రియల్‌మి బుక్ ప్రైమ్ కొత్త ల్యాప్‌టాప్, ఇయర్‌బడ్స్ మొదటి సేల్స్ లో గొప్ప తగ్గింపు!! డిస్కౌంట్ ఆఫర్స్ కూడా

|

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ కంపెనీ రియల్‌మి ఇండియాలో గత వారం రియల్‌మి GT 2 ప్రో, రియల్‌మి GT 9 4G స్మార్ట్‌ఫోన్లు, రియల్‌మి బడ్స్ ఎయిర్ 3 TWS ఇయర్‌బడ్స్, రియల్‌మి స్మార్ట్ టీవీ స్టిక్‌ మరియు రియల్‌మి బుక్ ప్రైమ్ ల్యాప్‌టాప్లను తన యొక్క పోర్టుఫోలియోలో విడుదల చేసింది. ఇందులో రియల్‌మి బుక్ ప్రైమ్ ల్యాప్‌టాప్ మరియు ఇయర్‌బడ్స్ యొక్క సేల్స్ మొదలయ్యాయి. మొదటి సేల్స్ సందర్భంగా సంస్థ లాంచ్ ఆఫర్ల విభాగంలో గొప్ప తగ్గింపులను అందిస్తున్నది. వీటి గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

 

రియల్‌మి బుక్ ప్రైమ్ ల్యాప్‌టాప్ ధరలు & సేల్స్ వివరాలు

రియల్‌మి బుక్ ప్రైమ్ ల్యాప్‌టాప్ ధరలు & సేల్స్ వివరాలు

రియల్‌మి బుక్ ప్రైమ్ ల్యాప్‌టాప్ భారతదేశంలో 16GB + 512GB కాన్ఫిగరేషన్ మోడల్ రూ.64,999 ధర వద్ద రియల్ బ్లూ, రియల్ గ్రీన్ మరియు రియల్ గ్రే కలర్ ఆప్షన్‌లలో లాంచ్ అయింది. నేడు మధ్యాహ్నం 12 గంటల నుంచి realme.com, Flipkart మరియు ఆఫ్‌లైన్ స్టోర్‌లలో ప్రారంభం అయిన మొదటి సేల్స్ సమయంలో లాంచ్ ఆఫర్లలో భాగంగా దీనిని రూ.57,999 ప్రారంభ ధరతో కొనుగోలు చేయవచ్చు. అలాగే హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ యొక్క క్రెడిట్ కార్డ్‌లు మరియు డెబిట్ కార్డ్‌లను కలిగిన కస్టమర్‌లు రూ.3,000 వరకు తక్షణ తగ్గింపును పొందవచ్చు.

రియల్‌మి బడ్స్ ఎయిర్ 3 ధరల వివరాలు

రియల్‌మి బడ్స్ ఎయిర్ 3 ధరల వివరాలు

రియల్‌మి బడ్స్ ఎయిర్ 3 ఇయర్‌బడ్స్ ని నేటి మొదటి సేల్స్ లో రూ.3,999 ధర వద్ద గెలాక్సీ వైట్ మరియు స్టార్రీ బ్లూ కలర్ ఆప్షన్‌లలో Realme.com, Flipkart మరియు రిటైల్ స్టోర్‌ల ద్వారా కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంది.

రియల్‌మి బుక్ ప్రైమ్ ల్యాప్‌టాప్ స్పెసిఫికేషన్స్
 

రియల్‌మి బుక్ ప్రైమ్ ల్యాప్‌టాప్ స్పెసిఫికేషన్స్

రియల్‌మి బుక్ ప్రైమ్ యొక్క స్పెసిఫికేషన్ల విషయానికొస్తే ఇది అల్యూమినియం ఛాసిస్‌తో 14.9mm మందంతో కేవలం 1.37Kgs బరువును కలిగి ఉంటుంది. డిస్‌ప్లే విషయానికి వస్తే ఈ ల్యాప్‌టాప్ 14-అంగుళాల IPS LCD డిస్‌ప్లేను 2048×1080 పిక్సెల్‌లను 2K రిజల్యూషన్‌తో మరియు 400 nits పీక్ బ్రైట్‌నెస్‌తో వస్తుంది. అలాగే ఇది 11వ తరం ఇంటెల్ కోర్ i5-11320 ప్రాసెసర్‌తో ఆధారితంగా రన్ అవుతూ ఇంటెల్ ఐరిస్ X గ్రాఫిక్స్‌తో జత చేయబడి వస్తుంది. ఇది అధిక సమయం వినియోగించడానికి వీలుగా వేడి వెదజల్లడాన్ని మెరుగ్గా నిర్వహించడానికి VC లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో కూడా వస్తుంది. ఇంటెల్ ప్రాసెసర్ గరిష్టంగా 16GB వరకు LPDDR4x RAM మరియు 512GB PCle SSD స్టోరేజ్ తో జత చేయబడి ఉండి విండోస్ 11 ఓఎస్‌తో రన్ అవుతుంది.

