6GB RAM,4,300mAh బ్యాటరీ బడ్జెట్ ఫోన్ రియల్‌మి 6i సేల్ నేడే
బడ్జెట్ ధరలో ఇండియాలో ఈ నెల ప్రారంభంలో రియల్‌మి సంస్థ విడుదల చేసిన రియల్‌మి 6i ఫోన్ యొక్క అమ్మకాలు ఈ రోజు మధ్యాహ్నం 12:00 గంటల నుంచి ఫ్లిప్‌కార్ట్ మరియు రియల్.కామ్‌లో ప్రారంభం కానున్నాయి. మీడియాటెక్ హెలియో G90T Soc, 30W ఫాస్ట్ ఛార్జింగ్ మద్దతుతో వంటి ఫీచర్లతో రూ.12,999 ధర వద్ద లభిస్తున్న ఈ ఫోన్ గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

రియల్‌మి 6i ధరల వివరాలు
ఇండియాలో రియల్‌మి 6i స్మార్ట్‌ఫోన్ రెండు రకాల వేరియంట్‌లలో విడుదల అయింది. ఇందులో 4GB ర్యామ్ + 64GB స్టోరేజ్ వేరియంట్ యొక్క ధర రూ.12,999 కాగా 6GB ర్యామ్ + 64GB స్టోరేజ్ మోడల్ యొక్క ధర రూ.14,999.

రియల్‌మి 6i సేల్ ఆఫర్స్
రియల్‌మి 6i స్మార్ట్‌ఫోన్ ను ఫ్లిప్‌కార్ట్ ద్వారా కొనుగోలు చేసే వినియోగదారులకు అందిస్తున్న ఆఫర్‌ల విషయానికొస్తే ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డులపై 5 శాతం అపరిమిత క్యాష్‌బ్యాక్, మరియు యాక్సిస్ బ్యాంక్ బజ్ క్రెడిట్ కార్డ్ మీద 5 శాతం తగ్గింపు లభిస్తుంది. ఫ్లిప్‌కార్ట్‌లో ఈ ఫోన్ తో పాటుగా గూగుల్ నెస్ట్ మినీ చార్‌కోల్‌ను రూ.1,999 ధర వద్ద కొనుగోలు చేయవచ్చు.

రియల్‌మి 6i ఫోన్ 6.5-ఇంచ్ ఫుల్-HD + డిస్ప్లే
రియల్‌మి సంస్థ యొక్క కొత్త స్మార్ట్‌ఫోన్ రియల్‌మి 6i యొక్క డిస్ప్లే 1,080x2,400 పిక్సెల్ పరిమాణంలో, 20: 9 కారక నిష్పత్తితో మరియు 90.5 శాతం స్క్రీన్-టు-బాడీ నిష్పత్తితో 6.5-ఇంచ్ ఫుల్-HD + డిస్ప్లే 90Hz రిఫ్రెష్ రేట్ తో వస్తుంది. ఈ ఫోన్ యొక్క డిస్ప్లే కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 రక్షణను కలిగి ఉంటుంది. ఇది ఆక్టా-కోర్ మీడియాటెక్ హెలియో G90T SoC చేత రన్ అవుతూ 30W ఫ్లాష్ ఛార్జ్‌కు మద్దతును ఇచ్చే 4,300mAh బ్యాటరీతో ప్యాక్ చేయబడి వస్తుంది. ఇది 4GB ర్యామ్ + 64GB స్టోరేజ్ ఆప్షన్‌లో లభిస్తుంది. ఇందులోని మైక్రో SD కార్డు స్లాట్ ను ఉపయోగించి మెమొరీని 256GB వరకు విస్తరించడానికి అవకాశం కూడా ఉంది.

రియల్‌మి 6i ఆండ్రాయిడ్ 10 సాఫ్ట్ వెర్
రియల్‌మి 6i స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ 10 మరియు రియల్‌మి UIతో రన్ అవుతుంది. ఫోన్ యొక్క ఇమేజింగ్ మరియు ఫొటోగ్రఫీ విషయానికి వస్తే దీని వెనుక భాగంలో క్వాడ్ రియర్ కెమెరా సెటప్ ను కలిగి ఉంది. ఈ సెటప్‌లో మొదటి కెమెరా f / 1.8 ఎపర్చరుతో 48 మెగాపిక్సెల్ సెన్సార్, 8 మెగాపిక్సెల్ సెకండరీ కెమెరా అల్ట్రా-వైడ్ లెన్స్ తో మరియు పోర్ట్రెయిట్ షాట్‌ల కోసం 2 మెగాపిక్సెల్ సెన్సార్ మరియు 2 మెగాపిక్సెల్ మాక్రో లెన్స్ రెండు కెమెరాలు ఉన్నాయి. సెల్ఫీల కోసం ముందుభాగంలో ఎఫ్ / 2.0 ఎపర్చర్‌తో 16 మెగాపిక్సెల్ కెమెరా కూడా ఉంది.

రియల్‌మి 6i 4,300mAh బ్యాటరీ ఫీచర్స్
రియల్‌మి 6i లలోని కనెక్టివిటీ ఎంపికల విషయానికి వస్తే ఇందులో వై-ఫై 802.11 ఎసి, బ్లూటూత్ వి 5, జిపిఎస్, ఎన్‌ఎఫ్‌సి, 3.5 ఎంఎం ఆడియో జాక్ మరియు యుఎస్‌బి టైప్-సి పోర్ట్ ఉన్నాయి. అలాగే ఇది 3.5mm హెడ్‌ఫోన్ జాక్ మద్దతుతో వస్తుంది. ఇది 30W ఫ్లాష్ ఛార్జ్ మద్దతుతో 4,300mAh పెద్ద బ్యాటరీతో లాంచ్ అవుతుంది. ఫోన్ బరువు 195 గ్రాములు.


Click it and Unblock the Notifications








