Realme 8 5G హ్యాండ్‌సెట్ మొదటి సేల్ నేడే ప్రారంభం!! ఆఫర్స్ మిస్ అవ్వకండి...
రియల్‌మి సంస్థ ఇండియాలో సరసమైన ధరలో తన కొత్త 5G హ్యాండ్‌సెట్‌ను ఇటీవల విడుదల చేసింది. రియల్‌మి 8 5G పేరుతో విడుదలైన ఈ స్మార్ట్‌ఫోన్ యొక్క మొదటి అమ్మకాలు ఈ రోజు అంటే ఏప్రిల్ 28న మధ్యాహ్నం 12 గంటల నుండి ఫ్లిప్‌కార్ట్ మరియు రియల్.కామ్ ద్వారా మొదలుకానున్నాయి. సరసమైన ధరలో లభించే ఈ 5G స్మార్ట్‌ఫోన్ గతంలో మార్చి నెలలో రియల్‌మి 8 ప్రోతో పాటు విడుదలైన రియల్‌మి 8 యొక్క అప్‌గ్రేడ్ వెర్షన్ గా భారతదేశంలో ప్రారంభించబడింది. రియల్‌మి నుండి లభించే ఈ 5G హ్యాండ్‌సెట్ మీడియాటెక్ డైమెన్సిటీ 700 SoC మరియు డైనమిక్ ర్యామ్ ఎక్స్‌పాన్షన్ వంటి టెక్నాలజీల మద్దతుతో లభిస్తాయి. 90Hz డిస్ప్లే, ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, పంచ్-హోల్ డిస్ప్లే మరియు 18W ఫాస్ట్ ఛార్జింగ్ మద్దతుతో 5,000mAh బ్యాటరీ వంటి ఫీచర్లను కలిగి ఉన్న ఈ ఫోన్ గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

రియల్‌మి 8 5G ధర, లభ్యత వివరాలు
రియల్‌మి 8 5G స్మార్ట్‌ఫోన్ ప్రస్తుత అమ్మకాలలో రెండు వేరువేరు వేరియంట్‌లలో లభిస్తుంది. 4GB ర్యామ్ + 128GB స్టోరేజ్ వేరియంట్ 14,999 రూపాయల ధర వద్ద మరియు 8GB ర్యామ్ + 128GB స్టోరేజ్ మోడల్ రూ.16,999 ధర వద్ద లభిస్తుంది. దీనిని సూపర్సోనిక్ బ్లాక్ మరియు సూపర్సోనిక్ బ్లూ వంటి కలర్ ఎంపికలలో కొనుగోలు చేయవచ్చు. ఈ రోజు మధ్యాహ్నం 12PM నుండి ఫ్లిప్‌కార్ట్, రియల్.కామ్ మరియు ఆఫ్‌లైన్ రిటైలర్ల ద్వారా మొదలయ్యే మొదటి సేల్ లో అనేక ఆఫర్లను పొందవచ్చు.

రియల్‌మి 8 5G స్పెసిఫికేషన్స్
రియల్‌మి 8 5G ఫోన్ యొక్క స్పెసిఫికేషన్స్ విషయానికి వస్తే ఇది డ్యూయల్ సిమ్ (నానో) స్లాట్ కలిగి ఉండి ఆండ్రాయిడ్ 11 లో రియల్‌మి UI 2.0 తో రన్ అవుతుంది. ఈ ఫోన్ 1,080x2,400 పిక్సెల్స్, 20: 9 కారక నిష్పత్తి మరియు 90HZ రిఫ్రెష్ రేట్‌తో 6.5-అంగుళాల ఫుల్-హెచ్‌డి + డిస్ప్లేను కలిగి ఉంది. దీని యొక్క డిస్ప్లే 600 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌ను కలిగి ఉండడమే కాకుండా డ్రాగన్‌ట్రైల్ ప్రొటెక్షన్ తో వస్తుంది. ఇది మీడియా టెక్ డైమెన్సిటీ 700 SoC, ARM మాలి- G57 MC2 GPUలను కలిగి ఉండి 8GB వరకు LPDDR4x RAM తో జతచేయబడి వస్తుంది. సున్నితమైన మల్టీ టాస్కింగ్ కోసం స్టోరేజ్ ను వర్చువల్ ర్యామ్‌గా మార్చడానికి ఉద్దేశించిన DRE టెక్నాలజీ కూడా ఇది కలిగి ఉంది.

రియల్‌మి 8 5G స్మార్ట్‌ఫోన్‌లోని ఆప్టిక్స్ విషయానికి వస్తే ఫోన్ వెనుక భాగంలో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ను కలిగి ఉంది. ఇందులో ఎఫ్ / 1.8 లెన్స్‌తో 48 మెగాపిక్సెల్ శామ్‌సంగ్ GM1 ప్రైమరీ సెన్సార్ తో పాటు ఎఫ్ / 2.4 పోర్ట్రెయిట్ లెన్స్ 2 మెగాపిక్సెల్ మోనోక్రోమ్ సెన్సార్ మరియు ఎఫ్/ 2.4 మాక్రో లెన్స్ తో 2 మెగాపిక్సెల్ మూడవ సెన్సార్ కెమెరాలు ప్యాక్ చేయబడి ఉన్నాయి. బ్యాక్ కెమెరా సెటప్ నైట్ స్కోప్, 48M మోడ్, ప్రో మోడ్, AI స్కాన్ మరియు సూపర్ మాక్రో వంటి సాఫ్ట్‌వేర్ ఫీచర్లతో జత చేయబడి వస్తుంది. సెల్ఫీలు మరియు వీడియో చాట్‌ల కోసం ఫోన్ ముందుభాగంలో ఎఫ్ / 2.1 లెన్స్‌తో 16 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా సెన్సార్‌ను కలిగి ఉంటుంది. ముందు కెమెరాలో పోర్ట్రెయిట్, నైట్‌స్కేప్ మరియు టైమ్‌లాప్స్ వంటి ఫీచర్లు కూడా ఉన్నాయి.

రియల్‌మి 8 5G స్మార్ట్‌ఫోన్ 128GB UFS 2.1 స్టోరేజ్‌తో స్టాండర్డ్ గా వస్తుంది. ఇందులో గల ప్రత్యేకమైన మైక్రో SD కార్డ్ ద్వారా మెమొరీని 1TB వరకు విస్తరించడానికి మద్దతును ఇస్తుంది. కనెక్టివిటీ ఎంపికలలో 5G , 4G LTE, వై-ఫై 802.11ac, బ్లూటూత్ V5.1, జిపిఎస్ / ఎ-జిపిఎస్ మరియు యుఎస్‌బి టైప్-సి పోర్ట్ వంటివి ఉన్నాయి. బోర్డులోని సెన్సార్లలో యాక్సిలెరోమీటర్, యాంబియంట్ లైట్, మాగ్నెటోమీటర్ మరియు సామీప్య సెన్సార్ ఉన్నాయి. ఫోన్ సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ను కూడా కలిగి ఉంది. చివరిగా ఈ ఫోన్ 18W క్విక్ ఛార్జ్ ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ మద్దతుతో 5,000mAh పెద్ద బ్యాటరీతో 162.5x74.8x8.5mm కొలతల పరిమాణంతో ప్యాక్ చేయబడి వస్తుంది.


Click it and Unblock the Notifications