Realme C12 First Sale: 6,000mAh బ్యాటరీ Realme C12 బడ్జెట్ ఫోన్ సేల్ నేడే మొదలు!!! త్వరపడండి..
ప్రముఖ రియల్‌మి సంస్థ గత వారం ఇండియాలో విడుదల చేసిన రెండు కొత్త స్మార్ట్‌ఫోన్‌లలో 10వేల లోపు బడ్జెట్ ధరలో లభించే రియల్‌మి C12 స్మార్ట్‌ఫోన్ యొక్క అమ్మకాలు ఈ రోజు మొదలుకానున్నాయి. ఈ రోజు మధ్యాహ్నం 12.00PM నుండి రియల్‌మి యొక్క అధికారిక వెబ్‌సైట్ మరియు ఫ్లిప్‌కార్ట్ ద్వారా ఈ ఫోన్ యొక్క అమ్మకాలు జరగనున్నాయి. బడ్జెట్ ధరలో 6,000 mAh బ్యాటరీ మరియు మీడియాటెక్ హెలియో G35 చిప్‌సెట్ వంటి అద్భుతమైన ఫీచర్లను కలిగి ఉన్న స్మార్ట్‌ఫోన్ గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

రియల్‌మి C12 స్మార్ట్‌ఫోన్ ధరల వివరాలు
రియల్‌మి సంస్థ బడ్జెట్ ధరలో గత వారం విడుదల చేసిన రియల్‌మి C12 కేవలం 3GBర్యామ్ + 32GB స్టోరేజ్ వేరియంట్ తో కేవలం రూ.8,999 ధర వద్ద లభిస్తుంది. ఈ ఫోన్ యొక్క అమ్మకాలు ఈ రోజు మధ్యాహ్నం 12PM గంటల నుండి ఫ్లిప్‌కార్ట్ మరియు రియల్‌మి యొక్క అధికారిక వెబ్‌సైట్ ద్వారా మొదలుకానున్నాయి.

రియల్‌మి C12 ఆండ్రాయిడ్ 10 సాఫ్ట్ వెర్
రియల్‌మి C12 స్మార్ట్‌ఫోన్ 6.5-అంగుళాల మినీ-డ్రాప్-ఫుల్ స్క్రీన్ డిస్ప్లేను కలిగి ఉంటుంది. అలాగే ఇది డ్యూయల్ సిమ్ కార్డ్ స్లాట్ కలిగి ఉండి హెలియో G35 చిప్‌సెట్ మరియు 4GB ర్యామ్ + 32GB స్టోరేజ్‌తో జతచేయబడి ఉంటుంది. ఇందులో గల మైక్రో SD కార్డ్ స్లాట్ ద్వారా మెమొరీని మరింత విస్తరించవచ్చు. ఇది ఆండ్రాయిడ్ 10 ఆధారిత మరియు రియల్‌మి యొక్క కస్టమ్ UI తో రన్ అవుతుంది.

రియల్‌మి C12 ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్
రియల్‌మి C12 స్మార్ట్‌ఫోన్ యొక్క వెనుక భాగంలో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ను కలిగి ఉంది. ఇందులో f/2.2 ఏపర్చుర్ తో 13-మెగాపిక్సెల్ మెయిన్ కెమరామరియు 2 మెగాపిక్సెల్ బ్లాక్ అండ్ వైట్ లెన్స్ మరియు 2 మెగాపిక్సెల్ మాక్రో లెన్స్ కెమెరాలు ఉన్నాయి. దీని యొక్క రియర్ కెమెరా సెటప్ ఐఫోన్ ఆకృతిలో కలిగి ఉంటుంది. అలాగే ఫోన్ ముందు భాగంలో వాటర్‌డ్రాప్ నాచ్ లో 5-మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాను కలిగి ఉంది.

రియల్‌మి C12 6,000mAh బ్యాటరీ
రియల్‌మి C12 బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ 18W ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీతో 6,000mAh అతి పెద్ద బ్యాటరీతో ప్యాక్ చేయబడి ఉంటుంది. ఇది కేవలం 30నిమిషాలలో 25% వరకు ఛార్జ్ చేయగలదు. దీని యొక్క బ్యాటరీ ఫుల్ ఛార్జ్ తో 57రోజుల స్టాండ్ బై సమయంను కలిగి ఉంటుంది. ఈ ఫోన్ మీడియాటెక్ హెలియో G35 చిప్‌సెట్‌తో పనిచేస్తూ గేమింగ్ కోసం అనువుగా ఉంటుంది. అలాగే సాఫ్ట్‌వేర్ విషయానికి వస్తే ఇవి రియల్‌మి UI ఆధారిత ఆండ్రాయిడ్10 తో రన్ అవుతుంది.


Click it and Unblock the Notifications








