రియల్‌మి 9 ప్రో 5G సిరీస్ స్మార్ట్‌ఫోన్‌లు లాంచ్ అయ్యాయి!! ఫీచర్స్ బ్రహ్మాండం
ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ రియల్‌మి నేడు ఇండియాలో రియల్‌మి 9 ప్రో 5G మరియు రియల్‌మి 9 ప్రో+ 5G లను లాంచ్ చేసింది. రెండు రియల్‌మి ఫోన్‌లు లైట్ షిఫ్ట్ డిజైన్‌తో లభిస్తుడడంతో సూర్యకాంతి లేదా అతినీలలోహిత కాంతి దీని మీద పడినప్పుడు వాటి వెనుక ప్యానెల్‌ల కలర్ లైట్ బ్లూ నుండి రెడ్‌కి మారుతుంది. కానీ కలర్-షిఫ్టింగ్ టెక్నాలజీ సన్‌రైజ్ బ్లూ కలర్ ఆప్షన్‌కు మాత్రమే పరిమితం చేయబడింది. ట్రిపుల్ రియర్ కెమెరా మరియు డైనమిక్ ర్యామ్ ఎక్స్‌పాన్షన్, ఇన్-బిల్ట్ స్టోరేజ్‌ని ఉపయోగించి ర్యామ్‌ను 5GB వరకు విస్తరింపజేసే అద్భుతమైన ఫీచర్లను కలిగి ఉన్నాయి. అలాగే స్ట్రీట్ ఫోటోగ్రఫీ మోడ్ 2.0తో ప్రీలోడ్, నియాన్ ట్రైల్, లైట్ ట్రైల్ పోర్ట్రెయిట్, రష్ అవర్ మరియు లైట్ పెయింటింగ్ వంటి ఫీల్టర్లను కూడా కలిగి ఉన్నాయి. ప్రధాన వ్యత్యాసాలలో రియల్‌మి 9 ప్రో 5G Qualcomm Snapdragon 695 SoC ద్వారా రియల్‌మి 9 ప్రో+ 5G 90Hz సూపర్ AMOLED డిస్‌ప్లే మరియు MediaTek డైమెన్సిటీ 920 SoCని కలిగి ఉంది. వీటి యొక్క మరిన్ని ఫీచర్ల గురించి తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

Realme 9 Pro 5G సిరీస్ ధరల వివరాలు
భారతదేశంలో రియల్‌మి 9 ప్రో 5G రెండు వేరియంట్లలో లాంచ్ అయింది. ఇందులో 6GB RAM + 128GB స్టోరేజ్ బేస్ వేరియంట్ ధర రూ.17,999 కాగా 8GB ర్యామ్ + 128GB స్టోరేజ్ మోడల్ ధర రూ.20,999. దీనికి విరుద్ధంగా రియల్‌మి 9 ప్రో+ 5G యొక్క 6GB ర్యామ్ + 128GB వేరియంట్ యొక్క ధర రూ.24,999 కాగా 8GB ర్యామ్ + 128GB స్టోరేజ్ మోడల్ ధర రూ.26,999 మరియు టాప్-ఆఫ్-ది-లైన్ 8GB + 256GB మోడల్ ధర రూ.28,999. ఈ స్మార్ట్‌ఫోన్‌లు అరోరా గ్రీన్, మిడ్‌నైట్ బ్లాక్ మరియు సన్‌రైజ్ బ్లూ కలర్లలో అందుబాటులో ఉంటాయి. రియల్‌మి 9 ప్రో 5G ఫిబ్రవరి 23న మధ్యాహ్నం 12 గంటల నుండి అమ్మకాలు ప్రారంభం కాగా రియల్‌మి 9 ప్రో+ 5G ఫిబ్రవరి 21న మధ్యాహ్నం 12 గంటల నుండి కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంటుంది. ఈ రెండు ఫోన్‌లు Flipkart, Realme.com మరియు మెయిన్‌లైన్ ఛానెల్‌ల నుండి అందుబాటులో ఉంటాయి. లాంచ్ ఆఫర్‌లలో HDFC బ్యాంక్ కార్డ్‌లను ఉపయోగించే కస్టమర్‌లకు రూ.2,000 తగ్గింపు లభిస్తుంది.

