Poco M3 Pro 5G vs Realme 8 5G: కొనుగోలుకు ఇందులో ఏది మెరుగ్గా ఉంది...

|

స్మార్ట్‌ఫోన్‌ల వినియోగం అధికమవుతున్న ఈ సమయంలో అనేక సంస్థలు తమ కొత్త ఫోన్‌లను సరికొత్త టెక్నాలజీలతో తీసుకువస్తున్నది. భారతదేశంలో గత రెండు నెలల్లో 5G ఫోన్‌లు అధికంగా నిరంతరం రావడంతో 5G ఫోన్‌ల మీద వ్యామోహం ప్రారంభమవుతున్నట్లు తెలుస్తోంది. అలాగే బడ్జెట్ మార్కెట్ లో కూడా 5G ఫోన్ పోటీని ఎదురుకుంటున్నది. దేశంలో 5Gకి మద్దతు లేకపోయినప్పటికీ పోకో మరియు రియల్‌మి సంస్థలు అందుబాటు ధరలోనే 5G ఫోన్‌లను విడుదల చేసింది.

 

రియల్‌మి

రియల్‌మి సంస్థ రియల్‌మి 8 5G ని మరియు పోకో సంస్థ పోకో M3 ప్రో 5G ని లాంచ్ చేసిన తర్వాత బడ్జెట్ విభాగంలో పోటీ ఎక్కువగా ఉంది. ఈ రెండు ఫోన్‌లలో మెరుగైన దానిని ఎంచుకోవడానికి సంకోచిస్తున్నారా అయితే ఈ రెండిటిలో ఏది మంచిది అనే సందేహాలకు చెక్ పెట్టడానికి మరియు 5G బడ్జెట్ స్మార్ట్‌ఫోన్‌లలో మీ ఛాయిస్ దేనికి అని తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

 

Samsung నెక్స్ట్-జెన్ ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్‌లు చౌకగా రానున్నాయి!! ఇందులో నిజమెంత...Samsung నెక్స్ట్-జెన్ ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్‌లు చౌకగా రానున్నాయి!! ఇందులో నిజమెంత...

Poco M3 Pro 5G vs Realme 8 5G: ధరలు
 

Poco M3 Pro 5G vs Realme 8 5G: ధరలు

పోకో M3 ప్రో 5G రెండు వేరియంట్‌లలో విడుదలైంది. ఇందులో 4GB ర్యామ్ + 64GB స్టోరేజ్ వేరియంట్‌ ధర 13,999 రూపాయలు కాగా 6GB ర్యామ్ + 128GB స్టోరేజ్ వేరియంట్‌ యొక్క ధర 15,999 రూపాయలు. దీనికి విరుద్ధంగా రియల్‌మి 8 5G ఫోన్ మూడు వేరియంట్‌లలో విడుదలైంది. ఇందులో 4GB ర్యామ్ + 64GB స్టోరేజ్ వేరియంట్‌కు రూ .13,999 వద్ద ప్రారంభమవుతుంది. 6GB ర్యామ్ + 128GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ.14,999 కాగా 8GB ర్యామ్ + 128GB స్టోరేజ్ వేరియంట్‌ రూ.16,999 ధర వద్ద లభిస్తుంది. ధరల పరముగా బేస్ వేరియంట్ ఒకే ధరను కలిగి ఉన్నప్పటికీ 6GB ర్యామ్ వేరియంట్ విభాగంలో రియల్‌మి రూ.1000 తక్కువ ధరను కలిగి ఉన్నాయి.

 

 

Infinix బ్రాండింగ్‌ 160W సరికొత్త అల్ట్రా ఫ్లాష్ చార్జర్!! ఛార్జింగ్ సమస్యలకు చెక్...Infinix బ్రాండింగ్‌ 160W సరికొత్త అల్ట్రా ఫ్లాష్ చార్జర్!! ఛార్జింగ్ సమస్యలకు చెక్...

