Realme 8 సిరీస్ స్మార్ట్ ఫోన్లు లాంచ్!! మొదటి సేల్ నేడే ప్రారంభం...

|

చైనా స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ రియల్‌మి గత ఏడాది సెప్టెంబర్ లో విడుదల చేసిన రియల్‌మి 7 సిరీస్‌లకు అప్ గ్రేడ్ వెర్షన్ గా రియల్‌మి 8 ప్రో, రియల్‌మి 8 లను భారత్‌లో లాంచ్ చేసారు. ఈ రియల్‌మి 8 సిరీస్ ఫోన్లు ఫుల్-హెచ్‌డి + సూపర్ అమోలెడ్ డిస్ప్లేలు మరియు ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో లభిస్తాయి. అలాగే ఈ రెండూ వేరు వేరు ప్రాధమిక సెన్సార్‌లతో కూడిన క్వాడ్-రియర్ కెమెరాలతో వస్తాయి. ప్రో వేరియంట్ రెండు ర్యామ్ మరియు స్టోరేజ్ కాన్ఫిగరేషన్లలో విడుదలవగా రియల్‌మి 8 మూడు కాన్ఫిగరేషన్లలో విడుదల అయింది. ఈ ఫోన్ల యొక్క ధరలు మరియు ఫీచర్స్ గురించి మరిన్ని వివరాలు పూర్తిగా తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

రియల్‌మి 8 సిరీస్ ధరల వివరాలు

రియల్‌మి 8 సిరీస్ ధరల వివరాలు

రియల్‌మి 8 ప్రో (ఫస్ట్ ఇంప్రెషన్స్) రెండు వేరియంట్‌లో లభిస్తుంది. ఇందులో 6GB ర్యామ్ + 128GB స్టోరేజ్ వేరియంట్‌ యొక్క ధర రూ.17,999 కాగా 8GB ర్యామ్ + 128GB స్టోరేజ్ వేరియంట్ యొక్క ధర రూ.19,999. ఇది ఇన్ఫినిటీ బ్లాక్ మరియు ఇన్ఫినిటీ బ్లూ కలర్ ఎంపికలలో అందించబడుతుంది. అలాగే ఇది త్వరలో ఇల్యూమినేటింగ్ ఎల్లో వేరియంట్‌తో కూడా విడుదల కానున్నట్లు సంస్థ ప్రకటించింది. మరొకవైపు రియల్‌మి 8 మూడు వేరియంట్‌లో విడుదల అయింది. ఇందులో 4GB ర్యామ్ + 128GB కాన్ఫిగరేషన్ మోడల్ ధర రూ.14,999 కాగా 6GB ర్యామ్ + 128GB స్టోరేజ్ మోడల్ యొక్క ధర రూ.15,999చివరిగా టాప్-ఎండ్-లైన్ 8GB ర్యామ్ + 128GB స్టోరేజ్ మోడల్ యొక్క ధర రూ.16,999. ఈ ఫోన్ సైబర్ బ్లాక్ మరియు సైబర్ సిల్వర్ కలర్ ఆప్షన్లలో లభిస్తుంది.

రియల్‌మి 8 సిరీస్ లాంచ్ సేల్ వివరాలు

రియల్‌మి 8 సిరీస్ లాంచ్ సేల్ వివరాలు

రియల్‌మి 8 సిరీస్ యొక్క స్మార్ట్ ఫోన్లు రెండు భారతదేశంలో మార్చి 25 అంటే నేడు మధ్యాహ్నం 12 గంటల నుంచి ఫ్లిప్‌కార్ట్ మరియు రియల్‌మి ఇండియా వెబ్‌సైట్ మరియు మెయిన్‌లైన్ స్టోర్ల ద్వారా మొదటిసారి అమ్మకానికి రానున్నది. అమ్మకపు ఆఫర్లలో ఐసిఐసిఐ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ మరియు EMI లావాదేవీలతో 10 శాతం తక్షణ తగ్గింపు ఉంటుంది.

రియల్‌మి 8 సిరీస్‌ ఫోన్లతో పాటు హృదయ స్పందన రేటు, బాడీ మాస్ ఇండెక్స్ (BMI), ముస్కల్ ద్రవ్యరాశి, కొవ్వు రేటు వంటి మరిన్ని 16 హీత్ కొలతలను గుర్తించే రియల్‌మి స్మార్ట్ స్కేల్‌ను కూడా కంపెనీ ప్రకటించింది. రియల్‌మి స్మార్ట్ స్కేల్ యొక్క ధర రూ.1,999. దీనిని అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, రియల్‌మి ఇండియా వెబ్‌సైట్ ద్వారా మార్చి 30 మధ్యాహ్నం 12 గంటల నుండి అమ్మకానికి రానున్నది. చివరగా రియల్‌మి సంస్థ 16 మిలియన్ కలర్ లకు మద్దతును ఇచ్చే రియల్‌మి స్మార్ట్ బల్బును ప్రకటించింది. ఇది 9W మరియు 12W వేరియంట్లలో వస్తుంది. రియల్‌మి స్మార్ట్ బల్బ్ యొక్క 9W వేరియంట్‌ ధర రూ. 799, కాగా 12W వేరియంట్‌ ధర రూ.999. ఇది కూడా మార్చి 30 మధ్యాహ్నం 12 గంటల నుంచి అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, రియల్‌మి వెబ్‌సైట్ ద్వారా కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంటుంది.

