Home
News

మీ ఫోన్ 5 నిమిషాల్లో పూర్తి ఛార్జింగ్ అవుతుంది! Realme నుంచి 300W ఛార్జింగ్ టెక్నాలజీ

చైనాలోని షెన్‌జెన్‌లోని కంపెనీ ప్రధాన కార్యాలయంలో ఆగస్టు 13 నుండి 15, 2024 వరకు జరగనున్న తన వార్షిక 828 ఫ్యాన్ ఫెస్టివల్ సందర్భంగా, సంస్థ నుంచి ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన ఛార్జింగ్ టెక్నాలజీని ప్రదర్శిస్తున్నట్లు Realme సంస్థ ప్రకటించింది.

ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీని లాంచ్ చేయడానికి సన్నాహాలు
ఈ ఈవెంట్ యొక్క ప్రధాన అంశం Realme యొక్క తాజా ఛార్జింగ్ టెక్నాలజీ ని ఆవిష్కరించడం ద్వారా ఇది 300W ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీగా ఉంటుందని అంచనా వేయబడుతుంది. ఈ కొత్త టెక్నాలజీ అభివృద్ధి పరిశ్రమలో కొత్త బెంచ్‌మార్క్‌ను సృష్టిస్తుంది. గత సంవత్సరం Realme GT Neo 5 తో ప్రవేశపెట్టిన 240W ఫాస్ట్ ఛార్జింగ్‌ను అధిగమించింది.

Realme Announces 300W World s Fastest Charging Technology

Realme ఇప్పటికి ఖచ్చితమైన వివరాలను ధృవీకరించనప్పటికీ, పరిశ్రమలో ఊహాగానాలు 300W ఛార్జర్ ద్వారా మూడు నిమిషాలలోపు ఫోన్‌ను 0% నుండి 50% వరకు ఛార్జ్ చేస్తుంది. మరియు సుమారు ఐదు నిమిషాలలో పూర్తి బ్యాటరీ ని ఛార్జ్‌ చేస్తుంది.

ఈవెంట్ సందర్భంగా రియల్‌మి నాలుగు యాజమాన్య ఆవిష్కరణలను కూడా పరిచయం చేస్తుంది. ఈ అభివృద్ధి ఛార్జింగ్ పవర్, బ్యాటరీ టెక్నాలజీ, కన్వర్టర్ పరిమాణం మరియు పవర్ రిడక్షన్ డిజైన్‌తో సహా వివిధ రంగాలలో దారితీస్తాయని చెప్పబడింది. ఛార్జింగ్ టెక్నాలజీతో పాటుగా, Realme కొత్త టెక్నాలజీ లపై పరిశోధన మరియు అభివృద్ధి ప్రయత్నాలను కొనసాగిస్తుంది, ముఖ్యంగా AI, పనితీరు మరియు ఇమేజింగ్ టెక్నాలజీలను అభివృద్ధి చేస్తోంది.

ఈవెంట్ వివరాలు
828 ఫ్యాన్ ఫెస్టివల్ కొత్త టెక్నాలజీని పరిచయం చేయడమే కాకుండా రియల్‌మి యొక్క ఇంటెలిజెంట్ ఫ్యాక్టరీకి ప్రత్యేక యాక్సెస్‌ను కూడా అందిస్తుంది. ఈ ఇవెంట్ కు హాజరైనవారు సంస్థ యొక్క తయారీ ప్రక్రియలు, పరీక్షా విధానాలు, మన్నిక పరీక్షలు మరియు ఇమేజింగ్ ల్యాబ్ టెస్ట్ లను ప్రత్యక్షంగా చూసే సదుపాయాన్ని సందర్శించడానికి అవకాశం ఉంటుంది.

గత సంవత్సరం 300W ఫాస్ట్ ఛార్జింగ్ సొల్యూషన్‌ను ఆవిష్కరించిన రెడ్‌మి వంటి ఇతర బ్రాండ్‌లు కూడా ఉన్నాయి. అయినప్పటికీ, Realme యొక్క దృష్టి దాని టెక్నాలజీ యొక్క ఆచరణాత్మక సామర్థ్యాలను మరియు స్మార్ట్‌ఫోన్ ఛార్జింగ్ యొక్క భవిష్యత్తు కోసం కొత్త టెక్నాలజీ లపై దృష్టి పెడుతోంది.

Realme కంపెనీ ఇటీవలే కొత్త Realme Narzo N61 ఫోన్‌ను విడుదల చేసింది. ఇది 'నార్జో' సిరీస్‌లో విడుదలైన కొత్త స్మార్ట్‌ఫోన్. బడ్జెట్ విభాగంలో కంపెనీ ఈ ఫోన్‌ను ప్రవేశపెట్టింది. ఈ ఫోన్ ఈ రోజు ఆగస్టు 6 మధ్యాహ్నం 12 నుంచి అమెజాన్ లో మొదటగా సేల్ కు వచ్చింది.ఈ స్మార్ట్‌ఫోన్‌ యొక్క 4GB RAM + 64GB స్టోరేజ్ ధర రూ. 7,499 6GB RAM + 128GB స్టోరేజ్ ధర రూ. 8,499 గా ఉంది ఈ స్మార్ట్‌ఫోన్‌ రూ. 7,000 కంటే తక్కువకు కొనుగోలు చేసే అవకాశాన్ని కూడా కంపెనీ కల్పించింది.

గిజ్‌బాట్‌ తెలుగు వెబ్‌సైట్ గాడ్జెట్లు సహా ఇతర టెక్‌ న్యూస్‌కు సంబంధించిన ఆసక్తికరమైన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియా ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా వార్తల కోసం సోషల్‌ మీడియా ఖాతాలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలాగే మీ తోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.

More from GizBot

Best Mobiles in India

English summary
Realme Announces 300W World's Fastest Charging Technology at 828 Fan Festival
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X