Realme 6i కొత్త బడ్జెట్ ఫోన్ వచ్చేసింది!! ఫీచర్స్ బ్రహ్మాండం...

|

చైనా స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ రియల్‌మి కొత్తగా మిడ్-రేంజ్ విభాగంలో కొత్త స్మార్ట్‌ఫోన్ ను విడుదల చేసారు. రియల్‌మి 6i పేరుతో విడుదల అయిన కొత్త ఫోన్ అద్భుతమైన 48MP క్వాడ్ రియర్ కెమెరా సెటప్, 30W ఫ్లాష్ చార్జర్, సైడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్, 4,300mAh మాసివ్ బ్యాటరీ వంటి ఫీచర్లను కలిగి ఉన్నాయి. దీని గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

రియల్‌మి 6i స్మార్ట్‌ఫోన్ ధరల వివరాలు

రియల్‌మి 6i స్మార్ట్‌ఫోన్ ధరల వివరాలు

రియల్‌మి 6i స్మార్ట్‌ఫోన్ ను ఇండియాలో రెండు వేరియంట్ లలో విడుదల చేసారు. ఇందులో 4GB ర్యామ్ + 64GB స్టోరేజ్ మోడల్ ధర రూ.12,999 కాగా 6GB ర్యామ్ + 64GB స్టోరేజ్ మోడల్ ధర రూ. 14,999. ఇది లూనార్ వైట్ మరియు ఏకలిప్స్ బ్లాక్ కలర్ ఎంపికలలో లభిస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్ యొక్క మొదటి అమ్మకాలు జూలై 31 నుండి ఫ్లిప్ కార్ట్ మరియు రియల్‌మి యొక్క వెబ్ సైట్ ద్వారా మొదలుకానున్నాయి.

రియల్‌మి 6i స్పెసిఫికేషన్స్

రియల్‌మి 6i స్పెసిఫికేషన్స్

రియల్‌మి సంస్థ యొక్క కొత్త స్మార్ట్‌ఫోన్ రియల్‌మి 6i యొక్క డిస్ప్లే 1,080x2,400 పిక్సెల్ పరిమాణంలో, 20: 9 కారక నిష్పత్తితో మరియు 90.5 శాతం స్క్రీన్-టు-బాడీ నిష్పత్తితో 6.5-ఇంచ్ ఫుల్-HD + డిస్ప్లే 90Hz రిఫ్రెష్ రేట్ తో వస్తుంది. ఈ ఫోన్ యొక్క డిస్ప్లే కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 రక్షణను కలిగి ఉంటుంది. ఇది ఆక్టా-కోర్ మీడియాటెక్ హెలియో G90T SoC చేత రన్ అవుతూ 30W ఫ్లాష్ ఛార్జ్‌కు మద్దతును ఇచ్చే 4,300mAh బ్యాటరీతో ప్యాక్ చేయబడి వస్తుంది. ఇది 4GB ర్యామ్ + 64GB స్టోరేజ్ ఆప్షన్‌లో లభిస్తుంది. ఇందులోని మైక్రో SD కార్డు స్లాట్ ను ఉపయోగించి మెమొరీని 256GB వరకు విస్తరించడానికి అవకాశం కూడా ఉంది.

రియల్‌మి 6i కెమెరా సెటప్

రియల్‌మి 6i కెమెరా సెటప్

రియల్‌మి 6i స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ 10 మరియు రియల్‌మి UIతో రన్ అవుతుంది. ఫోన్ యొక్క ఇమేజింగ్ మరియు ఫొటోగ్రఫీ విషయానికి వస్తే దీని వెనుక భాగంలో క్వాడ్ రియర్ కెమెరా సెటప్ ను కలిగి ఉంది. ఈ సెటప్‌లో మొదటి కెమెరా f / 1.8 ఎపర్చరుతో 48 మెగాపిక్సెల్ సెన్సార్, 8 మెగాపిక్సెల్ సెకండరీ కెమెరా అల్ట్రా-వైడ్ లెన్స్ తో మరియు పోర్ట్రెయిట్ షాట్‌ల కోసం 2 మెగాపిక్సెల్ సెన్సార్ మరియు 2 మెగాపిక్సెల్ మాక్రో లెన్స్ రెండు కెమెరాలు ఉన్నాయి. సెల్ఫీల కోసం ముందుభాగంలో ఎఫ్ / 2.0 ఎపర్చర్‌తో 16 మెగాపిక్సెల్ కెమెరా కూడా ఉంది.

రియల్‌మి 6i కనెక్టివిటీ ఫీచర్స్

రియల్‌మి 6i కనెక్టివిటీ ఫీచర్స్

రియల్‌మి 6i లలోని కనెక్టివిటీ ఎంపికల విషయానికి వస్తే ఇందులో వై-ఫై 802.11 ఎసి, బ్లూటూత్ వి 5, జిపిఎస్, ఎన్‌ఎఫ్‌సి, 3.5 ఎంఎం ఆడియో జాక్ మరియు యుఎస్‌బి టైప్-సి పోర్ట్ ఉన్నాయి. అలాగే ఇది 3.5mm హెడ్‌ఫోన్ జాక్‌ మద్దతుతో వస్తుంది. ఇది 30W ఫ్లాష్ ఛార్జ్‌ మద్దతుతో 4,300mAh పెద్ద బ్యాటరీతో లాంచ్ అవుతుంది.

Best Mobiles in India

English summary
Realme 6i Launched with 48 MP Camera and 4,300mAh Battery in India: Specifications, Price and Availability

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X