Home
News

విద్యార్థులే లక్ష్యంతో రియల్‌మి కొత్త బడ్జెట్ ల్యాప్‌టాప్‌లు!! త్వరలోనే లాంచ్

భారతీయ వినియోగదారుల కోసం ల్యాప్‌టాప్‌లను విడుదల చేయడానికి రియల్‌మి సంస్థ సన్నద్ధమవుతోంది. ఈ కంపెనీ ఇప్పటికే భారతదేశంలో ల్యాప్‌టాప్‌లను ప్రారంభించటాన్ని టీజ్ చేసింది. అయితే లాంచ్ తేదీని మాత్రం ఇంకా వెల్లడించలేదు. ఈ ఏడాది సెప్టెంబర్‌లో జరిగే పండుగ సీజన్‌కు ముందు రియల్‌మి మొదటి ల్యాప్‌టాప్ విడుదలయ్యే అవకాశం ఉంది. రాబోయే ఈ కొత్త ల్యాప్‌టాప్‌లు కళాశాల విద్యార్థులు, యువకులను లక్ష్యంగా చేసుకొని విడుదల చేయనున్నట్లు రియల్‌మి ఇండియా అధినేత మాధవ్ శేత్ మీడియా సంభాషణలో వెల్లడించారు.

ల్యాప్‌టాప్‌

ఇండియాలో ఈ ల్యాప్‌టాప్‌ల లాంచ్ గురించి రియల్‌మి ఇండియా అధినేత మాధవ్ శేత్ మాట్లాడుతూ "అభిమానులలో మరియు మీడియా సోదరభావం మధ్య ఉన్న ఆసక్తిని చూసి మేము ఆశ్చర్యపోయాము. రియల్‌మి ఎల్లప్పుడూ విద్యార్థులు మరియు నిపుణులైన యువతపై ఈ బ్రాండ్ అధికంగా దృష్టిని కేంద్రీకరించి వారి కోసం అనేక ఉత్పత్తులను అభివృద్ధి చేస్తుంది. అందులో భాగంగానే ఈ ల్యాప్‌టాప్లను కూడా బడ్జెట్ విభాగంలో చౌకైన ధర వద్దకే రియల్‌మి ల్యాప్‌టాప్లు విడుదల కానున్నాయి అని ప్రకటించారు.

రియల్‌మి ల్యాప్‌టాప్‌

రియల్‌మి ల్యాప్‌టాప్‌తో ఈ చైనా టెక్ దిగ్గజం Mi నోట్‌బుక్స్ మరియు ఇతర బ్రాండ్లు ఆసుస్, హెచ్‌పి, లెనోవా వంటి ఇతర బడ్జెట్ ల్యాప్‌టాప్‌లకు పోటీగా విడుదల చేయనున్నట్లు సమాచారం.

రియల్‌మి ప్యాడ్ లాంచ్

రియల్‌మి ప్యాడ్ లాంచ్

రాబోయే రోజుల్లో రియల్‌మి ప్యాడ్ అని పిలువబడే కొత్త టాబ్లెట్‌ను విడుదల చేయడాన్ని రియల్‌మి టీజ్ చేసింది. ఈ టీజర్ బాక్సీ డిజైన్‌తో రాబోయే రియల్‌మి టాబ్లెట్‌ను చూపిస్తుంది. రాబోయే నెలల్లో ఈ కంపెనీ సరసమైన ల్యాప్‌టాప్‌తో పాటు రియల్‌మి ప్యాడ్‌ను కూడా విడుదల చేయనున్నది.

AGM 2022

ఈ వారం ప్రారంభంలో ఒక వెబ్‌నార్ సందర్భంగా చైనా టెక్ దిగ్గజం 5G ఫోన్‌లను రూ.10,000 లోపు లాంచ్ చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ బడ్జెట్ 5G ఫోన్లు 2022 లో లాంచ్ అవుతాయని మాధవ్ షెత్ చెప్పారు. ఈ సరసమైన రియల్‌మి 5G ఫోన్‌లతో జియో బ్రాండ్ యొక్క జియోఫోన్ 5G వంటివి గట్టి పోటీని ఎదురుకోనున్నది. జియో సంస్థ తన 5G ఫోన్ ను గూగుల్ భాగస్వామ్యంతో AGM 2022 లో విడుదల చేయాలని భావిస్తున్నారు. గత సంవత్సరం AGM లో రిలయన్స్ టెక్ దిగ్గజం గూగుల్ సహకారంతో 5G జియో ఫోన్‌ను తీసుకువస్తున్నట్లు ప్రకటించింది.

More from GizBot

Best Mobiles in India

English summary
Realme Book Affordable Windows Laptops To Launch In India In 2021
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X