Home
News

రియల్‌మి C30 బడ్జెట్ ఫోన్ మొదటి సేల్స్ ప్రారంభం కానున్నాయి!! ధరలు, డిస్కౌంట్ ఆఫర్స్

చైనా స్మార్ట్‌ఫోన్‌ తయారీ కంపెనీ రియల్‌మి భారతదేశంలో గతవారం రియల్‌మి C30 బడ్జెట్ స్మార్ట్‌ఫోన్‌ను రెడ్మి 9A, ఇన్ఫినిక్స్ స్మార్ట్ 5, రియల్‌మి C11 2021, పోకో C3, టెక్నో స్పార్క్ 7 వంటి బడ్జెట్ స్మార్ట్‌ఫోన్‌లకు పోటీగా విడుదల చేసింది. రియల్‌మి బ్రాండ్ యొక్క బడ్జెట్ విభాగంలో ఇప్పటికే ఉన్న C-సిరీస్‌లోని రియల్‌మి C31, రియల్‌మి C35 మరియు రియల్‌మి C11 2021 వంటి స్మార్ట్‌ఫోన్‌ల జతలో చేరిన రియల్‌మి C30 ఫోన్ యొక్క మొదటి సేల్స్ ఈ రోజు నుంచి ప్రారంభం కానున్నాయి. UniSoC T612 సిస్టమ్-ఆన్-చిప్, 6.5-ఇంచ్ డిస్ప్లే, 5,000mAh బ్యాటరీ వంటి అద్భుతమైన ఫీచర్లతో లాంచ్ అయి బడ్జెట్ ధరలో లభించే కొత్త ఫోన్ గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

రియల్‌మి C30 ధరల వివరాలు

రియల్‌మి C30 ధరల వివరాలు

రియల్‌మి C30 స్మార్ట్‌ఫోన్‌ భారతదేశంలో రెండు వేరియంట్‌లలో విడుదలై ప్రస్తుతం కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంది. ఇందులో 2GB RAM మరియు 32GB స్టోరేజ్ వేరియంట్ రూ.7,499 ధర వద్ద మరియు 3GB RAM మరియు 32GB స్టోరేజ్ వేరియంట్ రూ.8,299 ధర వద్ద లభిస్తుంది. ఈ ఫోన్ ను నేడు అంటే జూన్ 27న మధ్యాహ్నం 12:30PM నుంచి ఫ్లిప్‌కార్ట్ మరియు రియల్‌మి యొక్క ఇ-షాప్ (realme.com) ద్వారా కొనుగోలు చేయడానికి అందుబాటులోకి రానున్నది.

రియల్‌మి C30 స్మార్ట్‌ఫోన్‌ స్పెసిఫికేషన్స్

రియల్‌మి C30 స్మార్ట్‌ఫోన్‌ స్పెసిఫికేషన్స్

రియల్‌మి C30 స్మార్ట్‌ఫోన్‌ యొక్క స్పెసిఫికేషన్స్ విషయానికి వస్తే ఇది 6.5-అంగుళాల డిస్ప్లేను 88.7 శాతం స్క్రీన్ టు బాడీ రేషియోతో మరియు 16.7 మిలియన్ కలర్స్‌తో వస్తుంది. ఇది వర్టికల్ స్ట్రిప్ డిజైన్‌ను కలిగి ఉండి 8.5mm మందంతో మరియు 182 గ్రాముల బరువుతో బ్యాంబూ గ్రీన్ మరియు లేక్ బ్లూ కలర్ వేరియంట్‌లలో లభిస్తుంది. ఇది UniSoC T612 సిస్టమ్-ఆన్-చిప్ ద్వారా ఆధారితమై 32GB UFS 2.2 ఇంటర్నల్‌ స్టోరేజ్ స్పేస్‌తో జత చేయబడి వస్తుంది. ఇది 2GB మరియు 3GB RAM వేరియంట్లలో లభిస్తుంది. ఇది గూగుల్ యొక్క ఆండ్రాయిడ్ 11 మొబైల్ ఆపరేటింగ్ సిస్టమ్‌పై ఆధారపడిన రియల్‌మి గో ఎడిషన్ UIతో రన్ అవుతుంది.

ఆప్టిక్స్

రియల్‌మి C30 కొత్త స్మార్ట్‌ఫోన్‌ యొక్క ఆప్టిక్స్ విషయానికి వస్తే ఫోన్ వెనుక భాగంలో LED ఫ్లాష్‌తో 8MP కెమెరాను కలిగి ఉంటుంది. ఇది ఫోన్ యొక్క ఎడమ వైపున వృత్తాకార సెటప్‌లో అమర్చబడి ఉంటుంది. అలాగే 5MP సెన్సార్ తో సెల్ఫీ కెమెరాను కలిగి ఉంది.

5,000mAh బ్యాటరీ

రియల్‌మి C30 కొత్త స్మార్ట్‌ఫోన్‌ 5,000mAh బ్యాటరీతో ప్యాక్ చేయబడి వస్తుంది. ఇది అల్ట్రా సేవింగ్ మోడ్‌లో కేవలం ఐదు శాతం ఛార్జింగ్ తో 43.5 గంటల సమయం లభిస్తుంది అని కంపెనీ తెలిపింది. ప్రత్యామ్నాయంగా వినియోగదారులు వాట్సాప్‌ను 1.5 గంటల వరకు, Spotifyని నాలుగు గంటల వరకు మరియు కేవలం ఫోన్ కాల్‌ల కోసం 2.3 గంటల సమయంను ఈ ఐదు శాతం బ్యాటరీతో ఉపయోగించవచ్చు. అదనంగా ఫోన్‌లో 3.5mm జాక్ మరియు రెండు హైబ్రిడ్ SIM కార్డ్‌ స్లాట్లు మరియు గరిష్టంగా 1TB స్పేస్‌తో మైక్రో SD కార్డ్‌ని కలిగి ఉంటుంది.

