Home
News

రియల్‌మి నాలుగు స్మార్ట్‌ఫోన్‌ల ధరలు భారీగా పెరిగాయి!! వివరాలు ఇవిగో

స్మార్ట్‌ఫోన్ తయారీదారులు అందరూ కూడా భారతదేశంలో ఆలస్యంగా తమ యొక్క ఫోన్ ల మీద ధరల సమర్పణలను పెంచుతున్నారు. స్మార్ట్‌ఫోన్‌ల యొక్క ధరలను పెంచిన బ్రాండ్‌లలో రియల్‌మి కూడా ఒకటి. కొన్ని నివేదికల ప్రకారం ఈ బ్రాండ్ యొక్క రియల్‌మి 8 5G, రియల్‌మి C21, రియల్‌మి నార్జో 30 4G మరియు రియల్‌మి C25 లతో సహా అనేక స్మార్ట్‌ఫోన్‌ల యొక్క ధరల మీద సుమారు 500 రూపాయల ధరల పెంపును అందుకున్నాయి. అయితే ఈ ధరల పెరుగుదల ఆఫ్‌లైన్ స్టోర్‌లకు మాత్రమే వర్తిస్తుంది. Flipkart మరియు రియల్‌మి వెబ్‌సైట్‌లలో ఈ స్మార్ట్‌ఫోన్‌లను తమ పాత ధరకే విక్రయిస్తున్నాయి. దీని గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

రియల్‌మి 8 5G ధరల పెంపు

రియల్‌మి 8 5G ధరల పెంపు

ధరల పెరుగుదలపై వివరంగా చెప్పాలంటే రియల్‌మి 8 5G యొక్క 4GB RAM + 64GB ROM స్టోరేజ్ బేస్ వేరియంట్ ను ఇప్పుడు రూ.14,999 నుంచి కొనుగోలు చేయవచ్చు. అయితే ఈ బేస్ వేరియంట్ ముందు రూ.14,499 ధర వద్ద లభించేది. అదేవిధంగా 4GB RAM + 128GB స్టోరేజ్ మోడల్ యొక్క మిడ్-వేరియంట్ రూ.15,499 ధరకి బదులుగా ఇప్పుడు రూ.15,999 ధర వద్ద కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంది. చివరిగా 8GB RAM + 128GB స్టోరేజ్ యొక్క హై-ఎండ్ వేరియంట్ ధర రూ .17,499 నుంచి ఇప్పుడు రూ.500 పెరిగి రూ.17,999 ధర వద్ద లభిస్తున్నది.

రియల్‌మి C21 ధరల పెరుగుదల

రియల్‌మి C21 ధరల పెరుగుదల

రూ.10,000 లోపు బడ్జెట్ ధర విభాగంలో లభించే రియల్‌మి C21యొక్క ధరల పెంపు విషయానికి వస్తే 3GB RAM + 32GB ROM బేస్ వేరియంట్ ఇంతకు ముందు లభించే రూ.8,499 ధరకి బదులుగా ఇప్పుడు రూ.8,999 ధర వద్ద నుంచి ప్రారంభమవుతుంది. అలాగే 4GB RAM + 64GB ROM వేరియంట్ ధర మునుపటి ధర రూ.9,499 కి బదులుగా ఇప్పుడు రూ.9,999 ధర వద్ద కొనుగోలు చేయవచ్చు.

రియల్‌మి C25s ధరల మార్పులు

రియల్‌మి C25s ధరల మార్పులు

రియల్‌మి C25s యొక్క ధరల పెరుగుదల విషయానికి వస్తే ఈ స్మార్ట్‌ఫోన్ యొక్క రెండు వేరియంట్‌ల మీద కూడా ధరల పెంపు లభించింది. ఇందులో ముందు రూ.10,499 ధర వద్ద లభించే 4GB RAM + 64GB ROM బేస్ వేరియంట్‌ ధరల పెంపు తరువాత దాని ధర రూ.10,999 కి చేరింది. అలాగే 4GB RAM + 128GB ROM హై-ఎండ్ వేరియంట్ ధర రూ.11,499 మునుపటి ధరకు బదులుగా పెంపు తరువాత ఇప్పుడు రూ.11,999 ధర వద్ద లభిస్తుంది.

