రియల్‌మి బుక్ స్లిమ్ ఫీచర్స్ లీక్ అయ్యాయి!! పూర్తి వివరాలు ఇవిగో...
భారతదేశంలో రియల్‌మి బుక్ స్లిమ్ లాంచ్ త్వరలోనే ఉంది. అయితే కంపెనీ దాని భౌతిక కనెక్టివిటీ ఎంపికల గురించి కొన్ని వివరాలను పంచుకుంది. దీని యొక్క పోర్ట్‌లు ఇప్పటికే విడుదలైన లీక్ ఇమేజెస్ ద్వారా వెల్లడించగా రియల్‌మి బుక్ స్లిమ్ యొక్క తాజా టీజర్ పోర్ట్ వివరాలతో పాటుగా చౌకైన ఇంటెల్ కోర్ i3-పవర్డ్ కలిగి ఉండవచ్చని సూచిస్తుంది. అదనంగా రియల్‌మి బుక్ - రియల్‌మి బుక్ స్లిమ్ యొక్క చైనీస్ వెర్షన్‌కు పేరుగా భావిస్తున్నారు. ఇది 11వ జెన్ ఇంటెల్ కోర్ i5 CPU ద్వారా శక్తిని పొందుతుందని నిర్ధారించబడింది.

రియల్‌మి ఇండియా మరియు యూరోప్ CEO మాధవ్ శేత్ తన యొక్క ట్విట్టర్ ద్వారా సంస్థ నుంచి త్వరలో రాబోయే రియల్‌మి బుక్ స్లిమ్ కి సంబందించిన ఒక ఫోటోను ట్వీట్ చేసారు. ఇది కనెక్టివిటీ పోర్టుల గురించి వివరిస్తున్నారు. ఇది ఎడమ వైపున రెండు USB టైప్-సి పోర్ట్‌లను మరియు కుడి వైపున 3.5mm హెడ్‌ఫోన్ జాక్‌తో పాటు ఒకే USB టైప్-ఎ పోర్ట్‌లను చూపుతుంది. ఎడమవైపు ఉన్న USB టైప్-సి పోర్ట్‌లలో ఒకటి థండర్ బోల్ట్ 4 పోర్ట్ కాగా, మరొకటి యుఎస్‌బి 3.2 టైప్-సి జెన్ 2 పోర్ట్. కుడి వైపున USB 3.1 టైప్-ఏ Gen 1 పోర్ట్ మరియు పైన పేర్కొన్న 3.5mm హెడ్‌ఫోన్ జాక్ ఉన్నాయి.

షేత్ షేర్ చేసిన ఇమేజ్ గురించి మరింత ఆసక్తికరమైన విషయం ఏమిటంటే దిగువవైపున కుడి మూలలో ఈ పోర్ట్ ఎంపిక ఇంటెల్ కోర్ i5- పవర్డ్ మోడల్‌లో మాత్రమే అందుబాటులో ఉందని పేర్కొంది. ఈ స్పష్టత థండర్ బోల్ట్ 4 పోర్టును సూచిస్తుంది. అయితే ఇది థండర్ బోల్ట్ 4 పోర్ట్ లేని రియల్‌మి బుక్ స్లిమ్ యొక్క ఇంటెల్ కోర్ i3- పవర్డ్ మోడల్ ఉందని సూచిస్తుంది. ఈ కోర్ i3 మోడల్ థండర్ బోల్ట్ 3 USB టైప్-సి పోర్ట్ లేదా సెకండరీ USB 3.2 టైప్-సి జెన్ 2 పోర్ట్‌తో రావచ్చు.

ఇంటెల్ కోర్ i3 మోడల్ ఏ రకమైన పోర్టుతో సంబంధం లేకుండా ఇది ఇంటెల్ కోర్ i5- పవర్డ్ మోడల్ కంటే చౌకగా ఉంటుంది. ఇది గతంలో రూ. 55,000 ధరతో లభించేది. మరో నివేదిక ప్రకారం రియల్‌మి బుక్ స్లిమ్ ప్రారంభ ధర రూ.40,000 ఉండవచ్చు అది కూడా ఇంటెల్ కోర్ i3- పవర్డ్ మోడల్ కావచ్చు.

రియల్‌మి బుక్ భారత లాంచ్ అయిన ఆగస్టు 18 అదే తేదీన చైనా లాంచ్ కోసం కూడా షెడ్యూల్ చేయబడింది. కానీ ఆ మోడల్ 'స్లిమ్' మోనికర్‌ను కలిగి ఉండదు. ఇప్పుడు కంపెనీ వీబోలో షేర్ చేసింది. రియల్‌మి బుక్ 11 వ జెన్ ఇంటెల్ కోర్ i5 ప్రాసెసర్‌తో శక్తినిస్తుంది. ఇది ఇంటెల్ కోర్ i5-1135G7 CPU వద్ద గతంలో లీక్ అయిన స్పెసిఫికేషన్‌లకు అనుగుణంగా ఉంటుంది. ఇది రియల్‌మే బుక్ స్లిమ్‌లో కూడా ఉండే ప్రాసెసర్ కావచ్చు.


Click it and Unblock the Notifications