రియల్‌మి బుక్ ప్రైమ్

సాధారణంగా ల్యాప్‌టాప్లలో అందురు ముఖ్యంగా గమనించే మరొక విషయం బ్యాటరీ. ఈ విషయంలో రియల్‌మి బుక్ ప్రైమ్ USB టైప్-సి పోర్ట్ ద్వారా 65W పాస్ట్ ఛార్జింగ్‌ మద్దతుతో 54Wh బ్యాటరీతో ప్యాక్ చేయబడి వస్తుంది. Realme కొత్తగా ప్రారంభించిన ల్యాప్‌టాప్ 12 గంటల వరకు బ్యాటరీ లైఫ్ ను అందిస్తుందని కంపెనీ తెలిపింది. కనెక్టివిటీ ఎంపికలలో WiFi 6, Thunderbolt 4, 3.5mm జాక్, USB-A 3.1 Gen 1 పోర్ట్, USB-C 3.2 Gen 2 పోర్ట్ వంటివి ఉన్నాయి. అదనపు ఫీచర్లు DTS ద్వారా స్టీరియో సౌండ్‌తో బ్యాక్‌లిట్ కీబోర్డ్‌ను కలిగి ఉంటాయి.

రియల్‌మి బడ్స్ ఎయిర్ 3 ఇయర్‌బడ్స్ స్పెసిఫికేషన్స్

రియల్‌మి బడ్స్ ఎయిర్ 3 ఇయర్‌బడ్స్ స్పెసిఫికేషన్స్

Realme Buds Air 3 TWS ఇయర్‌బడ్స్ యొక్క స్పెసిఫికేషన్స్ విషయానికి వస్తే ఇవి 10mm డైనమిక్ బాస్ బూస్ట్ డ్రైవర్‌లతో అమర్చబడి ఉన్నాయి. ఇయర్‌బడ్‌లు బయటి శబ్దాన్ని 42dB వరకు తగ్గించడానికి TUV-Rheinland ధృవీకరించిన యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్‌ను కలిగి ఉండడమే కాకుండా పారదర్శకత మోడ్‌తో పాటు రెండు మైక్రోఫోన్‌లను కలిగి ఉంటాయి. Realme Buds Air 3 చేర్చబడిన గేమ్ మోడ్‌తో 88ms తక్కువ జాప్యాన్ని అందిస్తుంది. ఇది మునుపటి తరం కంటే 35 శాతం తక్కువ అని క్లెయిమ్ చేయబడింది. రియల్‌మి కొత్త ఇయర్‌బడ్స్ ఎయిర్ 3 బ్లూటూత్ v5.2 కనెక్టివిటీని అందిస్తోంది. అలాగే గూగుల్ ఫాస్ట్ పెయిర్ కి మద్దతుతో పాటు ఒకేసారి రెండు పరికరాలకు కనెక్ట్ చేయగలదు. నీటి-నిరోధకత కోసం ఈ ఇయర్‌బడ్‌లు IPX5 రేట్ చేయబడ్డాయి. ఇవి కేవలం 10 నిమిషాల ఛార్జ్‌తో 100 నిమిషాల ప్లేబ్యాక్ టైమ్‌ను, మొత్తం ఫుల్ ఛార్జ్‌పై ప్లేబ్యాక్‌ను 30 గంటల వరకు అందజేస్తుందని క్లెయిమ్ చేయబడింది.

Most Read Articles
Best Mobiles in India

English summary
Realme Book Prime laptop, Realme Buds Air 3 First Sale Live on Flipkart and Realme.com: Price, Specs, Features, Sales Offers and More

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X