Realme C15 బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ సేల్ నేడే!!! ఆఫర్స్ బ్రహ్మాండం....
స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ రియల్‌మి ఇండియాలో గత వారంలో రెండు కొత్త స్మార్ట్‌ఫోన్‌లను విడుదల చేసింది. ఇందులో రియల్‌మి C12 యొక్క అమ్మకాలు మొదలయ్యాయి. ఈ రోజు ఇండియాలో మొదటిసారిగా రియల్‌మి C15 యొక్క అమ్మకాలు మధ్యాహ్నం 12PM గంటల నుంచి ఫ్లిప్‌కార్ట్ మరియు రియల్‌మి.కామ్ ద్వారా ప్రారంభం కానున్నాయి. మీడియాటెక్ హెలియో G35 SOC మరియు క్వాడ్ రియర్ కెమెరా సెటప్,6,000mAh బ్యాటరీ వంటి ఫీచర్లను కలిగిన ఫోన్ గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

రియల్‌మి C15 స్మార్ట్‌ఫోన్ ధరల వివరాలు
ఇండియాలో రియల్‌మి C15 స్మార్ట్‌ఫోన్‌ను రెండు వేరు వేరు వేరియంట్ లలో విడుదల చేసారు. ఇందులో 3GBర్యామ్ + 32 GB స్టోరేజ్ మోడల్ యొక్క ధర రూ.9,999 కాగా 4GBర్యామ్ + 64GB స్టోరేజ్ మోడల్ యొక్క ధర రూ.10,999. ఈ ఫోన్ యొక్క అమ్మకాలు నేటి నుంచి ఫ్లిప్‌కార్ట్ మరియు రియల్‌మి యొక్క అధికారిక వెబ్‌సైట్ ద్వారా విక్రయించనున్నాయి. అలాగే సెప్టెంబర్ 3 నుండి ఆఫ్‌లైన్ రిటైలర్ల ద్వారా కూడా విక్రయించబడుతోంది.

రియల్‌మి C15 స్మార్ట్‌ఫోన్ సేల్ ఆఫర్స్
రియల్‌మి C15 స్మార్ట్‌ఫోన్ యొక్క సేల్ ఆఫర్స్ విషయానికి వస్తే రియల్‌మి.కామ్‌లో మొబిక్విక్ ద్వారా కొన్న వారికి రూ.500 వరకు క్యాష్‌బ్యాక్ మరియు రూ.7000 విలువ గల జియో వోచర్లను పొందవచ్చు. అలాగే ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డుపై 5 శాతం అన్‌లిమిటెడ్ క్యాష్‌బ్యాక్, యాక్సిస్ బ్యాంక్ బజ్ క్రెడిట్ కార్డుతో 5 శాతం తగ్గింపు కూడా లభిస్తుంది. అలాగే నో-కాస్ట్ ఇఎంఐ ఆప్షన్ ద్వారా నెలకు రూ.1,223 చెల్లించి కొనుగోలు చేయవచ్చు.

రియల్‌మి C15 స్పెసిఫికేషన్స్
రియల్‌మి C15 స్మార్ట్‌ఫోన్ 6.5-అంగుళాల మినీ-డ్రాప్-ఫుల్ స్క్రీన్ డిస్ప్లేను కలిగి ఉంది. డ్యూయల్ సిమ్ కార్డ్ స్లాట్ మరియు హెలియో G35 చిప్‌సెట్ ను కలిగి ఉండి 3GB/4GB ర్యామ్ మరియు 128GB స్టోరేజ్‌తో జతచేయబడి ఉంటుంది. ఇందులో గల మైక్రో SD కార్డ్ స్లాట్ ద్వారా మెమొరీని మరింత విస్తరించవచ్చు. అలాగే ఇవి ఆండ్రాయిడ్ 10 ఆధారిత మరియు రియల్‌మి యొక్క కస్టమ్ UI తో రన్ అవుతుంది. అలాగే ఫోన్ వెనుక భాగంలో ఫింగర్ ప్రింట్ స్కానర్ అమర్చబడి ఉంటుంది.

రియల్‌మి C15 కెమెరా సెటప్
రియల్‌మి C15 స్మార్ట్‌ఫోన్ యొక్క వెనుక భాగంలో క్వాడ్ రియర్ కెమెరా సెటప్ ను కలిగి ఉంది. ఇందులో f/2.2 ఏపర్చుర్ తో 13-మెగాపిక్సెల్ మెయిన్ కెమరా, f/2.4 ఏపర్చుర్ తో 8-మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్ కెమెరా మరియు f/2.2 ఏపర్చుర్ తో రెండు 2-మెగాపిక్సెల్ బ్లాక్ అండ్ వైట్ లెన్స్ మైక్రో-డెప్త్ మరియు మోనో కెమెరాలను కలిగి ఉన్నాయి. దీని యొక్క రియర్ కెమెరా సెటప్ ఐఫోన్ ఆకృతిలో కలిగి ఉంటుంది. అలాగే ఫోన్ ముందు భాగంలో 8-మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాను కలిగి ఉంది.

రియల్‌మి C15 స్మార్ట్‌ఫోన్ సాఫ్ట్‌వేర్, 6,000mAh బ్యాటరీ
రియల్‌మే C15 స్మార్ట్‌ఫోన్ 18W ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీతో 6,000mAh అతి పెద్ద బ్యాటరీతో ప్యాక్ చేయబడి ఉన్నాయి. ఇది కేవలం 30నిమిషాలలో 25% వరకు ఛార్జ్ చేయగలవు. అలాగే దీని యొక్క ఫుల్ బ్యాటరీ ఛార్జ్ తో 57రోజుల స్టాండ్ బై సమయం వరకు పనిచేస్తుంది. మీడియాటెక్ హెలియో G35 చిప్‌సెట్‌తో పనిచేసే ఈ ఫోన్ గేమింగ్ కోసం అనువుగా ఉంటుంది. అలాగే సాఫ్ట్‌వేర్ విషయానికి వస్తే ఇవి రియల్‌మి UI ఆధారిత ఆండ్రాయిడ్10 తో రన్ అవుతుంది. కనెక్టివిటీ ఎంపికలలో 4G VoLTE, Wi-Fi, బ్లూటూత్ v5.0, GPS / A-GPS మరియు మైక్రో- USB పోర్ట్ ఉన్నాయి.


Click it and Unblock the Notifications








