Home
News

Realme స్మార్ట్‌ఫోన్‌ల కొనుగోలు మీద అద్భుతమైన ఆఫర్స్!! త్వరపడండి...

రియల్‌మి C11 మరియు రియల్‌మి 7 స్మార్ట్‌ఫోన్‌ల యొక్క అమ్మకాలు ఈ రోజు వరుసగా మధ్యాహ్నం 12PM మరియు 2PM గంటల మధ్య వరుసగా కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉన్నాయి. ఈ రెండు ఫోన్‌లు ఫ్లిప్‌కార్ట్ మరియు రియల్‌మి.కామ్ ద్వారా కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉన్నాయి. ఫ్లిప్‌కార్ట్ లో ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఫ్లిప్‌కార్ట్ బిగ్ సేవింగ్స్ డేస్ అమ్మకంలో గల అద్భుతమైన ఆఫర్లు అన్ని కూడా వీటి కొనుగోలు మీద అందుబాటులో ఉన్నాయి. 5,000mAh పెద్ద బ్యాటరీ మరియు వాటర్‌డ్రాప్-స్టైల్ డిస్‌ప్లే, 64 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా మరియు మీడియాటెక్ హెలియో G95 ప్రాసెసర్‌ వంటి అద్భుతమైన ఫీచర్లను కలిగి ఉన్న ఈ స్మార్ట్‌ఫోన్‌ల గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

రియల్‌మి C11 స్మార్ట్‌ఫోన్‌ ధరలు & సేల్ ఆఫర్స్

రియల్‌మి C11 స్మార్ట్‌ఫోన్‌ ధరలు & సేల్ ఆఫర్స్

రియల్‌మి C11 యొక్క ఏకైక 2GB ర్యామ్ + 32GB స్టోరేజ్ మోడల్‌ను ఈ రోజు మధ్యాహ్నం 2 గంటల నుండి ఫ్లిప్‌కార్ట్ మరియు రియల్‌మి.కామ్ లో రూ.7,499 ధర వద్ద రిచ్ గ్రీన్ మరియు రిచ్ గ్రే కలర్ ఎంపికలలో కొనుగోలు చెయవచ్చు. ఫ్లిప్‌కార్ట్‌లో లభించే సేల్ ఆఫర్లలో ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌ మీద 5 శాతం అపరిమిత క్యాష్‌బ్యాక్, రూ.299 విలువ గల డిస్కవరీ ప్లస్ ప్రీమియం సబ్‌స్క్రిప్షన్ , మరియు నో-కాస్ట్ ఇఎంఐ ఎంపికలు లభిస్తాయి.

 

రియల్‌మి 7 స్మార్ట్‌ఫోన్‌ ధరలు & సేల్ ఆఫర్స్

రియల్‌మి 7 స్మార్ట్‌ఫోన్‌ ధరలు & సేల్ ఆఫర్స్

రియల్‌మి 7 ను ఈ రోజు మధ్యాహ్నం 12 గంటల నుండి కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంటుంది. దీనిని మిస్ట్ బ్లూ మరియు మిస్ట్ వైట్ అనే రెండు కలర్ ఎంపికలలో 6GB ర్యామ్ + 64GB స్టోరేజ్ వేరియంట్‌ను రూ.14,999 ధర వద్ద మరియు 8GB ర్యామ్ + 128GB స్టోరేజ్ వేరియంట్ ను రూ.16,999 ధర వద్ద కొనుగోలు చెయవచ్చు. ఫ్లిప్‌కార్ట్‌లో దీని కొనుగోలు మీద యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌లో 5 శాతం క్యాష్‌బ్యాక్,రూ. 299 విలువ గల రెండేళ్ల డిస్కవరీ ప్లస్ ప్రీమియం చందా, మరియు నో-కాస్ట్ EMI ఎంపికలు లభిస్తాయి.

 

రియల్‌మి C11 మీడియాటెక్ హెలియో G35 SoC స్పెసిఫికేషన్

రియల్‌మి C11 మీడియాటెక్ హెలియో G35 SoC స్పెసిఫికేషన్

రియల్‌మి C11 స్మార్ట్‌ఫోన్ స్పెసిఫికేషన్ల విషయానికి వస్తే ఇది ప్లాస్టిక్ బిల్డ్‌ డిజైన్ ను కలిగి ఉంది. అలాగే ఫోన్ యొక్క వెనుకభాగంలో గట్టి పట్టు కోసం స్పష్టమైన ఆకృతిని కలిగి ఉంటుంది. ఇది 6.5-అంగుళాల హెచ్‌డి + IPS LCD డిస్‌ప్లేను 1600 x 720 పిక్సెల్స్ మరియు 88.7 శాతం స్క్రీన్-టు-బాడీ రేషియోతో కలిగి ఉంటుంది. ఇది మీడియాటెక్ హెలియో G35 SoC ద్వారా రన్ అవుతుంది. ఇది 12nm ప్రాసెస్‌ను కలిగి ఉండి 2.3GHz వేగంతో పనిచేస్తుంది.

