Realme, Xiaomi కొత్త స్మార్ట్‌ఫోన్‌ల లాంచ్ డేట్, ధరలు, ఫీచర్స్ మీద ఓ లుక్ వేయండి

|

చైనా స్మార్ట్‌ఫోన్‌ తయారీ సంస్థలు రియల్‌మి మరియు షియోమి రెండు కూడా ఎప్పటికప్పుడు ఇండియాలో కొత్త ఫోన్లను విడుదల చేస్తున్నాయి. ఇప్పుడు కూడా ఈ సంస్థలు ఈ నెలలో తమ కొత్త ఫోన్లను విడుదల చేయనున్నాయి. షియోమి సంస్థ ఏప్రిల్ 23 న Mi 11 అల్ట్రా స్మార్ట్‌ఫోన్‌ను భారత్‌లో ప్రవేశపెట్టనున్నట్లు షియోమి ఇండియా MD మను కుమార్ జైన్ ట్విట్టర్ పోస్ట్‌లో ప్రకటించారు. అలాగే రియల్‌మి సంస్థ కూడా C-సిరీస్ ఎంట్రీ లెవల్ మూడు స్మార్ట్‌ఫోన్‌లను భారత మార్కెట్లో విడుదల చేసి తన యొక్క సామర్ధ్యాన్ని విస్తరించాలని నిర్ణయించింది. కంపెనీ ఇప్పటికే లాంచ్ గురించి టీసింగ్ కూడా ప్రారంభించింది. దీని గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

రియల్‌మి C-సిరీస్ ఇండియా లాంచ్ వివరాలు

రియల్‌మి C-సిరీస్ ఇండియా లాంచ్ వివరాలు

రియల్‌మి C-సిరీస్ స్మార్ట్‌ఫోన్‌లు రియల్‌మి C20, రియల్‌మి C21 మరియు రియల్‌మి C25 లను సంస్థ ఏప్రిల్ 8 న 2021 న లాంచ్ చేయనున్నట్లు కంపెనీ తన అధికారిక ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా ధృవీకరించింది. రియల్‌మి కంపెనీ లాంచ్ ఈవెంట్ కార్యక్రమంను 12:30 PM IST నుంచి ప్రారంభించనుంది. రియల్‌మి ఇండియా యూట్యూబ్ ఛానెల్‌తో సహా అన్ని అధికారిక ఛానెల్‌లలో ప్రత్యక్ష ప్రసారం చేయనున్నది. వీటిని ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్ ద్వారా ప్రత్యేకంగా అమ్మకానికి ఉంటుందని గమనించండి. ఈ మూడు స్మార్ట్‌ఫోన్‌లు ఇప్పటికే ఇతర మార్కెట్లలో ప్రారంభించబడ్డాయి.

రియల్‌మి C-సిరీస్ ఫోన్‌ల ధరల వివరాలు

రియల్‌మి C-సిరీస్ ఫోన్‌ల ధరల వివరాలు

రియల్‌మి C-సిరీస్ కొత్త ఫోన్‌లు ఇప్పటికే ఇతర మార్కెట్లలో ప్రారంభించబడ్డాయి. ఇందులో రియల్‌మి C20 ధర సుమారు రూ.7,499 వద్ద ఉండవచ్చు. అలాగే రియల్‌మి C21, C25 ధరలు వరుసగా రూ.8,499, రూ.9,999 ధరల కింద విడుదల చేయవచ్చని మేము భావిస్తున్నాము. కంపెనీ ఇంకా భారతీయ ధరను వెల్లడించలేదు. ఇండియా యొక్క ధరను తెలుసుకోవడానికి ఏప్రిల్ 8 వరకు వేచి ఉండాలి.