రియల్‌మి 9 ప్రో 5G స్పెసిఫికేషన్స్
రియల్‌మి 9 ప్రో 5G ఫోన్ యొక్క స్పెసిఫికేషన్స్ విషయానికి వస్తే ఇది ఆండ్రాయిడ్ 12 అవుట్-ఆఫ్-ది-బాక్స్‌లో రియల్‌మి UI 3.0తో రన్ అవుతుంది మరియు 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.6-అంగుళాల ఫుల్-HD+ LCD ప్యానెల్‌ను కలిగి ఉంది. ఈ ఫోన్ ఆక్టా-కోర్ Qualcomm Snapdragon 695 SoCతో పాటు Adreno 619 GPU మరియు 8GB వరకు RAMతో అందించబడుతుంది. ఆప్టిక్స్ పరంగా ఫోన్ వెనుక భాగంలో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. ఇందులో 64-మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్ f1.79 లెన్స్, అలాగే 8-మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ షూటర్ మరియు 2-మెగాపిక్సెల్ మాక్రో షూటర్ కెమెరాలు ఉన్నాయి. సెల్ఫీలు మరియు వీడియో చాట్‌ల కోసం ఫోన్ ముందు భాగంలో 16-మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా సెన్సార్‌ను అందిస్తుంది.

రియల్‌మి 9 ప్రో 5G ఫోన్ స్టాండర్డ్‌గా 128GB ఆన్‌బోర్డ్ స్టోరేజ్‌తో వస్తుంది. కనెక్టివిటీ ఎంపికలలో 5G, 4G LTE, Wi-Fi, బ్లూటూత్ v5.2, GPS/ A-GPS, USB టైప్-C మరియు 3.5mm హెడ్‌ఫోన్ జాక్ ఉన్నాయి. ఫోన్ సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్‌తో కూడా వస్తుంది. అలాగే ఇది 33W డార్ట్ ఛార్జ్ ఫాస్ట్ ఛార్జింగ్‌కు మద్దతు ఇచ్చే 5,000mAh బ్యాటరీతో ప్యాక్ చేయబడి వస్తుంది. ఇది 8.5mm మందంతో 195 గ్రాముల బరువుతో వస్తుంది.

రియల్‌మి 9 ప్రో+ 5G స్పెసిఫికేషన్స్
రియల్‌మి 9 ప్రో+ 5G యొక్క స్పెసిఫికేషన్స్ విషయానికి వస్తే ఇది ఆండ్రాయిడ్ 12 ఆధారంగా రియల్‌మి UI 3.0తో రన్ అవుతుంది. ఈ ఫోన్ 6.4-అంగుళాల ఫుల్-HD+ (1,080x2,400 పిక్సెల్‌లు) సూపర్ AMOLED డిస్‌ప్లేను 20:9 యాస్పెక్ట్ రేషియో మరియు 90Hz రిఫ్రెష్ రేట్‌తో కలిగి ఉంది. డిస్ప్లే 2.5D కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్ మరియు 180Hz టచ్ శాంప్లింగ్ రేట్‌తో కూడా వస్తుంది. హుడ్ కింద ఇది Mali-G68 MC4 GPUతో పాటు ఆక్టా-కోర్ మీడియాటెక్ డైమెన్సిటీ 920 SoC మరియు 8GB వరకు LPDDR4X RAMని కలిగి ఉంది.

ఫోటోలు మరియు వీడియోల కోసం Realme 9 Pro+ 5G ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (OIS)కి మద్దతు ఇచ్చే f/1.8 లెన్స్‌తో 50-మెగాపిక్సెల్ Sony IMX766 ప్రైమరీ సెన్సార్‌ని కలిగి ఉన్న ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. కెమెరా సెటప్‌లో f/2.2 అల్ట్రా-వైడ్ లెన్స్ మరియు 2-మెగాపిక్సెల్ మాక్రో షూటర్‌తో కూడిన 8-మెగాపిక్సెల్ సోనీ IMX355 సెన్సార్ కూడా ఉంది. ముందు భాగంలో f/2.4 లెన్స్‌తో 16-మెగాపిక్సెల్ Sony IMX471 సెల్ఫీ కెమెరా సెన్సార్‌తో వస్తుంది. ఫోన్‌లో క్లియర్ ఫ్యూజన్ అల్గారిథమ్ కూడా ఉంది. ఇది తక్కువ-కాంతి పరిస్థితులు మరియు ఇండోర్ సెట్టింగ్‌లలో కూడా బాగా-వెలిగించే సెల్ఫీలను క్యాప్చర్ చేయడంలో సహాయపడుతుందని పేర్కొంది.


Click it and Unblock the Notifications