రియల్‌మి 8 ప్రో  స్పెసిఫికేషన్స్

రియల్‌మి 8 ప్రో స్పెసిఫికేషన్స్

రియల్‌మి 8 ప్రో యొక్క స్పెసిఫికేషన్స్ విషయానికి వస్తే ఇది డ్యూయల్ సిమ్ (నానో) స్లాట్ కలిగి ఉండి ఆండ్రాయిడ్ 11 ఆధారిత రియల్‌మి UI 2.0 తో రన్ అవుతుంది. ఇది 6.4-అంగుళాల ఫుల్-హెచ్‌డి + సూపర్ అమోలెడ్ డిస్‌ప్లేను 1,080x2,400 పిక్సెల్స్, 90.8 శాతం స్క్రీన్ టు బాడీ రేషియో, 1,000 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్ మరియు 180HZ టచ్ శాంప్లింగ్ రేట్‌ను కలిగి ఉంది. అలాగే ఈ ఫోన్ క్వాలికామ్ స్నాప్‌డ్రాగన్ 720G SoC చేత అడ్రినో 618 GPU తో రన్ అవుతుంది. ఇది 8GB వరకు LPDDR4x RAM మరియు 128GB వరకు UFS 2.1 స్టోరేజ్ తో వస్తుంది. ఫోటోలు మరియు వీడియోల కోసం వెనుక భాగంలో క్వాడ్ రియర్ కెమెరా సెటప్‌తో ప్యాక్ చేయబడి వస్తుంది. ఇందులో ఎఫ్ / 1.88 లెన్స్‌తో 108 మెగాపిక్సెల్ శామ్‌సంగ్ ఐసోసెల్ HM2 ప్రైమరీ సెన్సార్, ఎఫ్ / 2.25 లెన్స్ మరియు 119-డిగ్రీ ఫీల్డ్-ఆఫ్-వ్యూ (FoV) అల్ట్రా-వైడ్ యాంగిల్ తో 8 మెగాపిక్సెల్ సెన్సార్ , f / 2.4 ఎపర్చర్‌తో 2 మెగాపిక్సెల్ మాక్రో షూటర్ మరియు f / 2.4 ఎపర్చర్‌తో 2 మెగాపిక్సెల్ బ్లాక్ అండ్ వైట్ సెన్సార్ ప్యాక్ చేయబడి ఉన్నాయి. అలాగే ముందు భాగంలో ఎఫ్ / 2.45 ఎపర్చరు లెన్స్‌తో 16 మెగాపిక్సెల్ సోనీ IMX471 సెన్సార్ కలిగి ఉంటుంది.

రియల్‌మి 8 స్పెసిఫికేషన్స్

రియల్‌మి 8 స్పెసిఫికేషన్స్

రియల్‌మి 8 ఫోన్ యొక్క స్పెసిఫికేషన్స్ విషయానికి వస్తే ప్రో వేరియంట్‌తో పోలిస్తే ఇది కొన్ని కీలక తేడాలతో వస్తుంది. రియల్‌మి 8 సిరీస్ ఒకే రకమైన డిస్‌ప్లేను కలిగి ఉంటాయి. అయితే ఇది ఆక్టా-కోర్ మీడియాటెక్ హెలియోG 95 SoC మరియు మాలి-G 76 Soc4 GPU ద్వారా శక్తిని పొందుతుంది. ఇది 8GB LPDDR4x RAM మరియు 128GB వరకు UFS 2.1 స్టోరేజ్ తో వస్తుంది. ఆప్టిక్స్ విషయానికొస్తే ఎఫ్ / 1.79 లెన్స్‌తో 64 మెగాపిక్సెల్ ప్రాధమిక సెన్సార్‌ను కలిగి ఉంది. మిగిలిన మూడు సెన్సార్లు రియల్‌మి 8 ప్రో మాదిరి అలాగే ఉంటాయి. కనెక్టివిటీ ఎంపికలు మరియు సెన్సార్లు రెండు ఒకే విధంగా ఉంటాయి. 30W డార్ట్ ఛార్జ్ ఫాస్ట్ ఛార్జింగ్ మద్దతుతో 5,000mAh పెద్ద బ్యాటరీని కలిగి ఉంటుంది.

Best Mobiles in India

English summary
Realme 8 Pro, Realme 8, Realme Smart Bulb and Smart Scale Released in India: Price, Specs, Sale Offers and More

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X