Home
News

Realme C12 Sale: 6,000mAh బ్యాటరీ ఫీచర్ బడ్జెట్ కొత్త ‌ఫోన్‌ సేల్స్ మరో రెండు రోజులలో...

చైనా యొక్క స్మార్ట్‌ఫోన్‌ తయారీ సంస్థ రియల్‌మి గత వారం ఇండియాలో విడుదల చేసిన రెండు కొత్త స్మార్ట్‌ఫోన్‌లలో రియల్‌మి C12 యొక్క బడ్జెట్ స్మార్ట్‌ఫోన్‌ను అమ్మకానికి మరొక రెండు రోజులలో ముందుకు తీసుకురానున్నది. ఆగష్టు 24న మధ్యాహ్నం 12.00PM నుండి రియల్‌మి యొక్క అధికారిక వెబ్‌సైట్‌ మరియు ఫ్లిప్‌కార్ట్‌ ద్వారా అమ్మకాలు జరగనున్నాయి. బడ్జెట్ ధరలో 6,000 mAh బ్యాటరీ మరియు మీడియాటెక్ హెలియో G35 చిప్‌సెట్ వంటి అద్భుతమైన ఫీచర్లను కలిగి ఉన్న స్మార్ట్‌ఫోన్‌ గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

రియల్‌మి C12 స్మార్ట్‌ఫోన్‌ ధరల వివరాలు

రియల్‌మి C12 స్మార్ట్‌ఫోన్‌ ధరల వివరాలు

బడ్జెట్ ధరలో కేవలం 3GBర్యామ్ + 32 GB స్టోరేజ్ ఒకే ఒక వేరియంట్ లో లభించే రియల్‌మి C12 స్మార్ట్‌ఫోన్‌ యొక్క ధర 8,999రూపాయలు. ఈ ఫోన్ యొక్క అమ్మకాలు ఇండియాలో మరొక రెండు రోజులలో అంటే ఆగష్టు 24 నుండి ఫ్లిప్‌కార్ట్ మరియు రియల్‌మి యొక్క అధికారిక వెబ్‌సైట్‌ ద్వారా మొదలుకానున్నాయి.

రియల్‌మి C12 6.5-అంగుళాల డిస్ప్లే

రియల్‌మి C12 6.5-అంగుళాల డిస్ప్లే

రియల్‌మి C12 స్మార్ట్‌ఫోన్ 6.5-అంగుళాల మినీ-డ్రాప్-ఫుల్ స్క్రీన్ డిస్ప్లేను కలిగి ఉంటుంది. అలాగే ఇది డ్యూయల్ సిమ్ కార్డ్ స్లాట్ కలిగి ఉండి హెలియో G35 చిప్‌సెట్ మరియు 4GB ర్యామ్ + 32GB స్టోరేజ్‌తో జతచేయబడి ఉంటుంది. ఇందులో గల మైక్రో SD కార్డ్ స్లాట్ ద్వారా మెమొరీని మరింత విస్తరించవచ్చు. ఇది ఆండ్రాయిడ్ 10 ఆధారిత మరియు రియల్‌మి యొక్క కస్టమ్ UI తో రన్ అవుతుంది.

రియల్‌మి C12 కెమెరా సెటప్

రియల్‌మి C12 కెమెరా సెటప్

రియల్‌మి C12 స్మార్ట్‌ఫోన్ యొక్క వెనుక భాగంలో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ను కలిగి ఉంది. ఇందులో f/2.2 ఏపర్చుర్ తో 13-మెగాపిక్సెల్ మెయిన్ కెమరామరియు 2 మెగాపిక్సెల్ బ్లాక్ అండ్ వైట్ లెన్స్ మరియు 2 మెగాపిక్సెల్ మాక్రో లెన్స్ కెమెరాలు ఉన్నాయి. దీని యొక్క రియర్ కెమెరా సెటప్ ఐఫోన్ ఆకృతిలో కలిగి ఉంటుంది.  అలాగే ఫోన్ ముందు భాగంలో వాటర్‌డ్రాప్ నాచ్ లో 5-మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాను కలిగి ఉంది.

రియల్‌మి C12 స్మార్ట్‌ఫోన్‌ గేమింగ్ ఫీచర్స్

రియల్‌మి C12 స్మార్ట్‌ఫోన్‌ గేమింగ్ ఫీచర్స్

రియల్‌మి C12 స్మార్ట్‌ఫోన్‌ 18W ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీతో 6,000mAh అతి పెద్ద బ్యాటరీతో ప్యాక్ చేయబడి ఉంటుంది. ఇది కేవలం 30నిమిషాలలో 25% వరకు ఛార్జ్ చేయగలవు. దీని యొక్క బ్యాటరీ ఫుల్ ఛార్జ్ తో 57రోజుల స్టాండ్ బై సమయం, 46గంటల కాలింగ్ సమయం, 10.2 గంటల గేమింగ్ కోసం,18.6 గంటలు ఆన్ లైన్ లో సినిమాలను చూడడానికి మరియు 1200నిముషాలు సాంగ్స్ వినడానికి వీలుగా ఉంటుంది. మీడియాటెక్ హెలియో G35 చిప్‌సెట్‌తో పనిచేసే ఈ ఫోన్ గేమింగ్ కోసం అనువుగా ఉంటుంది. అలాగే సాఫ్ట్‌వేర్ విషయానికి వస్తే ఇవి రియల్‌మి UI ఆధారిత ఆండ్రాయిడ్10 తో రన్ అవుతాయి.

More from GizBot

Best Mobiles in India

English summary
Realme C12 Smartphone First Sale Start 24th August in India via Flipkart and Realme
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X