Home
News

రియల్‌మి C21Y స్మార్ట్‌ఫోన్ లాంచ్ అయింది!! ధరలు, స్పెసిఫికేషన్స్ ఇవే

రియల్‌మి సంస్థ నేడు ఇండియాలో తన కొత్త స్మార్ట్ ఫోన్ రియల్‌మి C21Y ను లాంచ్ చేసింది. ఈ కొత్త రియల్‌మి ఫోన్ 20: 9 డిస్‌ప్లేతో మరియు ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌తో లభిస్తు 5,000mAh బ్యాటరీతో ప్యాక్ చేయబడి ఉండి రివర్స్ ఛార్జింగ్‌కు మరియు సూపర్ పవర్ సేవింగ్ మోడ్‌కు మద్దతును కలిగి ఉంటుంది. ఇది కేవలం ఐదు శాతం బ్యాటరీతో 2.33 రోజుల స్టాండ్‌బై సమయాన్ని అందిస్తుంది. అలాగే ప్రత్యేకమైన కెమెరా ఫలితాలను అందించడానికి సూపర్ నైట్‌స్కేప్ మరియు క్రోమ్ బూస్ట్‌, స్లో-మోషన్ మరియు ఫుల్-హెచ్‌డి (1080p) వీడియో రికార్డింగ్ వంటి ప్రీలోడ్ ఫీచర్లు ఉన్నాయి. మొత్తంమీద రియల్‌మి C21Y ఫోన్ రెడ్ మి 9, Infinix Hot 10S మరియు Nokia G20 వంటి వాటికి పోటీగా విడుదలైంది. దీని గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

రియల్‌మి C21Y స్మార్ట్‌ఫోన్ ధరల వివరాలు

రియల్‌మి C21Y స్మార్ట్‌ఫోన్ ధరల వివరాలు

భారతదేశంలో రియల్‌మి C21Y స్మార్ట్‌ఫోన్ రెండు వేరియంట్లలో లాంచ్ అయింది. ఇందులో 3GB ర్యామ్ + 32GB స్టోరేజ్ వేరియంట్‌ యొక్క ధర రూ.8,999 కాగా 4GB ర్యామ్ + 64GB స్టోరేజ్ ఆప్షన్ యొక్క ధర రూ.9,999. ఈ ఫోన్ క్రాస్ బ్లాక్ మరియు క్రాస్ బ్లూ కలర్లలో వస్తుంది. ఇది Flipkart, Realme.com సైట్ ద్వారా కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంటుంది మరియు ఆఫ్‌లైన్ రిటైలర్‌లలో కూడా కొనుగోలు చేయవచ్చు.

రియల్‌మి C21Y స్మార్ట్‌ఫోన్ స్పెసిఫికేషన్స్

రియల్‌మి C21Y స్మార్ట్‌ఫోన్ స్పెసిఫికేషన్స్

రియల్‌మి C21Y స్మార్ట్‌ఫోన్ స్పెసిఫికేషన్స్ విషయానికి వస్తే ఇది డ్యూయల్ సిమ్ (నానో) స్లాట్ కలిగి ఉండి రియల్‌మి UI మరియు ఆండ్రాయిడ్ 11 ఆధారంగా రన్ అవుతుంది. ఇది 6.5-అంగుళాల హెచ్‌డి+ డిస్‌ప్లేను 720x1,600 పిక్సెల్స్ మరియు 20: 9 యాస్పెక్ట్ రేషియోతో కలిగి ఉంది. అలాగే ఇది హుడ్ కింద మాలి- G52 GPU మరియు 4GB RAM వరకు ఆక్టా-కోర్ Unisoc T610 SoC చేత జతచేయబడి ఉంటుంది. ఆప్టిక్స్ విషయానికి వస్తే ఈ ఫోన్ వెనుక భాగంలో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌తో వస్తుంది. ఇందులో 13 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్, 2 మెగాపిక్సెల్ మోనోక్రోమ్ సెన్సార్ మరియు 2 మెగాపిక్సెల్ మాక్రో షూటర్ కెమెరాలు ఉన్నాయి. సెల్ఫీలు మరియు వీడియో చాట్‌ల కోసం ఫోన్ ముందు భాగంలో f/2.4 లెన్స్‌తో 5-మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాను కలిగి ఉంది.

రియల్‌మి C21Y

రియల్‌మి C21Y స్మార్ట్‌ఫోన్ యొక్క స్టోరేజ్ మరియు కనెక్టివిటీ ఎంపికల విషయానికి వస్తే ఈ కొత్త ఫోన్ 64GB వరకు ఇంటర్నల్ స్టోరేజీతో ప్యాక్ చేయబడి వస్తుంది. ఇందులో గల మైక్రో SD కార్డ్ ప్రత్యేక స్లాట్ ద్వారా మెమొరీని 256GB వరకు విస్తరించడానికి మద్దతును ఇస్తుంది. కనెక్టివిటీ ఎంపికలలో 4G LTE, Wi-Fi 802.11 b/g/n, బ్లూటూత్ v5.0, GPS/A-GPS, మైక్రో- USB మరియు 3.5mm హెడ్‌ఫోన్ జాక్ ఉన్నాయి. బోర్డులోని సెన్సార్లలో యాక్సిలెరోమీటర్, యాంబియంట్ లైట్ సెన్సార్, మాగ్నెటోమీటర్ మరియు సామీప్య సెన్సార్ ఉన్నాయి. అలాగే వెనుకవైపు ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా ఉంది. అలాగే ఇది రివర్స్ వైర్డ్ ఛార్జింగ్‌కు మద్దతుతో 5,000mAh బ్యాటరీతో ప్యాక్ చేయబడి వస్తుంది. ఇది 164.5x76x9.1mm కొలతలతో 200 గ్రాముల బరువును కలిగి ఉంటుంది.

More from GizBot

Best Mobiles in India

English summary
Realme C21Y Smartphone Released in India: Price, Specs, Sale Date, Sale Offers, features and More
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X