రియల్‌మి బ్రాండ్ నుంచి కొత్తగా మరొక బడ్జెట్ ఫోన్ లాంచ్ అయింది!! ధరలు ఫీచర్స్

|

చైనా స్మార్ట్‌ఫోన్‌ తయారీ కంపెనీ రియల్‌మి ఈరోజు భారతదేశంలో కొత్తగా ఒక బడ్జెట్ స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది. రియల్‌మి C30 పేరుతో విడుదలైన ఈ కొత్త ఫోన్‌ రియల్‌మి బ్రాండ్ యొక్క బడ్జెట్ విభాగంలో ఇప్పటికే ఉన్న C-సిరీస్‌లోని రియల్‌మి C31, రియల్‌మి C35 మరియు రియల్‌మి C11 2021 వంటి స్మార్ట్‌ఫోన్‌ల జతలో చేరింది. UniSoC T612 సిస్టమ్-ఆన్-చిప్, 6.5-ఇంచ్ డిస్ప్లే, 5,000mAh బ్యాటరీ వంటి ఫీచర్లతో లాంచ్ అయింది. భారతదేశంలో బడ్జెట్ ధరలో లభించే రెడ్మి 9A, ఇన్ఫినిక్స్ స్మార్ట్ 5, రియల్‌మి C11 2021, పోకో C3, టెక్నో స్పార్క్ 7 వంటి బడ్జెట్ స్మార్ట్‌ఫోన్‌ల సమూహంతో ఈ కొత్త బడ్జెట్ ఫోన్ పోటీపడుతుంది.

 

రియల్‌మి C30 ధరల వివరాలు

రియల్‌మి C30 ధరల వివరాలు

రియల్‌మి C30 స్మార్ట్‌ఫోన్‌ యొక్క ధరల విషయానికి వస్తే ఇది భారతదేశంలో రెండు వేరియంట్‌లలో విడుదలైంది. ఇందులో 2GB RAM మరియు 32GB స్టోరేజ్ వేరియంట్ యొక్క ధర రూ.7,499 కాగా 3GB RAM మరియు 32GB స్టోరేజ్ వేరియంట్ యొక్క ధర రూ.8,299. ఈ ఫోన్ యొక్క లభ్యత విషయానికి వస్తే భారతదేశంలో జూన్ 27న మధ్యాహ్నం 12:30PM నుంచి దీని యొక్క మొదటి విక్రయాలు ఫ్లిప్‌కార్ట్ మరియు రియల్‌మి యొక్క ఇ-షాప్ (realme.com) ద్వారా ప్రారంభం కానున్నాయి.

రియల్‌మి C30 స్మార్ట్‌ఫోన్‌ స్పెసిఫికేషన్స్

రియల్‌మి C30 స్మార్ట్‌ఫోన్‌ స్పెసిఫికేషన్స్

రియల్‌మి C30 స్మార్ట్‌ఫోన్‌ యొక్క స్పెసిఫికేషన్స్ విషయానికి వస్తే ఇది 6.5-అంగుళాల డిస్ప్లేను 88.7 శాతం స్క్రీన్ టు బాడీ రేషియోతో మరియు 16.7 మిలియన్ కలర్స్‌తో వస్తుంది. ఇది వర్టికల్ స్ట్రిప్ డిజైన్‌ను కలిగి ఉండి 8.5mm మందంతో మరియు 182 గ్రాముల బరువుతో బ్యాంబూ గ్రీన్ మరియు లేక్ బ్లూ కలర్ వేరియంట్‌లలో లభిస్తుంది. ఇది UniSoC T612 సిస్టమ్-ఆన్-చిప్ ద్వారా ఆధారితమై 32GB UFS 2.2 ఇంటర్నల్‌ స్టోరేజ్ స్పేస్‌తో జత చేయబడి వస్తుంది. ఇది 2GB మరియు 3GB RAM వేరియంట్లలో లభిస్తుంది. ఇది గూగుల్ యొక్క ఆండ్రాయిడ్ 11 మొబైల్ ఆపరేటింగ్ సిస్టమ్‌పై ఆధారపడిన రియల్‌మి గో ఎడిషన్ UIతో రన్ అవుతుంది.

