Realme కొత్త స్మార్ట్‌ఫోన్ రియల్‌మి 7i లాంచ్!!! అందుబాటు ధరలోనే...
రియల్‌మి సంస్థ ఇండియాలో తన యొక్క కొత్త స్మార్ట్ ఫోన్లను విడుదల చేస్తూనే ఉంది. దీని కొనసాగింపుగా రియల్‌మి 7i సిరీస్‌లో రియల్‌మి7 మరియు రియల్‌మి 7 ప్రోలను ముందు ఇండియాలో సరికొత్తగా విడుదల చేసింది. రియల్‌మి 7i ఫోన్ క్వాడ్ రియర్ కెమెరా సెటప్, అధిక రిఫ్రెష్ రేట్ స్క్రీన్, ఆక్టా-కోర్ ప్రాసెసర్ మరియు ఒకే ఒక ర్యామ్ మరియు రెండు స్టోరేజ్ కాన్ఫిగరేషన్లతో రెండు కలర్ ఎంపికలలో లభించే రియల్‌మి7i గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

రియల్‌మి 7i స్మార్ట్‌ఫోన్ ధరల వివరాలు
రియల్‌మి 7i స్మార్ట్ ఫోన్ ను ఈ రోజు ఇండియాలో రెండు వేరు వేరు వేరియంట్ లలో విడుదల చేసింది. ఇందులో 4GB ర్యామ్ + 64GB స్టోరేజ్ వేరియంట్ యొక్క ధర రూ.11,999 కాగా 4GB ర్యామ్ + 128GB స్టోరేజ్ వేరియంట్ యొక్క ధర రూ.12,999. ఈ ఫోన్ ఫ్యూజన్ గ్రీన్ మరియు ఫ్యూజన్ బ్లూ వంటి రెండు కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. రియల్‌మి 7i యొక్క మొదటి అమ్మకాలు అక్టోబర్ 16 నుండి ఫ్లిప్‌కార్ట్, రియల్‌మి.కామ్ మరియు ఆఫ్‌లైన్ స్టోర్ల ద్వారా అందుబాటులోకి రానున్నాయి.

రియల్‌మి 7i స్మార్ట్‌ఫోన్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 662 SoC
రియల్‌మి 7i స్మార్ట్ ఫోన్ డ్యూయల్ సిమ్ (నానో) స్లాట్ కలిగి ఉండి ఆండ్రాయిడ్ 10 మరియు రియల్‌మి యుఐతో రన్ అవుతుంది. దీని యొక్క డిస్ప్లే 90HZ రిఫ్రెష్ రేట్ మరియు 90 శాతం స్క్రీన్-టు-బాడీ రేషియోతో 6.5-అంగుళాల HD + డిస్ప్లేని 720x1,600 పిక్సెల్స్ పరిమాణంలో కలిగి ఉంటుంది. ఈ స్మార్ట్‌ఫోన్ ఆక్టా-కోర్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 662 SoC తో రన్ అవుతూ 4GB LPDDR4x RAM తో జతచేయబడి ఉంటుంది.

రియల్‌మి 7i స్మార్ట్‌ఫోన్ 64MP క్వాడ్ రియర్ కెమెరా సెటప్
రియల్‌మి 7i స్మార్ట్‌ఫోన్ యొక్క ఆప్టిక్స్ విషయానికొస్తే దీని వెనుక భాగంలో క్వాడ్ రియర్ కెమెరా సెటప్‌తో ప్యాక్ చేయబడి వస్తుంది. ఇందులో ఎఫ్ / 1.8 లెన్స్‌తో 64 మెగాపిక్సెల్ మెయిన్ సెన్సార్ కెమెరా ఎఫ్ / 2.2 లెన్స్ మరియు అల్ట్రా-వైడ్-యాంగిల్ సెన్సార్‌తో 8 మెగాపిక్సెల్ సెకండరీ కెమెరా, 2 మెగాపిక్సెల్ f / 2.4 లెన్స్‌తో మోనోక్రోమ్ సెన్సార్ మరియు f / 2.4 లెన్స్‌తో 2 మెగాపిక్సెల్ సెన్సార్ తో డెప్త్ కెమెరాలను కలిగి ఉంటుంది. అలాగే సెల్ఫీలు మరియు వీడియో కాలింగ్ కోసం ముందు భాగంలో ఎఫ్ / 2.1 లెన్స్‌తో 16 మెగాపిక్సెల్ సెల్ఫీ షూటర్ కెమెరాను పంచ్-హోల్ కటౌట్ నిర్మాణంతో కలిగి ఉంటుంది.

రియల్‌మి 7i స్మార్ట్‌ఫోన్ 18W ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ
రియల్‌మి 7i స్మార్ట్‌ఫోన్ 128GB వరకు ఆన్‌బోర్డ్ UFS 2.1 స్టోరేజ్ ను కలిగి ఉంటుంది. ఇందులో గల మైక్రో SD కార్డ్ ద్వారా మెమొరీని మరింత విస్తరించడానికి అవకాశం ఉంది. కనెక్టివిటీ ఎంపికలలో 4G LTE, డ్యూయల్-బ్యాండ్ వై-ఫై, బ్లూటూత్ 5.0, జిపిఎస్ / ఎ-జిపిఎస్, యుఎస్‌బి టైప్-సి పోర్ట్ మరియు 3.5mm హెడ్‌ఫోన్ జాక్ వంటివి ఉన్నాయి. అలాగే ఫోన్‌లో గల సెన్సార్లలో యాక్సిలెరోమీటర్, యాంబియంట్ లైట్ మరియు సామీప్య సెన్సార్ వంటివి ఉన్నాయి. అలాగే ఫోన్ వెనుక భాగంలో ఫింగర్ ప్రింట్ సెన్సార్ అమర్చబడి ఉంటుంది. అలాగే ఈ ఫోన్ 5,000mAh బ్యాటరీ మద్దతును 18W ఫాస్ట్ ఛార్జింగ్ మద్దతుతో ప్యాక్ చేయబడి వస్తుంది.


Click it and Unblock the Notifications








