Realme 7i స్మార్ట్‌ఫోన్ మొదటి సేల్ మొదలైంది!!! అధిక డిస్కౌంట్ ఆఫర్లతో...  

|

ఇండియాలో ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ అమ్మకాలు మొదలయ్యాయి. ఈ అమ్మకాలలో కొత్త స్మార్ట్‌ఫోన్ల హవా ఎక్కువగా ఉంది. ఇందులో భాగంగా గత వారంలో రియల్‌మి సంస్థ రియల్‌మి7 మరియు రియల్‌మి 7 ప్రో ఫోన్ల కొనసాగింపుగా రియల్‌మి 7i సిరీస్‌ను విడుదల చేసింది. రియల్‌మి 7i ఫోన్ అమ్మకాలు నేడు ఫ్లిప్‌కార్ట్ ప్రత్యేక అమ్మకాలలో భాగంగా మొదలుకానున్నాయి. క్వాడ్ రియర్ కెమెరా సెటప్, అధిక రిఫ్రెష్ రేట్ స్క్రీన్, ఆక్టా-కోర్ ప్రాసెసర్ వంటి అద్భుతమైన రియల్‌మి7i గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

 

రియల్‌మి 7i స్మార్ట్‌ఫోన్ ధరల వివరాలు

రియల్‌మి 7i స్మార్ట్‌ఫోన్ ధరల వివరాలు

ఇండియాలో రెండు వేరు వేరు వేరియంట్ లలో రియల్‌మి 7i స్మార్ట్‌ఫోన్ ప్రస్తుతం అమ్మకానికి రానున్నది. ఇందులో 4GB ర్యామ్ + 64GB స్టోరేజ్ వేరియంట్ యొక్క ధర రూ.11,999 కాగా 4GB ర్యామ్ + 128GB స్టోరేజ్ వేరియంట్ యొక్క ధర రూ.12,999. దీనిని ఫ్యూజన్ గ్రీన్ మరియు ఫ్యూజన్ బ్లూ వంటి రెండు కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ తో పాటుగా రియల్‌మి‌.కామ్ మరియు ఆఫ్‌లైన్ స్టోర్ల ద్వారా కూడా ఇవి నేటి నుంచి అమ్మకానికి అందుబాటులో ఉండనున్నాయి.

రియల్‌మి 7i ఫ్లిప్‌కార్ట్ ఆఫర్స్
 

రియల్‌మి 7i ఫ్లిప్‌కార్ట్ ఆఫర్స్

ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ అమ్మకంలో భాగంగా రియల్‌మి 7i స్మార్ట్‌ఫోన్ కొనుగోలు మీద SBI డెబిట్ మరియు క్రెడిట్ కార్డుల మీద 10% తగ్గింపు లభిస్తుంది. అంతేకాకుండా ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ కార్డుల మీద 5% క్యాష్ బ్యాక్ లభిస్తుంది. దీనితో పాటుగా అన్ని రకాల బ్యాంకుల కార్డుల మీద నో-కాస్ట్ EMI ఆఫర్ లభిస్తుంది.

Also Read:ఎలక్ట్రానిక్ గాడ్జెట్లపై 60% వరకు భారీ ఆఫర్లు ! దేని పై ఎంత ? లిస్ట్ ఇదే !Also Read:ఎలక్ట్రానిక్ గాడ్జెట్లపై 60% వరకు భారీ ఆఫర్లు ! దేని పై ఎంత ? లిస్ట్ ఇదే !