రియల్‌మి నార్జో 30 4G ధరల పెంపు

రియల్‌మి నార్జో 30 4G ధరల పెంపు

చివరిగా రియల్‌మి నార్జో 30 4G కూడా ధరల పెంపును అందుకున్న స్మార్ట్‌ఫోన్‌లలో ఒకటిగా నిలిచింది. దీని యొక్క 4GB RAM + 64GB ROM బేస్ వేరియంట్ ధర రూ .12,499 కు బదులుగా రూ.12,999 కు అందుకున్నది. మరోవైపు 6GB RAM + 64GB ROM మిడ్-రేంజ్ వేరియంట్ మరియు 6GB RAM + 128GB ROM హై-ఎండ్ వేరియంట్ రెండిటి ధరల మీద రూ.500 పెరిగిన తర్వాత వీటి ధరలు వరుసగా రూ.13,999 మరియు రూ.14,999 లకు అందుకున్నాయి.

రియల్‌మి C25s స్మార్ట్‌ఫోన్ స్పెసిఫికేషన్స్

రియల్‌మి C25s స్మార్ట్‌ఫోన్ స్పెసిఫికేషన్స్

రియల్‌మి C25s స్మార్ట్‌ఫోన్ యొక్క స్పెసిఫికేషన్స్ విషయానికి వస్తే ఇది ఆండ్రాయిడ్ 11 ఆధారిత రియల్‌మి UI2.0 లో రన్ అవుతుంది. ఇది 6.5-అంగుళాల HD + LCD మల్టీ-టచ్ డిస్‌ప్లేను 720x1,600 పిక్సెల్స్, 88.7 శాతం స్క్రీన్-టు-బాడీ రేషియో, TUV రీన్‌ల్యాండ్ సర్టిఫికేషన్ మరియు 570 నిట్స్ మాక్స్ బ్రైట్‌నెస్ ఫీచర్లతో కలిగి ఉంది. ఇది మీడియాటెక్ హెలియో G85 Soc చేత రన్ అవుతూ 4GB ర్యామ్‌, 128GB ఇంటర్నల్ స్టోరేజ్ తో జత చేయబడి వస్తుంది. అలాగే ఇందులో గల ప్రత్యేకమైన మైక్రో SD కార్డ్ స్లాట్ ద్వారా మెమొరీని 256GB వరకు మరింత విస్తరించడానికి అనుమతిని కలిగి ఉంటుంది. రియల్‌మి C25s స్మార్ట్‌ఫోన్ యొక్క ఆప్టిక్స్ విషయానికి వస్తే ఫోన్ వెనుక భాగంలో ట్రిపుల్ కెమెరా సెటప్ ను కలిగి ఉంది. ఇందులో 13 మెగాపిక్సెల్ మెయిన్ సెన్సార్, 2 మెగాపిక్సెల్ బ్లాక్ అండ్ వైట్ సెన్సార్ మరియు 2 మెగాపిక్సెల్ మాక్రో లెన్స్‌ కెమెరాలను కలిగి ఉన్నాయి. దీని బ్యాక్ కెమెరాలలో సూపర్ నైట్‌స్కేప్, అల్ట్రా మాక్రో మోడ్ వంటి మరిన్ని ఫీచర్స్ అందుబాటులో ఉన్నాయి. సెల్ఫీలు మరియు వీడియో కాల్ కోసం ముందు భాగంలో 8 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాను కలిగి ఉంది.

More from GizBot

Best Mobiles in India

English summary
Realme Brand Smartphones Price Hicked in India: Here are Details
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X