6,000mAh బ్యాటరీ ఫీచర్లతో రియల్‌మి C25s కొత్త ఫోన్ లాంచ్!! ధర కూడా తక్కువే...

|

రియల్‌మి సంస్థ ఇండియాలో తన యొక్క స్మార్ట్‌ఫోన్‌లను విడుదల చేస్తూ వినియోగదారుల యొక్క మన్ననను పొందుతోంది. దీని కొనసాగింపుగా ఇప్పుడు రియల్‌మి C25s స్మార్ట్‌ఫోన్‌ను నేడు భారతీయ మార్కెట్లో లాంచ్ చేశారు. మీడియాటెక్ హెలియో G85 Soc చేత శక్తిని పొందుతూ 6,000mAh బ్యాటరీతో ప్యాక్ చేయబడి ఉండి ఫోన్‌ వెనుక భాగంలో 13 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరాతో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ను కలిగి ఉండి ఏప్రిల్‌లో భారతదేశంలో లాంచ్ అయిన రియల్‌మి C25 యొక్క అప్‌గ్రేడ్ మోడల్ గా లభించే ఈ మోడల్ గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

రియల్‌మి C25s స్మార్ట్‌ఫోన్ ఇండియాలో రెండు వేరియంట్‌లలో విడుదలైంది. ఇందులో 4GB ర్యామ్ + 64GB స్టోరేజ్ మోడల్‌ యొక్క ధర రూ.9,999 కాగా 4GB ర్యామ్ + 128GB స్టోరేజ్ వేరియంట్‌ యొక్క ధర 10,999 రూపాయలు. ఈ ఫోన్ వాటర్ కలర్ మరియు వాటర్ బ్లూ అనే రెండు కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. ఈ ఫోన్ యొక్క మొదటి అమ్మకాలు జూన్ 9 నుండి రియల్‌మి వెబ్‌సైట్, ఫ్లిప్‌కార్ట్ మరియు ఇతర ప్రధాన ఛానెల్‌ల ద్వారా భారతదేశంలో మొదలుకానున్నాయి.

 

JioFiber Broadband: యూజర్లను అద్భుతమైన ఆఫర్లతో ఆకట్టుకుంటున్న జియోఫైబర్JioFiber Broadband: యూజర్లను అద్భుతమైన ఆఫర్లతో ఆకట్టుకుంటున్న జియోఫైబర్

రియల్‌మి C25s స్మార్ట్‌ఫోన్ స్పెసిఫికేషన్స్

రియల్‌మి C25s స్మార్ట్‌ఫోన్ స్పెసిఫికేషన్స్

రియల్‌మి C25s స్మార్ట్‌ఫోన్ యొక్క స్పెసిఫికేషన్స్ విషయానికి వస్తే ఇది ఆండ్రాయిడ్ 11 ఆధారిత రియల్‌మి UI2.0 లో రన్ అవుతుంది. ఇది 6.5-అంగుళాల HD + LCD మల్టీ-టచ్ డిస్‌ప్లేను 720x1,600 పిక్సెల్స్, 88.7 శాతం స్క్రీన్-టు-బాడీ రేషియో, TUV రీన్‌ల్యాండ్ సర్టిఫికేషన్ మరియు 570 నిట్స్ మాక్స్ బ్రైట్‌నెస్ ఫీచర్లతో కలిగి ఉంది. ఇది మీడియాటెక్ హెలియో G85 Soc చేత రన్ అవుతూ 4GB ర్యామ్‌, 128GB ఇంటర్నల్ స్టోరేజ్ తో జత చేయబడి వస్తుంది. అలాగే ఇందులో గల ప్రత్యేకమైన మైక్రో SD కార్డ్ స్లాట్ ద్వారా మెమొరీని 256GB వరకు మరింత విస్తరించడానికి అనుమతిని కలిగి ఉంటుంది.

 

 

WWDC 2021 మొదటి రోజు హైలైట్ ఇవే ..! లాంచ్ అయిన కొత్త OS లను చూడండి.WWDC 2021 మొదటి రోజు హైలైట్ ఇవే ..! లాంచ్ అయిన కొత్త OS లను చూడండి.

రియల్‌మి C25s

రియల్‌మి C25s స్మార్ట్‌ఫోన్ యొక్క ఆప్టిక్స్ విషయానికి వస్తే ఫోన్ వెనుక భాగంలో ట్రిపుల్ కెమెరా సెటప్ ను కలిగి ఉంది. ఇందులో 13 మెగాపిక్సెల్ మెయిన్ సెన్సార్, 2 మెగాపిక్సెల్ బ్లాక్ అండ్ వైట్ సెన్సార్ మరియు 2 మెగాపిక్సెల్ మాక్రో లెన్స్‌ కెమెరాలను కలిగి ఉన్నాయి. దీని బ్యాక్ కెమెరాలలో సూపర్ నైట్‌స్కేప్, అల్ట్రా మాక్రో మోడ్ వంటి మరిన్ని ఫీచర్స్ అందుబాటులో ఉన్నాయి. సెల్ఫీలు మరియు వీడియో కాల్ కోసం ముందు భాగంలో 8 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాను కలిగి ఉంది.

కనెక్టివిటీ

రియల్‌మి C25s స్మార్ట్‌ఫోన్ యొక్క కనెక్టివిటీ ఎంపికలలో మైక్రో USB పోర్ట్, 3.5mm ఆడియో జాక్, వై-ఫై 802.11 బి / జి / ఎన్, బ్లూటూత్ వి 5 వంటివి మరిన్ని ఉన్నాయి. దీనితో పాటుగా ఇది 18W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 6,000mAh అతిపెద్ద బ్యాటరీతో ప్యాక్ చేయబడి వస్తుంది. ఇది కేవలం 5 శాతం ఛార్జీతో 5.65 గంటల స్పాటిఫై, 70.36 గంటల స్టాండ్‌బై సమయం, 2.52 గంటల కాలింగ్ లేదా 1.92 గంటల వాట్సాప్ చాటింగ్ వంటివి చేయడానికి అనుమతిస్తుందని కంపెనీ పేర్కొంది. ఫోన్ వెనుక భాగంలో ఫింగర్ ప్రింట్ సెన్సార్ కలిగి ఉంది. బోర్డులోని సెన్సార్లలో మాగ్నెటిక్ ఇండక్షన్ సెన్సార్, లైట్ సెన్సార్, సామీప్య సెన్సార్ మరియు యాక్సిలెరోమీటర్ ఉన్నాయి.

Best Mobiles in India

English summary
Realme C25s Smartphone Released in India With 6,000mAh Battery Features: Price, Specs, Sale Date and More

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X