Home
News

రియల్‌మి స్మార్ట్‌ఫోన్‌ల మీద రూ.1,500 వరకు ధరలు పెరిగాయి!! కొత్త ధరలు ఇవిగో

రియల్‌మి సంస్థ భారతదేశంలో ఈ సంవత్సరంలో విడుదల చేసిన రియల్‌మి 8, రియల్‌మి 8 5G, రియల్‌మి C11 (2021), రియల్‌మి C21 మరియు రియల్‌మి C25s స్మార్ట్ ఫోన్ల యొక్క ధరలను ఇప్పుడు సుమారు రూ.1,500 వరకు పెంచారు. వీటిలో రియల్‌మి C21 (2021) ఫోన్ మీద రూ.300 ధరల పెంపు, రియల్‌మి C21 మరియు రియల్‌మి C25 ల మీద రూ.500 వరకు ధరల పెరుగుదలను అందుకున్నాయి. అలాగే మరొకవైపు రియల్‌మి 8 మరియు రియల్‌మి 8 5G ల మీద రూ.1,500 వరకు ధరల పెంపును అందుకున్నది. ఈ ధరల పెరుగుదల ఇప్పుడు Flipkart మరియు Realme.com వంటి అన్ని ఆన్‌లైన్‌ మాధ్యమాలలో ప్రతిబింబిస్తుంది.

భారతదేశంలో రియల్‌మి 8 కొత్త ధరల వివరాలు

భారతదేశంలో రియల్‌మి 8 కొత్త ధరల వివరాలు

ధరల పెరుగుదల అందుకున్న తరువాత భారతదేశంలో రియల్‌మి 8 స్మార్ట్ ఫోన్ యొక్క 4GB RAM + 128GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ.14,499 నుండి రూ.15,999 కి పెరిగింది. అలాగే 6GB ర్యామ్ + 128GB స్టోరేజ్ ఆప్షన్ ధర కూడా రూ.15,499 నుండి రూ. 16,999 కి పెరిగింది. చివరిగా టాప్-ఆఫ్-లైన్ 8GB ర్యామ్ + 128GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ.16,499 నుండి రూ. 17,999 కి పెరిగింది.

రియల్‌మి 8 5G కొత్త ధరల వివరాలు

రియల్‌మి 8 5G కొత్త ధరల వివరాలు

భారతదేశంలో రియల్‌మి 8 లాగానే రియల్‌మి 8 5G ఫోన్ మీద కూడా రూ.1,500 వరకు ధరల పెరుగుదలను అందుకున్నాయి. వీటిలో 4GB ర్యామ్ + 64GB స్టోరేజ్ వెర్షన్ యొక్క ధర రూ.13,999 నుండి రూ.15,499 కి పెరిగింది. అలాగే 4GB ర్యామ్ + 128GB స్టోరేజ్ మరియు 8GB ర్యామ్ + 128GB స్టోరేజ్ వేరియంట్‌లు వరుసగా రూ.14,999 నుండి రూ.16,499 మరియు రూ.16,999 నుండి రూ.18,499 ధరలు పెంపును అందుకున్నాయి.

భారతదేశంలో రియల్‌మి C11 (2021) కొత్త ధరల వివరాలు

భారతదేశంలో రియల్‌మి C11 (2021) కొత్త ధరల వివరాలు

రియల్‌మి సంస్థ భారతదేశంలో ధరల పెంపును ప్రకటించిన ఫోన్ లలో Realme C11 (2021) కూడా ఉంది. ఈ ధరలో పెంపులో 2GB ర్యామ్ + 32GB స్టోరేజ్ వేరియంట్‌ ధర మీద రూ.300 పెంపు అందుకున్న తరువాత దీని ధర రూ.6,999 నుండి రూ.7,299 కి పెరిగింది. అలాగే 4GB ర్యామ్ + 64GB స్టోరేజ్ మోడల్ కూడా రూ.8,499 నుండి రూ.8,799 ధరకు పెరిగింది.

