Realme 6-Series: సల్మాన్ చేతిలో కొత్త ఫోన్... కొద్దీ రోజులలోనే లాంచ్

|

రియల్‌మి సంస్థ 2020 సంవత్సరంలో దూకుడును ప్రదర్శిస్తున్నది. ఇప్పటికే ఇండియాలో రియల్‌మి X50 ప్రో 5G ఫోన్ ను లాంచ్ చేసింది. ఇప్పుడు మిడ్-రేంజ్ విభాగంలోని రియల్‌మి 6, రియల్‌మి 6 ప్రో స్మార్ట్‌ఫోన్‌లను మార్చి 5వ తేదీన ఇండియాలో లాంచ్ చేయనున్నాయి. రియల్‌మి సంస్థ ఈ లాంచ్ తేదీని అధికారికంగా ధృవీకరించింది.

Realme 6-Series

Realme 6-Series

ఇండియాలో రియల్‌మి 6, రియల్‌మి 6 ప్రో ఈవెంట్ లాంచ్ కార్యక్రమం మార్చి 5 న మధ్యాహ్నం 12:30 PM IST సమయం వద్ద ప్రారంభమవుతున్నట్లు సంస్థ యొక్క MD మాధవ్ సేథ్ ట్వీటర్ ద్వారా పోస్ట్ చేసాడు. ప్రస్తుతం కొత్త బ్రాండ్ అంబాసిడర్‌గా బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ చేయనున్నట్లు కంపెనీ ప్రకటించింది. సల్మాన్ ఖాన్ చేతిలో గల రియల్‌మి 6, రియల్‌మి 6 ప్రో స్మార్ట్‌ఫోన్‌ల వీడియోను చిత్రీకరించి టీజర్ రూపంలో విడుదల చేసారు.

 

 

Amazon Fab Phone Fest: మతిపోయే డిస్కౌంట్ ఆఫర్స్....Amazon Fab Phone Fest: మతిపోయే డిస్కౌంట్ ఆఫర్స్....

రియల్‌మి 6,6ప్రో ఇండియా ధరల వివరాలు

రియల్‌మి 6,6ప్రో ఇండియా ధరల వివరాలు

రియల్‌మి 6, రియల్‌మి 6 ప్రో స్మార్ట్‌ఫోన్‌లు పంచ్ హోల్ డిస్ప్లేను కలిగి ఉండి రూ.15000 ధరల పాయింట్‌ను కలిగి ఉండవచ్చు అని అంచనా వేస్తున్నారు. ఈ రెండు స్మార్ట్‌ఫోన్‌ల యొక్క వెనుక భాగంలో 64 మెగాపిక్సెల్ కెమెరా మెయిన్ సెన్సర్ తో రావడం అతి పెద్ద విశేషం. రియల్‌మి సంస్థ మిడ్-రేంజ్ విభాగంలోని స్మార్ట్‌ఫోన్లలో 64 మెగాపిక్సెల్ కెమెరాను అందించే వాటిలో ఇదే మొదటిది.

 

 

BSNL Vs Jio: కొత్త చందాదారుల చేరికలో అందరిని అధిగమించిన బిఎస్‌ఎన్‌ఎల్BSNL Vs Jio: కొత్త చందాదారుల చేరికలో అందరిని అధిగమించిన బిఎస్‌ఎన్‌ఎల్

 

 

కొత్త స్మార్ట్‌ఫోన్‌లు

కొత్త స్మార్ట్‌ఫోన్‌లు

రియల్‌మి యొక్క కొత్త స్మార్ట్‌ఫోన్‌లు ఇప్పుడు మరింత సరసమైన ధర విభాగంలో వస్తున్నాయి. సంస్థ తన ఉత్పత్తి పోర్ట్‌ఫోలియోను మరింత విస్తరించడానికి ఈ స్మార్ట్‌ఫోన్ వచ్చే నెలలో 5వ తేదీన లాంచ్ చేస్తున్నది. ఈ వారం ప్రారంభంలో కంపెనీ దేశంలో మొట్టమొదటి 5 జి స్మార్ట్‌ఫోన్‌గా రియల్‌మే ఎక్స్ 50 ప్రోను భారతదేశంలో విడుదల చేసింది.

6 సిరీస్‌

6 సిరీస్‌

ఒప్పో యొక్క ఉప బ్రాండ్‌గా ఇండియాకు వచ్చిన రియల్‌మి సంస్థ తరువాత సొంత బ్రాండ్‌గా ఎదిగింది. గత ఏడాది నాల్గవ త్రైమాసికంలో కంపెనీ యొక్క ఎగుమతుల్లోకొంత క్షీణత కనిపించింది. ఇప్పుడు పోటీ స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో తన అదృష్టాన్ని తిప్పికొట్టడానికి ఇది బలమైన ఉత్పత్తిగా రాబోతున్నది. రియల్‌మి 6 సిరీస్‌తో తను అనుకున్న స్థానాన్ని అందుకోబోతున్నట్లు అనిపిస్తుంది. లాంచ్ టీజర్ ఇప్పటికే పిల్ ఆకారంలో ఉన్న పంచ్ హోల్ డిస్ప్లే కటౌట్‌ను ధృవీకరించింది. 64 మెగాపిక్సెల్ కెమెరా ఈ పరికరాన్ని మరింత పోటీని ఇస్తున్నది.

రియల్‌మి 6i

రియల్‌మి 6i

రియల్‌మి సంస్థ రియల్‌మి 6i ను కూడా తయారుచేస్తుందని ఎఫ్‌సిసి జాబితా ఇటీవల ధృవీకరించింది. బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ లైనప్‌లో అత్యంత సరసమైన పరికరంగా ఇది ఉండబోతున్నది. ఈ పరికరం వెనుక భాగంలో క్వాడ్ కెమెరా సెటప్‌ను కూడా కలిగి ఉంటుంది. ఇది 48 మెగాపిక్సెల్ కెమెరా మరియు 5,000 ఎమ్ఏహెచ్ బ్యాటరీని కలిగి ఉంటుంది. అయితే వచ్చే నెలలో జరిగే ఈ కార్యక్రమంలో ఇది ప్రారంభమవుతుందనే దాని మీద ఎటువంటి సమాచారం లేదు. రియల్‌మి 6 సిరీస్‌తో భారతదేశంలో షియోమి యొక్క రెడ్‌మి నోట్ 8 సిరీస్‌తో పోటీ పడనుంది.

 

 

Best Mobiles in India

English summary
Realme 6 and Realme 6 Pro India Launch Date Company Reavels

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X