రియల్‌మి C11 బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ ధరలు మరొకసారి పెరిగాయి!! కొత్త ధరలు ఇవిగో

|

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ రియల్‌మి యొక్క పోర్టుపోలియో నుంచి వచ్చిన ఇటీవలి నివేదికల ప్రకారం బడ్జెట్ ధరలో లాంచ్ అయిన రియల్‌మి C11 బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ యొక్క ధరను మరొక సారి పెంచుతున్నట్లు ప్రకటించారు. స్మార్ట్‌ఫోన్ తయారీదారు ఎటువంటి ప్రకటనలు చేయకుండా తన స్మార్ట్‌ఫోన్ ధరను పెంచారు. ఈ ఫోన్ మీద ధరను పెంచడం ఇది రెండవసారి కావడం గమనార్హం. ఈ ఫోన్ యొక్క ధర రూ.500 పెరుగుదలతో కొత్త ధర వద్ద ఇప్పుడు రియల్‌మి ఆన్‌లైన్ స్టోర్, ఫ్లిప్‌కార్ట్ మరియు రిటైల్ స్టోర్‌లతో పాటు ఇతర ప్లాట్‌ఫారమ్‌లలో కనిపిస్తుంది. దీని గురించి మరిన్ని విరాలను తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

రియల్‌మి C11 పెరిగిన కొత్త ధరలు

రియల్‌మి C11 పెరిగిన కొత్త ధరలు

రియల్‌మి C11 బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ యొక్క రెండవ సారి పెరిగిన అప్ డేట్ ధరను 91మొబైల్స్ నివేదికలో మొదట గుర్తించబడింది మరియు కొంతమంది రిటైలర్లు కూడా వాస్తవాన్ని ధృవీకరించారు. Realme C11 స్మార్ట్‌ఫోన్ ధర దాని రెండు వేరియంట్‌లకు అప్‌డేట్ చేయబడింది. 2GB RAM మరియు 32GB స్టోరేజ్ వేరియంట్ ఇప్పుడు దాని పూర్వపు రిటైల్ ధర రూ.6,999కి బదులుగా రూ.7,499 ధర వద్ద లభిస్తుంది. మరోవైపు 4GB RAM మరియు 64GB ఇంటర్నల్ స్టోరేజ్ మోడల్ ఇప్పుడు దాని మునుపటి అమ్మకపు ధర రూ. 8,799 స్థానంలో రూ. 8,999గా ఉండబోతోంది.

రియల్‌మి

మార్కెట్‌లోని రెడ్‌మి, మోటరోలా, మైక్రోమ్యాక్స్, టెక్నో వంటి ఇతర బ్రాండ్‌లకు సంబంధించిన పోటీ కారణంగా రియల్‌మి C11 యొక్క తాజా ధరల పెంపు పరికరం యొక్క భవిష్యత్తుకు మంచి నిర్ణయం కాకపోవచ్చు. Realme C11 మాత్రమే ధరల పెరుగుదలకు సాక్ష్యమివ్వలేదు. ఎందుకంటే స్మార్ట్‌ఫోన్ తయారీదారు ఇటీవల Realme C25s, Realme 8, Realme 21 మరియు Realme 8 5G వంటి ఇతర పరికరాల ధరలను కూడా పెంచారు.

రియల్‌మి C11 మీడియాటెక్ హెలియో G35 SoC ప్రాసెస్‌
 

రియల్‌మి C11 మీడియాటెక్ హెలియో G35 SoC ప్రాసెస్‌

రియల్‌మి C11 స్మార్ట్‌ఫోన్ స్పెసిఫికేషన్ల విషయానికి వస్తే ఇది ప్లాస్టిక్ బిల్డ్‌ డిజైన్ ను కలిగి ఉంది. అలాగే ఫోన్ యొక్క వెనుకభాగంలో గట్టి పట్టు కోసం స్పష్టమైన ఆకృతిని కలిగి ఉంటుంది. ఇది 6.5-అంగుళాల హెచ్‌డి + IPS LCD డిస్‌ప్లేను 1600 x 720 పిక్సెల్స్ మరియు 88.7 శాతం స్క్రీన్-టు-బాడీ రేషియోతో కలిగి ఉంటుంది. ఇది మీడియాటెక్ హెలియో G35 SoC ద్వారా రన్ అవుతుంది. ఇది 12nm ప్రాసెస్‌ను కలిగి ఉండి 2.3GHz వేగంతో పనిచేస్తుంది.

రియల్‌మి C11 ఇమేజింగ్ కెమెరా సెటప్

రియల్‌మి C11 ఇమేజింగ్ కెమెరా సెటప్

రియల్‌మి C11 స్మార్ట్‌ఫోన్ యొక్క కెమెరా సెటప్ విషయానికి వస్తే ఇమేజింగ్ కోసం వెనుక భాగంలో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. ఇందులో 13 మెగాపిక్సెల్ షూటర్ మెయిన్ కెమెరా ఎఫ్ / 2.2 ఎపర్చరుతో క్రోమా బూస్ట్‌ మద్దతుతో వస్తుంది. ఇందులో గల 2 మెగాపిక్సెల్ రెండవ కెమెరా పోర్ట్రెయిట్ మద్దతుతో జత చేయబడి వస్తుంది. సెల్ఫీలు మరియు వీడియో కాలింగ్ కోసం ముందు భాగంలో ఎఫ్ / 2.4 ఎపర్చరు మరియు AI బ్యూటీ మోడ్ ఫీచర్ తో 5 మెగాపిక్సెల్ షూటర్ కెమెరాను కలిగి ఉంటుంది.

రియల్‌మి C11 5,000mAh బ్యాటరీ ఫీచర్స్

రియల్‌మి C11 5,000mAh బ్యాటరీ ఫీచర్స్

రియల్‌మి C11 స్మార్ట్‌ఫోన్ 3-కార్డ్ స్లాట్‌ మద్దతుతో వస్తుంది. ఇందులో డ్యూయల్ సిమ్ మరియు ఒక ప్రత్యేకమైన SD కార్డ్ స్లాట్‌ మద్దతును కలిగి ఉంది. ఈ SD కార్డ్ స్లాట్ ద్వారా మెమొరీని 256GB వరకు విస్తరించడానికి ఈ ఫోన్ మద్దతు ఇస్తుంది. ఇది రిచ్ గ్రీన్ మరియు రిచ్ గ్రే వంటి రెండు కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. అలాగే ఇది ఆండ్రాయిడ్ 10 ఆధారిత రియల్‌మి UIతో రన్ అవుతుంది. ఈ స్మార్ట్ఫోన్ 5,000mAh బ్యాటరీతో ప్యాక్ చేయబడి వస్తుంది. ఇది 9.1 మిమీ మందంతో 196 గ్రాముల బరువుతో వస్తుంది.

Best Mobiles in India

English summary
Realme C11 Budjet Smartphone Price Hiked Once Again in India: New Price, Specs, Sale Offers and More

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X