రియల్‌మి C11, రియల్‌మి C25s కొత్త ధరల వివరాలు

రియల్‌మి C11, రియల్‌మి C25s కొత్త ధరల వివరాలు

రియల్‌మి C11 (2021) లాగానే రియల్‌మి C21 మరియు రియల్‌మి C25 లు కూడా రూ.500 ధరల పెంపును అందుకున్నాయి. ఇందులో రియల్‌మి C21 యొక్క 3GB ర్యామ్ + 32GB స్టోరేజ్ వేరియంట్‌ ధర మీద రూ.8,499 నుండి రూ.8,999 పెరిగింది. అలాగే 4GB + 64GB మోడల్ కోసం రూ.9,499 నుండి రూ.9,999 ధరలు పెరిగాయి. మరోవైపు రియల్‌మి C25s యొక్క 4GB + 64GB వేరియంట్ యొక్క ధరలు రూ. 10,499 నుండి రూ.10,999కి పెరిగాయి. అలాగే 4GB ర్యామ్ + 128GB స్టోరేజ్ మోడల్ యొక్క 4GB + 128GB మోడల్ ధరలు రూ.11,499 నుండి రూ.11,999 కి పెరిగాయి.

రియల్‌మి 8 5G స్పెసిఫికేషన్స్

రియల్‌మి 8 5G స్పెసిఫికేషన్స్

రియల్‌మి 8 5G ఫోన్ యొక్క స్పెసిఫికేషన్స్ విషయానికి వస్తే ఇది డ్యూయల్ సిమ్ (నానో) స్లాట్ కలిగి ఉండి ఆండ్రాయిడ్ 11 లో రియల్‌మి UI 2.0 తో రన్ అవుతుంది. ఈ ఫోన్ 1,080x2,400 పిక్సెల్స్, 20: 9 కారక నిష్పత్తి మరియు 90HZ రిఫ్రెష్ రేట్‌తో 6.5-అంగుళాల ఫుల్-హెచ్‌డి + డిస్ప్లేను కలిగి ఉంది. దీని యొక్క డిస్ప్లే 600 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌ను కలిగి ఉండడమే కాకుండా డ్రాగన్‌ట్రైల్ ప్రొటెక్షన్ తో వస్తుంది. ఇది మీడియా టెక్ డైమెన్సిటీ 700 SoC, ARM మాలి- G57 MC2 GPUలను కలిగి ఉండి 8GB వరకు LPDDR4x RAM తో జతచేయబడి వస్తుంది. సున్నితమైన మల్టీ టాస్కింగ్ కోసం స్టోరేజ్ ను వర్చువల్ ర్యామ్‌గా మార్చడానికి ఉద్దేశించిన DRE టెక్నాలజీ కూడా ఇది కలిగి ఉంది. ఆప్టిక్స్ విషయానికి వస్తే ఫోన్ వెనుక భాగంలో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ను కలిగి ఉంది. ఇందులో ఎఫ్ / 1.8 లెన్స్‌తో 48 మెగాపిక్సెల్ శామ్‌సంగ్ GM1 ప్రైమరీ సెన్సార్ తో పాటు ఎఫ్ / 2.4 పోర్ట్రెయిట్ లెన్స్ 2 మెగాపిక్సెల్ మోనోక్రోమ్ సెన్సార్‌ మరియు ఎఫ్‌/ 2.4 మాక్రో లెన్స్ తో 2 మెగాపిక్సెల్ మూడవ సెన్సార్ కెమెరాలు ప్యాక్ చేయబడి ఉన్నాయి. బ్యాక్ కెమెరా సెటప్ నైట్ స్కోప్, 48M మోడ్, ప్రో మోడ్, AI స్కాన్ మరియు సూపర్ మాక్రో వంటి సాఫ్ట్‌వేర్ ఫీచర్లతో జత చేయబడి వస్తుంది. సెల్ఫీలు మరియు వీడియో చాట్‌ల కోసం ఫోన్ ముందుభాగంలో ఎఫ్ / 2.1 లెన్స్‌తో 16 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా సెన్సార్‌ను కలిగి ఉంటుంది. ముందు కెమెరాలో పోర్ట్రెయిట్, నైట్‌స్కేప్ మరియు టైమ్‌లాప్స్ వంటి ఫీచర్లు కూడా ఉన్నాయి.

