రంజాన్ రోజున కొత్త బడ్జెట్ స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేయనున్న రియల్‌మి బ్రాండ్

|

రియల్‌మి సంస్థ ఇండియాలో ఇటీవల C-సిరీస్ స్మార్ట్‌ఫోన్‌లైన రియల్‌మి C20, రియల్‌మి C21, రియల్‌మి C25 లను విడుదల చేసింది. అయితే ఇప్పుడు 2021 ఈద్ పండుగ రంజాన్ సందర్భంగా మరో బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ రియల్‌మి C20A ను విడుదల చేయాలని కంపెనీ యోచిస్తోంది. ఇది రియల్‌మి C20 యొక్క ట్వీక్డ్ వెర్షన్‌గా భావిస్తున్నారు. లాంచ్ తేదీని ప్రకటించడమే కాకుండా రాబోయే స్మార్ట్‌ఫోన్ యొక్క కొన్ని ప్రత్యేకతలకు సంబందించిన ఒక టీజర్ ను బంగ్లాదేశ్ ఫేస్‌బుక్ పేజీలో విడుదల చేసింది. ఈ కంపెనీ నుంచి రాబోయే కొత్త రియల్‌మి C20Aను భారత్‌తో సహా ఇతర దేశాలలో కూడా విడుదల చేస్తుందో లేదో అన్న విషయం ప్రస్తుతానికి తెలియదు.

రియల్‌మి బ్రాండ్

రియల్‌మి బ్రాండ్ నుంచి రాబోయే రియల్‌మి C20A కు సంబందించిన టీజర్ ను సంస్థ యొక్క బంగ్లాదేశ్ ఫేస్‌బుక్ పేజీలో ఒక చిన్న వీడియోను పోస్ట్ చేసింది. ఈ వీడియోలోని సమాచారం ప్రకారం ఫోన్‌ యొక్క డిజైన్, దాని కలర్లు, డిస్ప్లే పరిమాణం, SoC మరియు బ్యాటరీ సామర్థ్యాన్ని చూపిస్తుంది. ఈ ఫోన్ యొక్క డిస్ప్లేలో సెల్ఫీ కెమెరాను నాచ్ రూపంలో కలిగి ఉంది. అలాగే వెనుక భాగంలో చదరపు మాడ్యూల్‌లో ఉంచిన సింగిల్ రియర్ కెమెరా కనిపిస్తుంది. ఈ ఫోన్ 6.5-అంగుళాల డిస్‌ప్లేను కలిగి ఉంది. అలాగే ఇది మీడియాటెక్ హెలియో G35 SoC చేత శక్తినిపొందుతుంది. ఫోన్ యొక్క నాలుగు వైపులా మందపాటి నొక్కులను కలిగి ఉన్నాయి. ఈ రియల్‌మి C20A ఫోన్ 5,000mAh బ్యాటరీ మద్దతుతో ప్యాక్ చేయబడి గ్రే మరియు బ్లూ కలర్లలో అందించబడుతుంది.

రియల్‌మి C20A

రియల్‌మి C20A కొత్త స్మార్ట్‌ఫోన్‌కు సంబందించిన ఇతర వార్తల విషయానికి వస్తే దీనిని ఇటీవల గీక్‌బెంచ్‌లో మోడల్ నంబర్ RMX3231 తో గుర్తించబడింది. ఈ పరికరం గూగుల్ యొక్క ఆండ్రాయిడ్ 11 ఆపరేటింగ్ సిస్టమ్‌తో రన్ చేస్తు 2GB ర్యామ్‌తో జతచేయబడి వస్తుందని లిస్టింగ్ సూచిస్తుంది. అసలైన రియల్‌మి C11 భారతదేశంలో 2GB ర్యామ్‌, 32GB ఇంటర్నల్ స్టోరేజ్‌తో లాంచ్ అయింది.

మోడల్ నంబర్ RMX3231
 

రియల్‌మి C20A కొత్త స్మార్ట్‌ఫోన్‌ యొక్క అదే మోడల్ నంబర్ RMX3231 ఇటీవల భారతదేశం యొక్క బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (BIS) తో సహా పలు ధృవీకరణ వెబ్‌సైట్లలో కూడా గుర్తించబడింది. ఈ ఫోన్ రంజాన్ పండుగ సందర్భంగా ఇతర దేశాలతో పాటు భారతదేశంలో కూడా ప్రారంభించబడుతుందని కొన్ని వెబ్‌సైట్లు సూచిస్తున్నప్పటికి దీనికి సంబందించిన సరైన వివరాలు ఇంకా తెలియాలసి ఉంది. ఈ డివైస్ వై-ఫై 802.11 b/g/n, ఆండ్రాయిడ్ 11 ఫీచర్లను కలిగి ఉండి 190 గ్రాముల బరువు ఉంటుందని ఈ జాబితాలు వెల్లడించాయి.

Best Mobiles in India

English summary
Realme C20A New Budget Smartphone Launch Date Confirm This Eid 2021

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X