Poco M3 Pro 5G vs Realme 8 5G: డిజైన్

Poco M3 Pro 5G vs Realme 8 5G: డిజైన్

రియల్‌మి మరియు పోకో సంస్థల నుండి లభించే రెండు పరికరాలు ప్రత్యేకమైన డిజైన్లను కలిగి ఉన్నందున మిమ్మలిని ఆకట్టుకునే సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి. పోకో M3 ప్రో 5G మరియు రియల్‌మి 8 5G రెండూ కూడా సాధారణ కెమెరా మాడ్యూళ్ల కంటే పెద్దవిగా ఎంచుకునే ఆధునిక డిజైన్లను ఉపయోగించుకుంటాయి. పోకో M3 ప్రో బోల్డ్ డిజైన్‌ను కలిగి ఉంది. ఇది వివిధ యూజర్లను ఆకర్షించడానికి నీలం, పసుపు కలర్ లలో లభిస్తుంది. రియల్‌మి 8 5G దీర్ఘచతురస్రాకార కెమెరా మాడ్యూల్ తో నలుపు మరియు నీలం కలర్లలో టోన్-డౌన్ కలర్ తో స్టైలిష్ మరియు సూక్ష్మమైన డిజైన్ ను కలిగి ఉంటుంది.

డిజైన్

డిజైన్-సంబంధిత అంశాలలో పోకో M3 ప్రో స్ప్లాష్‌ల నుండి రక్షించడానికి P2i పూతను కలిగి ఉంటుంది. అయితే రియల్‌మి 8 5G కి అలాంటి రేటింగ్ లేదు. మొత్తంమీద సూక్ష్మమైన డిజైన్ కోసం చూస్తున్నవారికి రియల్‌మి మరింత ఆకర్షణీయంగా ఉంటుంది. ఫ్లాషియర్ ప్రేక్షకులు M3 ప్రో వైపు వెళ్ళడానికి మొగ్గు చూపుతారు.

Poco M3 Pro 5G vs Realme 8 5G: డిస్ప్లే

Poco M3 Pro 5G vs Realme 8 5G: డిస్ప్లే

డిస్ప్లే విషయానికి వస్తే పోకో M3 ప్రో 5G మరియు రియల్‌మి 8 5G రెండూ కూడా 6.5-అంగుళాల డిస్‌ప్లేను కలిగి ఉండి పంచ్-హోల్‌ డిజైన్ నిర్మాణంను కలిగి ఉన్నాయి. ఈ డిస్ప్లేలు FHD + యొక్క రిజల్యూషన్ మరియు 90Hz రిఫ్రెష్ రేటును అందిస్తాయి.

డైనమిక్ స్విచ్ ఫీచర్ కారణంగా పోకో M3 ప్రో 5G అనేది రియల్‌మి 8 5G కంటే మెరుగ్గా బయటకు తీయగలుగుతుంది. ఇది వినియోగదారుడు వినియోగించే కంటెంట్‌ను బట్టి రిఫ్రెష్ రేటును 30 హెర్ట్జ్ నుండి 90 హెర్ట్జ్‌కు మార్చడానికి అనుమతిస్తుంది. ఇది కూడా బ్యాటరీ పొదుపులో సహాయం అవుతుంది.

 

 

డేటా ప్రొటెక్షన్ చట్టం అంటే ఏమిటి..?? ఇది మిమ్మల్ని ఎలా ప్రభావితం చేస్తుంది...డేటా ప్రొటెక్షన్ చట్టం అంటే ఏమిటి..?? ఇది మిమ్మల్ని ఎలా ప్రభావితం చేస్తుంది...

రియల్‌మి 8 5G స్పెసిఫికేషన్స్

రియల్‌మి 8 5G స్పెసిఫికేషన్స్

రియల్‌మి 8 5G ఫోన్ యొక్క స్పెసిఫికేషన్స్ విషయానికి వస్తే ఇది డ్యూయల్ సిమ్ (నానో) స్లాట్ కలిగి ఉండి ఆండ్రాయిడ్ 11 లో రియల్‌మి UI 2.0 తో రన్ అవుతుంది. ఈ ఫోన్ 1,080x2,400 పిక్సెల్స్, 20: 9 కారక నిష్పత్తి మరియు 90HZ రిఫ్రెష్ రేట్‌తో 6.5-అంగుళాల ఫుల్-హెచ్‌డి + డిస్ప్లేను కలిగి ఉంది. దీని యొక్క డిస్ప్లే 600 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌ను కలిగి ఉండడమే కాకుండా డ్రాగన్‌ట్రైల్ ప్రొటెక్షన్ తో వస్తుంది. ఇది మీడియా టెక్ డైమెన్సిటీ 700 SoC, ARM మాలి- G57 MC2 GPUలను కలిగి ఉండి 8GB వరకు LPDDR4x RAM తో జతచేయబడి వస్తుంది. సున్నితమైన మల్టీ టాస్కింగ్ కోసం స్టోరేజ్ ను వర్చువల్ ర్యామ్‌గా మార్చడానికి ఉద్దేశించిన DRE టెక్నాలజీ కూడా ఇది కలిగి ఉంది.