రియల్‌మి C25s స్మార్ట్‌ఫోన్ స్పెసిఫికేషన్స్

రియల్‌మి C25s స్మార్ట్‌ఫోన్ స్పెసిఫికేషన్స్

రియల్‌మి C25s స్మార్ట్‌ఫోన్ యొక్క స్పెసిఫికేషన్స్ విషయానికి వస్తే ఇది ఆండ్రాయిడ్ 11 ఆధారిత రియల్‌మి UI2.0 లో రన్ అవుతుంది. ఇది 6.5-అంగుళాల HD + LCD మల్టీ-టచ్ డిస్‌ప్లేను 720x1,600 పిక్సెల్స్, 88.7 శాతం స్క్రీన్-టు-బాడీ రేషియో, TUV రీన్‌ల్యాండ్ సర్టిఫికేషన్ మరియు 570 నిట్స్ మాక్స్ బ్రైట్‌నెస్ ఫీచర్లతో కలిగి ఉంది. ఇది మీడియాటెక్ హెలియో G85 Soc చేత రన్ అవుతూ 4GB ర్యామ్‌, 128GB ఇంటర్నల్ స్టోరేజ్ తో జత చేయబడి వస్తుంది. అలాగే ఇందులో గల ప్రత్యేకమైన మైక్రో SD కార్డ్ స్లాట్ ద్వారా మెమొరీని 256GB వరకు మరింత విస్తరించడానికి అనుమతిని కలిగి ఉంటుంది. ఆప్టిక్స్ విషయానికి వస్తే ఫోన్ వెనుక భాగంలో ట్రిపుల్ కెమెరా సెటప్ ను కలిగి ఉంది. ఇందులో 13 మెగాపిక్సెల్ మెయిన్ సెన్సార్, 2 మెగాపిక్సెల్ బ్లాక్ అండ్ వైట్ సెన్సార్ మరియు 2 మెగాపిక్సెల్ మాక్రో లెన్స్‌ కెమెరాలను కలిగి ఉన్నాయి. దీని బ్యాక్ కెమెరాలలో సూపర్ నైట్‌స్కేప్, అల్ట్రా మాక్రో మోడ్ వంటి మరిన్ని ఫీచర్స్ అందుబాటులో ఉన్నాయి. సెల్ఫీలు మరియు వీడియో కాల్ కోసం ముందు భాగంలో 8 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాను కలిగి ఉంది.

realme c20 realme c21 realme c25 launched, realme c20 price in india, realme c20 specs, realme c20 sale date, realme c21 price in india flipkart, realme c21 specifications, realme c21 sale date, realme c25 price in india flipkart, realme c25 specifications, realme c25s launched in india, realme c25s price in india, realme c25s specs, realme c25s features, realme c25s flipkart sale date, realme c25s flipkart sale offers, realme c25s processor, రియల్‌మే సి 25 లు ఇండియాలో ప్రారంభించబడ్డాయి, రియల్‌మే సి 25 ఎస్ ఇండియాలో ధర, రియల్‌మే సి 25 స్పెక్స్, రియల్‌మే సి 25 ఫీచర్స్, రియల్‌మే సి 25 ఫ్లిప్‌కార్ట్ అమ్మకపు తేదీ, రియల్‌మే సి 25 ఫ్లిప్‌కార్ట్ సేల్ ఆఫర్లు, రియల్‌మే సి 25 ప్రాసెసర్, రియల్‌మే సి 20 రియల్‌మే సి 21 రియల్‌మే సి 25 లాంచ్, రియల్‌మే సి 20 ప్రైస్ ఇన్ ఇండియా, రియల్‌మే సి 20 స్పెక్స్, రియల్‌మే సి 20 సేల్ డేట్, రియల్‌మే సి 21 ప్రైస్ ఇన్ ఇండియా ఫ్లిప్‌కార్ట్, రియల్‌మే సి 21 స్పెసిఫికేషన్స్, రియల్‌మే సి 21 సేల్ డేట్, రియల్‌మే సి 25 ప్రైస్ ఇన్ ఇండియా ఫ్లిప్‌కార్ట్, రియల్‌మే సి 25 స్పెసిఫికేషన్స్,

More from GizBot

Best Mobiles in India

English summary
Realme 8, Realme 8 5G, Realme C11 (2021), Realme C21, Realme C25s Price Hicked Up to Rs.1,500 in India: New Price, Sales, Offers and More
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X