రియల్‌మి C25Y ప్రీ-బుకింగ్ మొదలయ్యాయి!! ఆఫర్స్ మెరుగ్గా ఉన్నాయి

|

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ రియల్‌మి ఇండియాలో సెప్టెంబర్ 16 న Realme C25Y ను విడుదల చేసిన సంగతి అందరికి తెలిసిన విషయమే. అయితే ఈ స్మార్ట్‌ఫోన్ ఈరోజు నుండి అధికారిక వెబ్‌సైట్‌లో ప్రీ-ఆర్డర్ చేయడానికి అందుబాటులో ఉంది. అలాగే దీని యొక్క డెలివరీలు సెప్టెంబర్ 27 నుండి ప్రారంభమవుతాయి. C-సిరీస్ లైనప్‌లో 50 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్‌తో వచ్చిన మొదటి రియల్‌మి స్మార్ట్‌ఫోన్ కావడం విశేషం. ఈ Realme C25Y స్మార్ట్‌ఫోన్ 4GB RAM మరియు 128GB వరకు ఆన్‌బోర్డ్ స్టోరేజ్‌లభిస్తూ ఆక్టా-కోర్ Unisoc T610 SoC తో జతచేయబడివస్తుంది. ఈ నెల ప్రారంభంలో షియోమి సంస్థ ప్రారంభించిన రెడ్‌మి 10 ప్రైమ్‌కు పోటీగా లభించే ఈ స్మార్ట్‌ఫోన్ గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

 

రియల్‌మి C25Y ధరల వివరాలు

రియల్‌మి C25Y ధరల వివరాలు

Realme C25Y స్మార్ట్‌ఫోన్ ఇండియాలో రెండు వేరియంట్లలో లాంచ్ అయింది. ఇందులో 4GB RAM + 64GB స్టోరేజ్ వేరియంట్ యొక్క ధర రూ.10,999 కాగా 4GB RAM + 128GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ.11,999. అయితే ఇందులో 4GB RAM + 128GB స్టోరేజ్ వేరియంట్ మాత్రమే Realme.com లో ముందుగా బుక్ చేసుకోవడానికి అందుబాటులో ఉంది. 128GB స్టోరేజ్ వేరియంట్ మాత్రమే ఫ్లిప్‌కార్ట్‌లో 'త్వరలో వస్తోంది' ట్యాగ్‌తో జాబితా చేయబడింది. ఫ్లిప్‌కార్ట్‌లో రియల్‌మి స్మార్ట్‌ఫోన్‌ను ముందుగా బుక్ చేసుకునే అవకాశం లేదని తెలుస్తోంది.

Jio యూజర్లకు శుభవార్త!! ఈ ప్లాన్‌లతో అదనంగా బోనస్ డేటాను పొందవచ్చుJio యూజర్లకు శుభవార్త!! ఈ ప్లాన్‌లతో అదనంగా బోనస్ డేటాను పొందవచ్చు

రియల్‌మి C25Y ప్రీ-బుకింగ్ ఆఫర్స్
 

రియల్‌మి C25Y ప్రీ-బుకింగ్ ఆఫర్స్

Realme యొక్క వెబ్‌సైట్ ద్వారా కస్టమర్‌లు Realme C25Y స్మార్ట్‌ఫోన్‌ని ముందే బుక్ చేసుకుంటే కనుక వారికి రూ.500 వరకు తగ్గింపు లభిస్తుంది. అంతేకాకుండా వినియోగదారులు MobiKwik ద్వారా ముందుగా బుక్ చేసుకుంటే వారికి అదనంగా రూ.350 తగ్గింపు కూడా లభిస్తుంది. ఈ ప్రీ-బుకింగ్ ఆఫర్ సెప్టెంబర్ 26 వరకు అందుబాటులో ఉంటుంది. ఈ రియల్‌మి C25Y స్మార్ట్‌ఫోన్ గ్లేసియర్ బ్లూ మరియు మెటల్ గ్రే కలర్ ఆప్షన్‌లలో అందించబడుతుంది.

రియల్‌మి C25Y స్పెసిఫికేషన్స్

రియల్‌మి C25Y స్పెసిఫికేషన్స్

రియల్‌మి C25Y యొక్క స్పెసిఫికేషన్స్ విషయానికి వస్తే ఇది డ్యూయల్ సిమ్ (నానో) స్లాట్ కలిగి ఉండి ఆండ్రాయిడ్ 11-ఆధారిత రియల్‌మి ఆర్ ఎడిషన్ స్కిన్ పైన రన్ అవుతుంది. ఇది 6.5-అంగుళాల HD+ డిస్‌ప్లేను 720x1,600 పిక్సెల్స్, 20: 9 కారక నిష్పత్తితో మరియు 420 నిట్స్ గరిష్ట ప్రకాశంతో కలిగి ఉంది. హుడ్ కింద ఇది 4GB LPDDR4x ర్యామ్‌తో Unisoc T610 SoC ని పొందుతుంది. ఇది అంకితమైన మైక్రో SD కార్డ్ స్లాట్ ద్వారా 256GB వరకు విస్తరించగల 128GB ఇంటర్నల్ స్టోరేజ్ పొందుతుంది.

iPhone 13 ప్రీ-బుకింగ్ పై ఊహించని Vi క్యాష్‌బ్యాక్ ఆఫర్!! మిస్ అవ్వకండిiPhone 13 ప్రీ-బుకింగ్ పై ఊహించని Vi క్యాష్‌బ్యాక్ ఆఫర్!! మిస్ అవ్వకండి

ఆప్టిక్స్

Realme C25Y యొక్క ఆప్టిక్స్ విషయానికి వస్తే వెనుక భాగంలో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. 50 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్ మరియు రెండు 2 మెగాపిక్సెల్ మోనోక్రోమ్ మరియు మాక్రో సెన్సార్‌లను కలిగి ఉంది. సెల్ఫీలు మరియు వీడియో కాల్‌ల కోసం 8 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాను కలిగి ఉంది. ముందు మరియు వెనుక కెమెరాలు రెండూ AI బ్యూటీ మోడ్‌ను పొందుతాయి. రియల్‌మి 18W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 5,000mAh బ్యాటరీని ప్యాక్ చేసింది.

Most Read Articles
Best Mobiles in India

English summary
Realme C25Y Pre-Bookings Starts on Realme.com: Price, Specs, Booking Offers and More

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X