రియల్‌మి C-సిరీస్ స్పెసిఫికేషన్స్
 

రియల్‌మి C-సిరీస్ స్పెసిఫికేషన్స్

రియల్‌మి కొత్త C-సిరీస్ స్మార్ట్‌ఫోన్‌లు అన్ని కూడా 6.5-అంగుళాల HD+ LCD డిస్‌ప్లేతో పాటు వాటర్‌డ్రాప్ నాచ్ మరియు 20: 9 కారక నిష్పత్తితో సమానమైన డిస్ప్లే కాన్ఫిగరేషన్‌ను కలిగి ఉంటాయి. హార్డ్వేర్ విషయంలో రియల్‌మి C20 మరియు రియల్‌మి C21 మీడియాటెక్ హెలియో G35 SoC తో వస్తుండగా రియల్‌మి C25 మీడియాటెక్ హెలియో G70 చిప్‌సెట్ ద్వారా శక్తిని పొందుతాయి. కెమెరాల విషయానికొస్తే రియల్‌మి C20 ఎల్‌ఈడీ ఫ్లాష్‌తో సింగిల్ 8MP సెటప్‌ను అందిస్తుంది. రియల్‌మి C21 13MP కెమెరా సెన్సార్ + 2MP B&W లెన్స్ + 2MP మాక్రో లెన్స్‌ల కలయికతో ట్రిపుల్ రియర్ కెమెరా మాడ్యూల్ ను కలిగి ఉంది. అలాగే రియల్‌మి C25 48MP ప్రాధమిక కెమెరాతో పాటు 2MP మాక్రో మరియు 2MP డెప్త్ సెన్సార్‌లతో ట్రిపుల్ కెమెరాలను కలిగి ఉంటుంది.

Mi 11 అల్ట్రా స్పెసిఫికేషన్స్

Mi 11 అల్ట్రా స్పెసిఫికేషన్స్

షియోమి ఇటీవల చైనాలో Mi 11 సిరీస్ కింద నాలుగు ఫోన్‌లను విడుదల చేసింది. స్నాప్‌డ్రాగన్ ప్రాసెసర్‌తో Mi 11 అల్ట్రా, Mi 11i, Mi 11 లైట్, Mi 11 లైట్ 5Gలను కంపెనీ ఆవిష్కరించింది. ఫోన్ యొక్క ఇండియన్ వేరియంట్లో చైనా మోడల్ మాదిరిగానే ఫీచర్లు ఉండే అవకాశం ఉంది. చైనీస్ వేరియంట్ మాదిరిగానే Mi 11 అల్ట్రాలో వెనుకభాగంలో 50MP మెయిన్ కెమెరా మరియు 48MP సెన్సార్లతో కెమెరాలను జతచేయబడిందని జైన్ తన ట్వీట్‌లో రాశారు. షియోమి Mi 11 అల్ట్రా 6.81-అంగుళాల WQHD + డిస్‌ప్లేతో 120HZ రిఫ్రెష్ రేట్ మరియు 480HZ టచ్ శాంప్లింగ్ రేటుతో వస్తుంది. ఈ హ్యాండ్‌సెట్ క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 888 SoC ద్వారా వస్తుంది. ఇది 12GB RAM మరియు 256GB UFS 3.1 స్టోరేజ్ తో జత చేయబడి వస్తుంది. అలాగే ఇది 67W ఫాస్ట్ ఛార్జింగ్ తో పాటు వైర్‌లెస్ ఛార్జింగ్ సపోర్ట్‌తో కూడిన 5,000 ఎంఏహెచ్ బ్యాటరీతో ప్యాక్ చేయబడి వస్తుంది. ఈ ఫోన్ యొక్క మరొక ముఖ్య హైలైట్ కెమెరా సెటప్‌తో వెనుక వైపు 1.1-అంగుళాల అమోలెడ్ స్క్రీన్ కలిగి ఉండడం. ఇది సెల్ఫీలను క్లిక్ చేయడానికి ముందు మిమ్మల్ని చూడటానికి చిన్న అద్దంగా ఉపయోగపడటమే కాకుండా నోటిఫికేషన్‌లను కూడా చూపుతుంది.

Best Mobiles in India

English summary
Realme C20-series, Mi 11 Ultra Smartphones India Launch Date Announced: India Price, Specs, Features and More

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X