రియల్‌మి 8 5G 5,000mAh బ్యాటరీ ఫీచర్స్

రియల్‌మి 8 5G 5,000mAh బ్యాటరీ ఫీచర్స్

రియల్‌మి 8 5G స్మార్ట్‌ఫోన్‌ 128GB UFS 2.1 స్టోరేజ్‌తో స్టాండర్డ్ గా వస్తుంది. ఇందులో గల ప్రత్యేకమైన మైక్రో SD కార్డ్ ద్వారా మెమొరీని 1TB వరకు విస్తరించడానికి మద్దతును ఇస్తుంది. కనెక్టివిటీ ఎంపికలలో 5G , 4G LTE, వై-ఫై 802.11ac, బ్లూటూత్ V5.1, జిపిఎస్ / ఎ-జిపిఎస్ మరియు యుఎస్‌బి టైప్-సి పోర్ట్ వంటివి ఉన్నాయి. బోర్డులోని సెన్సార్లలో యాక్సిలెరోమీటర్, యాంబియంట్ లైట్, మాగ్నెటోమీటర్ మరియు సామీప్య సెన్సార్ ఉన్నాయి. ఫోన్ సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ను కూడా కలిగి ఉంది. చివరిగా ఈ ఫోన్ 18W క్విక్ ఛార్జ్ ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ మద్దతుతో 5,000mAh పెద్ద బ్యాటరీతో 162.5x74.8x8.5mm కొలతల పరిమాణంతో ప్యాక్ చేయబడి వస్తుంది.

పోకో M3 ప్రో 5G ఆప్టిక్స్

పోకో M3 ప్రో 5G ఆప్టిక్స్

పోకో M3 ప్రో 5G స్మార్ట్‌ఫోన్ యొక్క ఆప్టిక్స్ విషయానికి వస్తే వెనుక భాగంలో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ను కలిగి ఉంది. ఇందులో 48 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, 2 మెగాపిక్సెల్ మాక్రో కెమెరా మరియు 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ కెమెరాలు ప్యాక్ చేయబడి ఉన్నాయి. సెల్ఫీలు మరియు వీడియో కాలింగ్ కోసం ముందు భాగంలో 8 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాను సెంట్రల్ పంచ్-హోల్ కటౌట్‌లో కలిగి ఉంది.

పోకో M3 ప్రో 5G 5,000mAh బ్యాటరీ

పోకో M3 ప్రో 5G 5,000mAh బ్యాటరీ

పోకో M3 ప్రో 5G స్మార్ట్‌ఫోన్ యొక్క కనెక్టివిటీ ఎంపికల విషయానికి వస్తే ఇది డ్యూయల్ సిమ్ స్లాట్లు, 5G, NFC, డ్యూయల్-బ్యాండ్ వై-ఫై, బ్లూటూత్ V5.1, GPS, 3.5mm ఆడియో జాక్ మరియు USB టైప్-సి పోర్ట్ వంటివి కలిగి ఉన్నాయి. అలాగే ఆన్‌బోర్డ్ సెన్సార్లలో సామీప్య సెన్సార్, యాంబియంట్ లైట్ సెన్సార్, యాక్సిలెరోమీటర్, గైరోస్కోప్, ఎలక్ట్రానిక్ కంపాస్ మరియు IR బ్లాస్టర్ వంటి ఫీచర్లను కలిగి ఉన్నాయి. వీటితో పాటు AI-ఫేస్ అన్‌లాక్‌, సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్లను కలిగి ఉన్నాయి. అలాగే ఇవి 18W ఫాస్ట్ ఛార్జింగ్‌ మద్దతుతో 5,000mAh బ్యాటరీతో ప్యాక్ చేయబడి ఉన్నాయి. ఒకసారి ఛార్జీతో స్మార్ట్‌ఫోన్ రెండు రోజుల వరకు ఉపయోగంలో ఉంటుందని పోకో పేర్కొంది.

Most Read Articles
Best Mobiles in India

English summary
Realme 8 5G vs Poco M3 Pro 5G: Which One is Best

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X