Realme Tech Life Watch R100

Realme Tech Life Watch R100

రియ‌ల్ బ్రాండ్ యొక్క Realme Tech Life Watch R100 బ్లూటూత్ కాలింగ్ సౌక‌ర్యంతో పాటుగా కంపాస్‌, క్యాలెండ‌ర్‌, అలారం క్లాక్‌, స్పీక‌ర్‌, మైక్రోఫోన్ స‌పోర్ట్ వంటి ఫీచర్లను క‌లిగి ఉంది. ఈ బ‌డ్జెట్ స్మార్ట్ వాచ్‌ల‌పై రియ‌ల్ మీ ఒక ఏడాది వర‌కు వారెంటీ క‌ల్పించ‌నుంది. ఈ వాచ్ ధ‌ర‌ను కంపెనీ రూ.3,999గా ప్ర‌క‌టించింది. కానీ, జూన్ 28 వ తేదీ న రూ.3,699 కే కొనుగోలు చేయ‌వ‌చ్చ‌ని తెలిపింది. ఈ వాచ్ కంపెనీ అధికారిక సైట్ మ‌రియు ఇత‌ర ఈ కామ‌ర్స్ సైట్ల‌లో అందుబాటులో ఉంది. ఈ స్మార్ట్‌ వాచ్ బ్లాక్ మ‌రియు వైట్ వంటి రెండు క‌ల‌ర్ల‌లో అందుబాటులో ఉంటుంది. ఇది 360 x 360 pixels రిసొల్యూష‌న్‌తో 1.32 అంగుళాల క‌ల‌ర్ ట‌చ్ స్క్రీన్ డిస్‌ప్లే ను కలిగి ఉంటుంది. దాంతో పాటు ఈ వాచ్‌కు మ‌నం రెండు మ్యాన్యువ‌ల్ ఆప‌రేటింగ్ హార్డ్‌ బ‌ట‌న్స్‌ కూడా క‌నుగొన‌వ‌చ్చు. UI Navigation కు, స్ట్పోర్ట్ మోడ్ యాక్టివేట్ చేయ‌డానికి ఈ బ‌టన్స్‌ను ఉప‌యోగించ‌వ‌చ్చు. ఈ వాచ్ చాలా లైట్‌వెయిట్ గా ఉంటుంది. దాదాపు 46గ్రాముల క‌న్నా ఎక్కువ ఉండ‌క‌పోవ‌డం విశేషం. ఇది 24*7 హార్ట్ బీట్ రేటును మానిట‌రింగ్ చేస్తుంది. అంతేకాకుండా 100+ స్పోర్ట్స్ మోడ్ ఫీచ‌ర్ క‌లిగి ఉంది. వీటితో పాటు బ్ల‌డ్ ఆక్సిజ‌న్ మానిట‌ర్‌, స్లీపింగ్ మానిట‌ర్‌, స్ట్రెస్ మానిట‌ర్ ఫీచ‌ర్ల‌ను ఈ వాచ్ క‌లిగి ఉంది.

రియల్‌మి ప్యాడ్ X టాబ్లెట్

రియల్‌మి ప్యాడ్ X టాబ్లెట్

రియల్‌మి ప్యాడ్ X టాబ్లెట్ యొక్క ఆప్టిక్స్ విషయానికి వస్తే ఫోటోలు మరియు వీడియోల కోసం వెనుక భాగంలో 13-మెగాపిక్సెల్ కెమెరాను అమర్చబడి ఉంది. సెల్ఫీలు మరియు వీడియో చాట్‌ల కోసం 105-డిగ్రీ ఫీల్డ్-ఆఫ్-వ్యూతో ఫ్రంట్-ఫేసింగ్ 8-మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్ కెమెరాను కూడా కలిగి ఉంది. అలాగే ఇది 128GB వరకు ఇంటర్నల్ స్టోరేజ్ తో వస్తుంది. ఇది మైక్రో SD కార్డ్ ద్వారా 512GB వరకు విస్తరించడానికి అనుమతిస్తుంది. టాబ్లెట్‌లోని కనెక్టివిటీ ఎంపికలలో డ్యూయల్-బ్యాండ్ Wi-Fi, బ్లూటూత్ v5.0 మరియు USB టైప్-సి పోర్ట్ ఉన్నాయి. ఇది Realme మాగ్నెటిక్ స్టైలస్ మరియు స్మార్ట్ కీబోర్డ్‌కు కూడా మద్దతు ఇస్తుంది. టాబ్లెట్ క్వాడ్ స్పీకర్లు మరియు డాల్బీ అట్మోస్ సపోర్ట్‌తో వస్తుంది. ఇది 33W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 8,340mAh బ్యాటరీని ప్యాక్ చేస్తుంది. కంపెనీ ప్రకారం, Realme Pad X 7.1mm మందం మరియు 499 గ్రాముల బరువు ఉంటుంది.

More from GizBot

Best Mobiles in India

English summary
Realme C30 Budget Smartphone First Sale Starts Today in India Via Flipkart and Realme.com: Price, Specs sales Offers and More
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X