ఇండియాకి రియల్‌మీ బడ్స్ ఎయిర్ 7 వచ్చేస్తున్నాయ్.. నాయిస్ క్యాన్సిలేషన్, 3 కలర్స్ అదుర్స్... ధర ఎంతంటే..?
Realme Air 7 Buds: రియల్‌మీ అంటేనే స్టైలిష్ డిజైన్స్, మెరుగైన ఫీచర్లు కలిగిన ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ గుర్తొస్తాయి. ముఖ్యంగా ఈ సంస్థ ఆడియో ప్రొడక్ట్స్ ప్రజల్లో విపరీతమైన క్రేజ్ సంపాదించాయి. బడ్జెట్ ధరల్లోనే బీట్ అదిరిపోయేలా ఉండే ఇయర్‌బడ్స్ అందిస్తూ రియల్‌మీ ఒక ట్రెండ్ సెట్టర్‌గా నిలిచింది. ఇప్పుడు ఫ్యాన్స్ అంతా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ప్రీమియం ఇయర్ బడ్స్ వచ్చేస్తున్నాయి. రియల్‌మీ బడ్స్ ఎయిర్ 7 పేరుతో మార్కెట్లోకి సిద్ధమైపోయాయి.
* మార్చి 19న గ్రాండ్ లాంచ్..
రియల్‌మీ బడ్స్ ఎయిర్ 7 ఇండియాలో 2025, మార్చి 19 మధ్యాహ్నం 12 గంటలకు లాంచ్ కానున్నాయి. ఫ్లిప్‌కార్ట్, రియల్‌మీ అధికారిక వెబ్‌సైట్‌లో వీటిని కొనుగోలు చేయవచ్చు. సో, సరికొత్త ఆడియో అనుభూతి పొందాలనుకునేవారు ఈ తేదీని గుర్తు పెట్టుకోవాలి. రివ్యూలు వచ్చాక వీటిని కొనుగోలు చేయొచ్చా లేదా అనేది నిర్ణయించుకోవచ్చు.

* డిజైన్, లుక్స్
రియల్‌మీ బడ్స్ ఎయిర్ 7 డిజైన్ గురించి ఎంత చెప్పినా తక్కువే. క్రిస్టల్ మిక్స్డ్ డిజైన్‌తో ఇవి నిజంగా ప్రీమియం లుక్స్‌తో ఆకట్టుకుంటాయి. ఇంకా మూడు కలర్ ఆప్షన్స్‌లో వస్తున్నాయి. ఐవరీ గోల్డ్, లావెండర్ పర్పుల్ మరియు మోస్ గ్రీన్. ఈ మూడు రంగులు కూడా చాలా స్టైలిష్‌గా ఉన్నాయి. అంతేకాదు, డస్ట్, వాటర్ రెసిస్టెన్స్ కోసం IP55 రేటింగ్ కూడా ఉంది.
* ఫీచర్లు, సౌండ్ క్వాలిటీ
ఫీచర్ల విషయానికొస్తే, రియల్‌మీ బడ్స్ ఎయిర్ 7 ఒక రేంజ్‌లో ఉన్నాయి. 52dB అడాప్టివ్ యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ (ANC) ఫీచర్‌తో వస్తున్నాయి. అంటే రద్దీగా ఉన్న ప్రదేశంలో ఉన్నా సరే, ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా మీ మ్యూజిక్ లేదా కాల్స్‌లో మునిగిపోవచ్చు. క్లియర్ వాయిస్ కాల్స్ కోసం ఆరు మైక్రోఫోన్ సెటప్ ఉంది.
సౌండ్ క్వాలిటీ గురించి చెప్పాలంటే
12.4mm డీప్ బాస్ డ్రైవర్‌తో వస్తున్నాయి. బేస్ అదిరిపోతుంది, ప్రతి బీట్ మీకు గూస్‌బంప్స్ తెప్పిస్తుంది. Hi-Res ఆడియో సర్టిఫికేషన్, 360-డిగ్రీ స్పేషియల్ ఆడియో, LHDC 5.0 టెక్నాలజీ వంటి అదనపు ఫీచర్లు కూడా ఉన్నాయి. మొత్తానికి సౌండ్ క్వాలిటీ విషయంలో మాత్రం రాజీ పడే ప్రసక్తే లేదు.
*:బ్యాటరీ లైఫ్, ఫాస్ట్ ఛార్జింగ్..
బ్యాటరీ లైఫ్ విషయంలో కూడా రియల్‌మీ బడ్స్ ఎయిర్ 7 సూపర్ అని చెప్పొచ్చు. ఒక్కసారి ఛార్జ్ చేస్తే ఛార్జింగ్ కేస్‌తో కలిపి ఏకంగా 52 గంటల వరకు ప్లేబ్యాక్ టైమ్ వస్తుంది. అంతేకాదు, కేవలం 10 నిమిషాలు ఛార్జ్ చేస్తే 10 గంటల ప్లేబ్యాక్ టైమ్ వస్తుంది. అంటే బ్యాటరీ గురించి అస్సలు టెన్షన్ పడక్కర్లేదు.
* ఇతర స్పెసిఫికేషన్లు
చైనా మార్కెట్లో రియల్ మీ బడ్స్ ఎయిర్ 7 ధర CNY 299 (సుమారు రూ.3,600) గా ఉంది. ఒక్కో ఇయర్‌బడ్‌లో 62mAh బ్యాటరీ, ఛార్జింగ్ కేస్‌లో 480mAh బ్యాటరీ ఉంటుంది. డ్యూయల్-డివైస్ కనెక్టివిటీ సపోర్ట్ ఉంది, అంటే ఒకేసారి రెండు డివైజ్‌లకు కనెక్ట్ చేసుకోవచ్చు. గేమింగ్ కోసం 45ms లో-లేటెన్సీ మోడ్ కూడా ఉంది. గేమింగ్ లవర్స్‌కి ఇది నిజంగా గుడ్ న్యూస్.
మొత్తానికి రియల్‌మీ బడ్స్ ఎయిర్ 7 ప్రీమియం ఫీచర్లు, స్టైలిష్ డిజైన్, లాంగ్ బ్యాటరీ లైఫ్‌తో ఇండియన్ మార్కెట్లో ఒక సంచలనం సృష్టించడానికి రెడీగా ఉన్నాయి. ఇండియాలో ధర ఎంత ఉంటుందనేది లాంచ్ ఈవెంట్‌లో తెలుస్తుంది. అప్పటి వరకు వెయిట్ చేయాల్సిందే.


Click it and Unblock the Notifications








