ్లూ, డైమండ్ బ్లాక్ రంగుల్లో రియల్‌మి సీ2 స్మార్ట్‌ఫోన్‌ను రూపొందించినట్లు కంపెనీ వెల్లడించింది.

 రియల్‌మి 3ప్రొ

రియల్‌మి 3ప్రొ

రియల్‌మి 3ప్రొ ఆఫ్‌లైన్‌లో అమ్మకానికి వచ్చేసింది. ఏప్రిల్ 29న మార్కెట్లోకి వచ్చిన ఈ ఫోన్ ఇప్పటి వరకు ఫ్లిప్‌కార్ట్, రియల్‌మి వెబ్‌సైట్ ద్వారా మాత్రమే అందుబాటులో ఉండగా తాజాగా ఆఫ్‌లైన్‌లోనూ అందుబాటులోకి వచ్చింది. దేశవ్యాప్తంగా 8వేల స్టోర్లలో రియల్‌మి 3ప్రొని అందుబాటులోకి తీసుకొచ్చామని, 28 నుంచి అమ్మకాలు ప్రారంభమవుతాయని సంస్థ ప్రకటించింది.

రియల్‌మి 3ప్రొలో రెండు రకాలు ఉన్నాయి. 6జీబీ ర్యామ్+64 జీబీ స్టోరేజీ రకం ధర రూ.15,999 కాగా, 6జీబీ ర్యామ్+128జీబీ స్టోరేజీ రకం ధర రూ.16,999. ఈ నెల 28 నుంచి ఫోన్ రిటైల్ అవుట్‌లెట్లలో విక్రయానికి రానుండగా, 25-27 మధ్య ప్రి బుకింగ్ కూడా చేసుకోవచ్చని రియల్‌మి ప్రకటించింది.

 

More from GizBot

Best Mobiles in India

English summary
Realme 5G Smartphones to Be Launched in 2019, India CEO Says
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X