రియల్‌మి C30
 

కొత్తగా ప్రారంభించిన రియల్‌మి C30 బడ్జెట్ స్మార్ట్‌ఫోన్‌లోని ఆప్టిక్స్ విషయానికి వస్తే ఫోన్ వెనుక భాగంలో LED ఫ్లాష్‌తో 8MP కెమెరాను కలిగి ఉంటుంది. ఇది ఫోన్ యొక్క ఎడమ వైపున వృత్తాకార సెటప్‌లో అమర్చబడి ఉంటుంది. అలాగే 5MP సెన్సార్ తో సెల్ఫీ కెమెరాను కలిగి ఉంది. బ్యాటరీ విషయానికొస్తే ఇది 5,000mAh బ్యాటరీతో ప్యాక్ చేయబడి వస్తుంది. ఇది అల్ట్రా సేవింగ్ మోడ్‌లో కేవలం ఐదు శాతం ఛార్జింగ్ తో 43.5 గంటల సమయం లభిస్తుంది అని కంపెనీ తెలిపింది. ప్రత్యామ్నాయంగా వినియోగదారులు వాట్సాప్‌ను 1.5 గంటల వరకు, Spotifyని నాలుగు గంటల వరకు మరియు కేవలం ఫోన్ కాల్‌ల కోసం 2.3 గంటల సమయంను ఈ ఐదు శాతం బ్యాటరీతో ఉపయోగించవచ్చు. అదనంగా ఫోన్‌లో 3.5mm జాక్ మరియు రెండు హైబ్రిడ్ SIM కార్డ్‌ స్లాట్లు మరియు గరిష్టంగా 1TB స్పేస్‌తో మైక్రో SD కార్డ్‌ని కలిగి ఉంటుంది.

రియల్‌మి ప్యాడ్ X టాబ్లెట్ స్పెసిఫికేషన్స్

రియల్‌మి ప్యాడ్ X టాబ్లెట్ స్పెసిఫికేషన్స్

రియల్‌మి ప్యాడ్ X టాబ్లెట్ యొక్క స్పెసిఫికేషన్స్ విషయానికి వస్తే ఇది రియల్‌మి UI 3.0పై రన్ అవుతుంది. ఈ టాబ్లెట్ 11-అంగుళాల 2K రిజల్యూషన్ LCD డిస్‌ప్లేను 2,048 x 1,080 పిక్సెల్‌లు, 450 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్ మరియు DC డిమ్మింగ్ సపోర్ట్‌తో కలిగి ఉంది. ఇది స్నాప్‌డ్రాగన్ 695 SoC ద్వారా శక్తిని పొందుతూ గరిష్టంగా 6GB RAMతో జత చేయబడి లభిస్తుంది. ఈ టాబ్లెట్ 5GB వరకు వినియోగించని ఇంటర్నల్ స్టోరేజ్ ని ఉపయోగించి అందుబాటులో ఉన్న మెమరీని 11GB వరకు విస్తరించడానికి అనుమతిస్తుంది.

రియల్‌మి ప్యాడ్ X

రియల్‌మి ప్యాడ్ X టాబ్లెట్ యొక్క ఆప్టిక్స్ విషయానికి వస్తే ఫోటోలు మరియు వీడియోల కోసం వెనుక భాగంలో 13-మెగాపిక్సెల్ కెమెరాను అమర్చబడి ఉంది. సెల్ఫీలు మరియు వీడియో చాట్‌ల కోసం 105-డిగ్రీ ఫీల్డ్-ఆఫ్-వ్యూతో ఫ్రంట్-ఫేసింగ్ 8-మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్ కెమెరాను కూడా కలిగి ఉంది. అలాగే ఇది 128GB వరకు ఇంటర్నల్ స్టోరేజ్ తో వస్తుంది. ఇది మైక్రో SD కార్డ్ ద్వారా 512GB వరకు విస్తరించడానికి అనుమతిస్తుంది. టాబ్లెట్‌లోని కనెక్టివిటీ ఎంపికలలో డ్యూయల్-బ్యాండ్ Wi-Fi, బ్లూటూత్ v5.0 మరియు USB టైప్-సి పోర్ట్ ఉన్నాయి. ఇది Realme మాగ్నెటిక్ స్టైలస్ మరియు స్మార్ట్ కీబోర్డ్‌కు కూడా మద్దతు ఇస్తుంది. టాబ్లెట్ క్వాడ్ స్పీకర్లు మరియు డాల్బీ అట్మోస్ సపోర్ట్‌తో వస్తుంది. ఇది 33W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 8,340mAh బ్యాటరీని ప్యాక్ చేస్తుంది. కంపెనీ ప్రకారం, Realme Pad X 7.1mm మందం మరియు 499 గ్రాముల బరువు ఉంటుంది.

Best Mobiles in India

English summary
Realme C30 Budget Smartphone Released in India: Price, Specs, Features and More

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X