రియల్‌మి 7i క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 662 SoC & 90HZ రిఫ్రెష్ రేట్ డిస్ప్లే

రియల్‌మి 7i క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 662 SoC & 90HZ రిఫ్రెష్ రేట్ డిస్ప్లే

రియల్‌మి 7i స్మార్ట్ ఫోన్ డ్యూయల్ సిమ్ (నానో) స్లాట్ కలిగి ఉండి ఆండ్రాయిడ్ 10 మరియు రియల్‌మి యుఐతో రన్ అవుతుంది. దీని యొక్క డిస్ప్లే 90HZ రిఫ్రెష్ రేట్ మరియు 90 శాతం స్క్రీన్-టు-బాడీ రేషియోతో 6.5-అంగుళాల HD + డిస్ప్లేని 720x1,600 పిక్సెల్స్ పరిమాణంలో కలిగి ఉంటుంది. ఈ స్మార్ట్‌ఫోన్ ఆక్టా-కోర్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 662 SoC తో రన్ అవుతూ 4GB LPDDR4x RAM తో జతచేయబడి ఉంటుంది.

రియల్‌మి 7i అల్ట్రా-వైడ్ సెన్సార్‌ క్వాడ్ రియర్ కెమెరా సెటప్

రియల్‌మి 7i అల్ట్రా-వైడ్ సెన్సార్‌ క్వాడ్ రియర్ కెమెరా సెటప్

రియల్‌మి 7i స్మార్ట్‌ఫోన్ యొక్క ఆప్టిక్స్ విషయానికొస్తే దీని వెనుక భాగంలో క్వాడ్ రియర్ కెమెరా సెటప్‌తో ప్యాక్ చేయబడి వస్తుంది. ఇందులో ఎఫ్ / 1.8 లెన్స్‌తో 64 మెగాపిక్సెల్ మెయిన్ సెన్సార్‌ కెమెరా ఎఫ్ / 2.2 లెన్స్‌ మరియు అల్ట్రా-వైడ్-యాంగిల్ సెన్సార్‌తో 8 మెగాపిక్సెల్ సెకండరీ కెమెరా, 2 మెగాపిక్సెల్ f / 2.4 లెన్స్‌తో మోనోక్రోమ్ సెన్సార్ మరియు f / 2.4 లెన్స్‌తో 2 మెగాపిక్సెల్ సెన్సార్ తో డెప్త్ కెమెరాలను కలిగి ఉంటుంది. అలాగే సెల్ఫీలు మరియు వీడియో కాలింగ్ కోసం ముందు భాగంలో ఎఫ్ / 2.1 లెన్స్‌తో 16 మెగాపిక్సెల్ సెల్ఫీ షూటర్‌ కెమెరాను పంచ్-హోల్ కటౌట్ నిర్మాణంతో కలిగి ఉంటుంది.

రియల్‌మి 7i 18W ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ

రియల్‌మి 7i 18W ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ

రియల్‌మి 7i స్మార్ట్‌ఫోన్ 128GB వరకు ఆన్‌బోర్డ్ UFS 2.1 స్టోరేజ్ ను కలిగి ఉంటుంది. ఇందులో గల మైక్రో SD కార్డ్ ద్వారా మెమొరీని మరింత విస్తరించడానికి అవకాశం ఉంది. కనెక్టివిటీ ఎంపికలలో 4G LTE, డ్యూయల్-బ్యాండ్ వై-ఫై, బ్లూటూత్ 5.0, జిపిఎస్ / ఎ-జిపిఎస్, యుఎస్‌బి టైప్-సి పోర్ట్ మరియు 3.5mm హెడ్‌ఫోన్ జాక్ వంటివి ఉన్నాయి. అలాగే ఫోన్‌లో గల సెన్సార్లలో యాక్సిలెరోమీటర్, యాంబియంట్ లైట్ మరియు సామీప్య సెన్సార్ వంటివి ఉన్నాయి. అలాగే ఫోన్ వెనుక భాగంలో ఫింగర్ ప్రింట్ సెన్సార్ అమర్చబడి ఉంటుంది. అలాగే ఈ ఫోన్ 5,000mAh బ్యాటరీ మద్దతును 18W ఫాస్ట్ ఛార్జింగ్‌ మద్దతుతో ప్యాక్ చేయబడి వస్తుంది.

Best Mobiles in India

Read more about:
English summary
Realme 7i First Sale Starts in India via Flipkart Big Billion Days 2020: Price, Specs, Sales Offers and More

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X