ఓపెన్ సేల్ ద్వారా అమ్మకానికి Realme Buds Q !!! ఆఫర్స్ బ్రహ్మాండం...

|

రియల్‌మి సంస్థ గత వారం కొత్తగా తన రియల్‌మి X3 స్మార్ట్ ఫోన్ తో పాటు ప్రారంభించిన రియల్‌మి బడ్స్ క్యూ వైర్‌లెస్ ఇయర్‌ఫోన్‌లను ఇప్పుడు ఓపెన్ సేల్‌ ద్వారా అమ్మకానికి ఉంచింది. రియల్‌మి జూలై 1 న దీని తొలి అమ్మకాన్ని మొదలు పెట్టింది. మొదటి అమ్మకంలో ఈ ఇయర్‌బడ్‌లు సుమారు 25,000 యూనిట్లకు పైగా విక్రయాలు జరిగినట్లు సంస్థ ప్రకటించింది.

రియల్‌మి బడ్స్ Q  ఓపెన్ సేల్

రియల్‌మి బడ్స్ Q ఓపెన్ సేల్

రియల్‌మి బడ్స్ క్యూ వైర్‌లెస్‌ను ఇప్పుడు ఓపెన్ సేల్ ద్వారా అమెజాన్ ఇండియా మరియు రియల్‌మి.కామ్ ద్వారా అమ్మకాలు జరుపుతున్నారు. కొనాలని చూస్తున్న వినియోగదారులు మంచి ఆఫర్లతో వీటిని కొనుగోలు చేయవచ్చు. రియల్‌మి అధికారికంగా ఎటువంటి విషయాన్ని ప్రకటించలేదు కాబట్టి ఈ ఓపెన్ సేల్ శాశ్వతంగా చురుకుగా ఉండవచ్చు. కంపెనీ తన అదనపు స్టాక్‌ను విక్రయించడానికి ప్రయత్నిస్తుందో లేదో అన్న దాని మీద సరైన సమాచారం అందుబాటులో లేదుగా. సాధారణంగా రియల్‌మి తన ఉత్పత్తులను ఓపెన్ సేల్‌లో ఉంచే ముందు 4-5 ఫ్లాష్ అమ్మకాల ద్వారా అందుబాటులో ఉంచుతుంది.

 

Also Read: డౌన్‌లోడ్‌లలో టిక్‌టాక్ రికార్డును అధిగమించిన Chingari యాప్...Also Read: డౌన్‌లోడ్‌లలో టిక్‌టాక్ రికార్డును అధిగమించిన Chingari యాప్...

రియల్‌మి బడ్స్ Q ధరల వివరాలు
 

రియల్‌మి బడ్స్ Q ధరల వివరాలు

ఇండియాలో రియల్‌మి బడ్స్ క్యూ ట్రూ వైర్‌లెస్ ఇయర్‌బడ్స్‌ను జూన్ 25 న రియల్‌మి X3 సిరీస్‌తో పాటు లాంచ్ చేశారు. ఈ రియల్‌మి బడ్స్ క్యూ నలుపు, తెలుపు మరియు పసుపు వంటి మూడు కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. ఈ ఇయర్‌బడ్స్ యొక్క ధర 1,999 రూపాయలు.

 

Also Read: Instagram Stories లలో క్విజ్ స్టిక్కర్‌లను పోస్ట్ చేయడం ఎలా?Also Read: Instagram Stories లలో క్విజ్ స్టిక్కర్‌లను పోస్ట్ చేయడం ఎలా?

రియల్‌మి బడ్స్ Q స్పెసిఫికేషన్స్

రియల్‌మి బడ్స్ Q స్పెసిఫికేషన్స్

బడ్జెట్ ధరలో లభించే రియల్‌మి బడ్స్ Q ట్రూ వైర్‌లెస్ ఇయర్‌బడ్స్‌ 10mm డ్రైవర్లను కలిగి ఉంది. అలాగే ఇది SBC మరియు AAC కోడెక్ రెండింటికి మద్దతు ఇస్తుంది. బడ్స్ క్యూ వైర్‌లెస్ 119ms వద్ద సూపర్ లేటెన్సీ గేమింగ్ మోడ్‌ను కూడా అందిస్తుంది. కనెక్టివిటీ కోసం బ్లూటూత్ 5.0 ను కలిగి ఉంది. అలాగే ఇవి నీటి నిరోధకత కోసం IPX 4 ధృవీకరణను కూడా కలిగి ఉన్నాయి.

రియల్‌మి బడ్స్ Q డిజైన్

రియల్‌మి బడ్స్ Q డిజైన్

రియల్‌మి బడ్స్ Q ట్రూ వైర్‌లెస్ ఇయర్‌ఫోన్‌ల యొక్క ప్రతి బడ్ పైన టచ్ మద్దతుతో వస్తాయి. రియల్‌మి లింక్ యాప్ ను ఉపయోగించి యాక్సిస్ చేయడానికి వినియోగదారులను అనుమతిస్తుంది. ఈ బడ్స్ క్యూ వైర్‌లెస్‌ను గత నెలలో చైనాలో తొలిసారిగా లాంచ్ చేశారు. ఫ్రెంచ్ డిజైనర్ జోస్ లెవీ సహకారంతో బడ్స్ క్యూ ఇయర్ బడ్స్ రూపొందించబడ్డాయి. ఇవి హుడ్ కింద 10mm డ్రైవర్లను కలిగి ఉండి సిలికాన్‌ బాడీ డిజైన్ తో ఈ బడ్స్ ఉన్నాయి. ఇవి కూడా IPX 4 రేట్ తో నీరు మరియు దుమ్ము నిరోధకతలను కలిగి ఉంది.

రియల్‌మి బడ్స్ Q ఫీచర్స్

రియల్‌మి బడ్స్ Q ఫీచర్స్

రియల్‌మి బడ్స్ క్యూ ట్రూ వైర్‌లెస్ ఇయర్‌ఫోన్‌లు ఛార్జింగ్ కోసం మైక్రో-యుఎస్‌బి పోర్ట్ ను కలిగి ఉంది. అయితే బడ్స్ ఎయిర్ వంటి వైర్‌లెస్ ఛార్జింగ్ లేదు. రియల్‌మి లింక్ యాప్ , సూపర్-లౌ జాప్యం మోడ్, టచ్ నియంత్రణలు మరియు బ్లూటూత్ 5.0 కనెక్టివిటీకి ఇయర్‌బడ్‌లు మద్దతు ఇస్తాయి. వినియోగదారులు దీని యొక్క ఒక ఛార్జీ మీద సుమారు 4.5 గంటల నిరంతర ప్లేబ్యాక్ పొందవచ్చు అని కంపెనీ పేర్కొంది. దీని యొక్క కేసు యొక్క పూర్తి ఛార్జ్ తో మీకు 20 గంటల వరకు ప్లేబ్యాక్ లభిస్తుంది.

Best Mobiles in India

English summary
Realme Buds Q Open Sale Start Via Amazon and Realme.com : Price, Offers and More

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X