6,000mAh బ్యాటరీ ఫీచర్లతో బడ్జెట్ ధరలో Realme C15, C12 కొత్త ఫోన్‌లు
రియల్‌మి సంస్థ యొక్క కొత్త బడ్జెట్ స్మార్ట్‌ఫోన్‌లు రియల్‌మి C12 మరియు C15లు ఇండియాలో వచ్చే మంగళవారం ఆగస్టు 18 న మధ్యాహ్నం 12:30 గంటలకు లాంచ్ చేయనున్నారు. ఇప్పటికే ఈవెంట్ కోసం సంస్థ అధికారిక ఆహ్వానాలను పంపింది. రియల్‌మి యొక్క సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో లాంచ్ ఈవెంట్ లైవ్ ప్రసారం చేయబడుతుంది. అలాగే ట్విట్టర్, ఫేస్‌బుక్ మరియు యూట్యూబ్‌లో కూడా ప్రత్యక్ష ప్రసారం ఉంటుంది.

రియల్‌మి C12, C15 ఇండియా లాంచ్
రియల్‌మి C12 గురించి చాలా తక్కువగా తెలిసినప్పటికీ C15 ఫోన్ ను ఇటీవల ఇండోనేషియాలో లాంచ్ చేసారు. రియల్‌మి C15 యొక్క స్పెసిఫికేషన్స్ విషయానికి వస్తే ఇది 6,000mAh బ్యాటరీ, మీడియాటెక్ హెలియో G35 SoC మరియు 6.5-అంగుళాల డిస్ప్లే, క్వాడ్ రియర్ కెమెరా సెటప్ వంటి అద్భుతమైన ఫీచర్లతో బడ్జెట్ ధర విభాగంలో విడుదల కానున్నది. రియల్‌మి బ్యాండ్ స్మార్ట్‌ఫోన్‌లలో 6,000mAh బ్యాటరీతో వస్తున్న మొదటి ఫోన్ ఇదే కావడం మరొక గొప్ప విషయం.

రియల్‌మి C15 అంచనా ధరల వివరాలు
ఇండోనేషియాలో రియల్‌మి C15 ను 3GB ర్యామ్ + 64GB స్టోరేజ్ వేరియంట్ ను IDR 1,999,000 (సుమారు రూ .10,300) ధర వద్ద మరియు 4GB ర్యామ్ + 64GB స్టోరేజ్ వేరియంట్ ను IDR 2,199,000 (సుమారు రూ.11,300) ధర వద్ద చివరిగా 4GB ర్యామ్ + 128GB స్టోరేజ్ మోడల్ ను IDR 2,499,000 (సుమారు రూ.12,800) ధర వద్ద విడుదల చేశారు. ఇండియాలో కూడా ఇదే ధర వద్ద విడుదల చేసే అవకాశాలు ఉన్నాయి.

రియల్‌మి C15 స్పెసిఫికేషన్స్
రియల్‌మి C 11 ఫోన్ యొక్క అప్ డేట్ వెర్షన్ గా వస్తున్న రియల్‌మి C 15 స్మార్ట్‌ఫోన్ యొక్క స్పెసిఫికేషన్స్ విషయానికి వస్తే ఇది 6.5-అంగుళాల డిస్‌ప్లేను 420 నిట్స్ ప్రకాశంతో మరియు 88.7 శాతం స్క్రీన్ టు బాడీ రేషియోతో వస్తుంది. ఇది రియల్‌మి UI మరియు ఆండ్రాయిడ్ 10 తో రన్ అవుతుంది. ఇది ఆక్టా-కోర్ మీడియాటెక్ హెలియో G35 SoCతో రన్ అవుతూ GE8320 GPU మరియు 4GB LPDDR4X RAM + 128GB స్టోరేజ్ తో జతచేయబడి వస్తుంది.

రియల్‌మి C 15 క్వాడ్ రియర్ కెమెరా సెటప్
రియల్‌మి C 15 స్మార్ట్‌ఫోన్ యొక్క ఫోటోగ్రఫీ విషయానికొస్తే ఫోన్ యొక్క వెనుక భాగంలో క్వాడ్ రియర్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. ఇందులో ఎఫ్ / 2.2 ఎపర్చర్ సెన్సార్ లెన్స్‌తో 13 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరాను కలిగి ఉంటుంది. ఎఫ్ / 2.25 లెన్స్‌తో అల్ట్రా-వైడ్-యాంగిల్ సెన్సార్ తో 8 మెగాపిక్సెల్ సెకండరీ కెమెరా, ఎఫ్ / 2.4 లెన్స్‌తో 2 మెగాపిక్సెల్ మోనోక్రోమ్ సెన్సార్ మరియు ఎఫ్ / 2.4 లెన్స్‌తో 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ కెమెరాలు అమర్చబడి ఉన్నాయి. అలాగే ఫోన్ ముందుభాగంలో సెల్ఫీలు మరియు వీడియో కాలింగ్ కోసం ఎఫ్ / 2.0 లెన్స్‌తో 8 మెగాపిక్సెల్ సెన్సార్ కెమెరా ఉంది.

రియల్‌మి C 15 స్మార్ట్‌ఫోన్ 6,000mAh బ్యాటరీ
రియల్‌మి C 15 స్మార్ట్‌ఫోన్ 6,000mAh అతిపెద్ద బ్యాటరీతో ప్యాక్ చేయబడి వస్తుంది. అలాగే ఈ ఫోన్ 18W ఫాస్ట్ ఛార్జింగ్ మద్దతుతో వస్తుంది. ఇది కేవలం 40నిమిషాలలో మొత్తం బ్యాటరీని ఛార్జ్ చేయగలుగుతుంది. కనెక్టివిటీ విషయానికి వస్తే ఇది వై-ఫై, బ్లూటూత్ V5.0, 4G, GPS, గ్లోనాస్, 3.5mm హెడ్‌సెట్ జాక్ మరియు మైక్రో-యుఎస్‌బి పోర్ట్ మద్దతును కలిగి ఉన్నాయి.


Click it and Unblock the Notifications








