Realme 6 స్మార్ట్‌ఫోన్ మీద రూ.3000 భారీ ధర తగ్గింపు!!!

|

ఇండియాలో మిడ్-రేంజ్ విభాగంలో విడుదల అయిన రియల్‌మి స్మార్ట్‌ఫోన్ రియల్‌మి 6 యొక్క ధర మీద ఇప్పుడు తగ్గింపు లభించింది. రియల్‌మి 6 స్మార్ట్‌ఫోన్ ధర మీద దాదాపుగా రూ.2,000 తగ్గింపు లభించింది. రియల్‌మి 6 స్మార్ట్‌ఫోన్ ఇండియాలో నాలుగు వివిధ స్టోరేజ్ కాన్ఫిగరేషన్లలో విడుదల అయ్యాయి కానీ ఇప్పుడు తగ్గింపు దారాలతో కేవలం రెండు వేరియంట్లు మాత్రమే అమ్మకానికి అందుబాటులో ఉన్నాయి. ఈ తగ్గింపు ధరల గురుంచి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

రియల్‌మి 6 తగ్గింపు కొత్త ధరల వివరాలు

రియల్‌మి 6 తగ్గింపు కొత్త ధరల వివరాలు

రియల్‌మి 6 ఫోన్ ఇండియాలో మూడు మోడళ్లతో లాంచ్ చేసారు. కానీ ఇప్పుడు కేవలం 6GB ర్యామ్, 8GB ర్యామ్ వంటి రెండు మోడల్లను మాత్రమే అమ్మకానికి ఉంచింది. ఈ రెండు మోడళ్ల మీద ధర తగ్గింపు పొందిన తరువాత 6GB ర్యామ్ + 64GB వేరియంట్ యొక్క ధర రూ.12,999 గాను మరియు 8GB ర్యామ్ + 128GB స్టోరేజ్ వేరియంట్ రూ.14,999 ధర వద్ద లభిస్తుంది. అలాగే వీటి కొనుగోలు మీద రూ.5000 వరకు క్యాష్ బ్యాక్ ఆఫర్లను కూడా అందిస్తున్నది.

 

Also Read: Realme 7 5G మొదటి స్మార్ట్‌ఫోన్ లాంచ్ త్వరలోనే!!! ధరలు , ఫీచర్స్ ఇవే...Also Read: Realme 7 5G మొదటి స్మార్ట్‌ఫోన్ లాంచ్ త్వరలోనే!!! ధరలు , ఫీచర్స్ ఇవే...

రియల్‌మి 6 90Hz రిఫ్రెష్ రేట్ 6.5-ఇంచ్ డిస్ప్లే

రియల్‌మి 6 90Hz రిఫ్రెష్ రేట్ 6.5-ఇంచ్ డిస్ప్లే

రియల్‌మి 6 స్మార్ట్‌ఫోన్ 6.5-ఇంచ్ ఫుల్-HD + డిస్ప్లేను 1,080x2,400 పిక్సెల్ పరిమాణంలో కలిగి ఉంటుంది.ఇది 20: 9 కారక నిష్పత్తితో మరియు 90.5 శాతం స్క్రీన్-టు-బాడీ నిష్పత్తితో 90Hz రిఫ్రెష్ రేట్ తో వస్తుంది. ఈ ఫోన్ యొక్క డిస్ప్లే కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 రక్షణను కలిగి ఉంటుంది. ఇది ఆక్టా-కోర్ మీడియాటెక్ హెలియో G90T SoC చేత రన్ అవుతూ 30W ఫ్లాష్ ఛార్జ్‌కు మద్దతును ఇచ్చే 4,300mAh బ్యాటరీతో ప్యాక్ చేయబడి వస్తుంది. ఇందులోని మైక్రో SD కార్డు స్లాట్ ను ఉపయోగించి మెమొరీని 256GB వరకు విస్తరించవచ్చు.

రియల్‌మి 6 ఫోన్ క్వాడ్ రియర్ కెమెరా సెటప్  ఫీచర్స్

రియల్‌మి 6 ఫోన్ క్వాడ్ రియర్ కెమెరా సెటప్ ఫీచర్స్

రియల్‌మి 6 స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ 10 మరియు రియల్‌మి UIతో రన్ అవుతుంది. ఫోన్ యొక్క ఇమేజింగ్ మరియు ఫొటోగ్రఫీ విషయానికి వస్తే దీని వెనుక భాగంలో క్వాడ్ రియర్ కెమెరా సెటప్ ను కలిగి ఉంది. ఈ సెటప్‌లో మొదటి కెమెరా f / 1.8 ఎపర్చరుతో 64 మెగాపిక్సెల్ సెన్సార్, 8 మెగాపిక్సెల్ సెకండరీ కెమెరా అల్ట్రా-వైడ్ లెన్స్ తో మరియు పోర్ట్రెయిట్ షాట్‌ల కోసం 2 మెగాపిక్సెల్ సెన్సార్ మరియు 2 మెగాపిక్సెల్ మాక్రో లెన్స్ రెండు కెమెరాలు ఉన్నాయి. సెల్ఫీల కోసం ముందుభాగంలో ఎఫ్ / 2.0 ఎపర్చర్‌తో 16 మెగాపిక్సెల్ కెమెరా కూడా ఉంది.

రియల్‌మి 6 30W ఫ్లాష్ ఛార్జ్‌  బ్యాటరీ ఫీచర్స్

రియల్‌మి 6 30W ఫ్లాష్ ఛార్జ్‌ బ్యాటరీ ఫీచర్స్

రియల్‌మి 6i లలోని కనెక్టివిటీ ఎంపికల విషయానికి వస్తే ఇందులో వై-ఫై 802.11 ఎసి, బ్లూటూత్ వి 5, జిపిఎస్, ఎన్‌ఎఫ్‌సి, 3.5 ఎంఎం ఆడియో జాక్ మరియు యుఎస్‌బి టైప్-సి పోర్ట్ ఉన్నాయి. అలాగే ఇది 3.5mm హెడ్‌ఫోన్ జాక్‌ మద్దతుతో వస్తుంది. ఇది 30W ఫ్లాష్ ఛార్జ్‌ మద్దతుతో 4,300mAh పెద్ద బ్యాటరీతో ప్యాక్ చేయబడి వస్తుంది.

Best Mobiles in India

English summary
Realme 6 Smartphone Price Slashed in India Once Again

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X