రియల్‌మి C11 పోర్ట్రెయిట్ ఇమేజింగ్ కెమెరా సెటప్

రియల్‌మి C11 పోర్ట్రెయిట్ ఇమేజింగ్ కెమెరా సెటప్

రియల్‌మి C11 స్మార్ట్‌ఫోన్ యొక్క కెమెరా సెటప్ విషయానికి వస్తే ఇమేజింగ్ కోసం వెనుక భాగంలో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. ఇందులో 13 మెగాపిక్సెల్ షూటర్ మెయిన్ కెమెరా ఎఫ్ / 2.2 ఎపర్చరుతో క్రోమా బూస్ట్‌ మద్దతుతో వస్తుంది. ఇందులో గల 2 మెగాపిక్సెల్ రెండవ కెమెరా పోర్ట్రెయిట్ మద్దతుతో జత చేయబడి వస్తుంది. సెల్ఫీలు మరియు వీడియో కాలింగ్ కోసం ముందు భాగంలో ఎఫ్ / 2.4 ఎపర్చరు మరియు AI బ్యూటీ మోడ్ ఫీచర్ తో 5 మెగాపిక్సెల్ షూటర్ కెమెరాను కలిగి ఉంటుంది.

రియల్‌మి C11 5,000mAh బ్యాటరీ ఫీచర్స్

రియల్‌మి C11 5,000mAh బ్యాటరీ ఫీచర్స్

రియల్‌మి C11 స్మార్ట్‌ఫోన్ 3-కార్డ్ స్లాట్‌ మద్దతుతో వస్తుంది. ఇందులో డ్యూయల్ సిమ్ మరియు ఒక ప్రత్యేకమైన SD కార్డ్ స్లాట్‌ మద్దతును కలిగి ఉంది. ఈ SD కార్డ్ స్లాట్ ద్వారా మెమొరీని 256GB వరకు విస్తరించడానికి ఈ ఫోన్ మద్దతు ఇస్తుంది. ఇది రిచ్ గ్రీన్ మరియు రిచ్ గ్రే వంటి రెండు కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. అలాగే ఇది ఆండ్రాయిడ్ 10 ఆధారిత రియల్‌మి UIతో రన్ అవుతుంది. ఈ స్మార్ట్ఫోన్ 5,000mAh బ్యాటరీతో ప్యాక్ చేయబడి వస్తుంది. ఇది 9.1 మిమీ మందంతో 196 గ్రాముల బరువుతో వస్తుంది.

రియల్‌మి 7 గేమింగ్ ప్రాసెసర్ ఫీచర్స్

రియల్‌మి 7 గేమింగ్ ప్రాసెసర్ ఫీచర్స్

రియల్‌మి 7 స్మార్ట్‌ఫోన్‌ అద్భుతమైన గేమింగ్ ప్రాసెసర్ ను అనుమతించే మీడియాటెక్ G95 SoC చిప్ సెట్ ను కలిగి ఉంది. అలాగే ఇది 60HZ రిఫ్రెష్ రేట్ మరియు 120HZ టచ్ శాంప్లింగ్ రేటుతో 6.5-అంగుళాల ఫుల్ HD + అతి పెద్ద డిస్ప్లేను కలిగి ఉంటుంది. దీని యొక్క ప్యానెల్ 20: 9 కారక నిష్పత్తితో మరియు 90 శాతం స్క్రీన్ టు బాడీ రేషియోతో వస్తుంది. ఇది డ్యూయల్ సిమ్ (నానో) స్లాట్ కలిగి ఉండి ఆండ్రాయిడ్ 10 మరియు రియల్‌మి UIతో రన్ అవుతుంది. వీటితో పాటు ఇది ARM మాలి-G76 MC4 GPU మరియు 8GB LPDDR4x ర్యామ్ తో జతచేయబడి ఉంటుంది.

రియల్‌మి 7 సోనీ IMX682 సెన్సార్ కెమెరా సెటప్

రియల్‌మి 7 సోనీ IMX682 సెన్సార్ కెమెరా సెటప్

రియల్‌మి 7 హ్యాండ్‌సెట్‌ యొక్క వెనుక భాగంలో క్వాడ్ రియర్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంటుంది. ఇందులో 64 మెగాపిక్సెల్ సోనీ IMX682 సెన్సార్ మెయిన్ కెమెరా మరియు ఎఫ్ / 2.3 అల్ట్రావైడ్ లెన్స్‌తో 8 మెగాపిక్సెల్ సెకండరీ కెమెరాలు ఉన్నాయి. ఈ సెటప్‌లో B/W సెన్సార్‌తో 2 మెగాపిక్సెల్ పోర్ట్రెయిట్ కెమెరా మరియు 2 మెగాపిక్సెల్ మాక్రో కెమెరాలు కూడా ఉన్నాయి. అలాగే ముందుభాగంలో F/ 2.0 లెన్స్ తో 16 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాను కలిగి ఉంటుంది.

రియల్‌మి 7 ఫోన్ 30W ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ ఫీచర్స్

రియల్‌మి 7 ఫోన్ 30W ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ ఫీచర్స్

రియల్‌మి 7 ఫోన్ 30W ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీతో 5,000mAh బ్యాటరీతో ప్యాక్ చేయబడి వస్తుంది. ఇది కేవలం 26 నిమిషాలలో 50 శాతం బ్యాటరీని ఛార్జ్ చేస్తుంది. అలాగే ఇది డ్యూయల్ స్టీరియో స్పీకర్‌లను మరియు ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్‌ను కూడా కలిగి ఉన్నాయి. ఈ ఫోన్‌ 3-కార్డ్ లాట్‌కు మద్దతును ఇస్తూ ఆండ్రాయిడ్ 10 తో రన్ అవుతాయి. కనెక్టివిటీ ఎంపికలలో 4G VoLTE, Wi-Fi 802.11ac, బ్లూటూత్ v5.0, GPS / A-GPS మరియు USB టైప్-సి పోర్ట్ ఉన్నాయి. స్మార్ట్ఫోన్ సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్తో కూడా వస్తుంది.

Best Mobiles in India

English summary
Realme 7,Realme C11 Goes Sale Today in India via Flipkart and Realme.com
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X