Realme C31 స్మార్ట్‌ఫోన్‌ మొదటి సేల్స్ డిస్కౌంట్ ఆఫర్లతో ప్రారంభం కానున్నాయి!!

|

రియల్‌మి స్మార్ట్‌ఫోన్‌ కంపెనీ గతవారం ఇండియాలో C-సిరీస్ విభాగంలో బడ్జెట్ ధరలోనే రియల్‌మి C31 స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేసింది. నేడు ఈ రియల్‌మి కొత్త స్మార్ట్‌ఫోన్‌ మొదటి సారి కొనుగోలు చేయడానికి వినియోగదారులకు అందుబాటులోకి రానున్నది. ఆండ్రాయిడ్ 11-ఆధారిత Realme R UIపై రన్ అవుతూ 6.5-అంగుళాల LCD డిస్‌ప్లే, ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌ మరియు 5,000mAh బ్యాటరీ వంటి అద్భుతమైన ఫీచర్లతో ప్యాక్ చేయబడి వస్తుంది. అలాగే ఇది Unisoc T612 చిప్‌సెట్ ద్వారా శక్తిని పొందుతూ గరిష్టంగా 4GB RAMతో జత చేయబడి బడ్జెట్ ధరలో బెస్ట్ స్మార్ట్‌ఫోన్ ను కోరుకునే వారికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. దీని గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

 

Realme C31 ధరలు & సేల్స్ వివరాలు

Realme C31 ధరలు & సేల్స్ వివరాలు

Realme C31 కొత్త స్మార్ట్‌ఫోన్‌ యొక్క మొదటి అమ్మకాలు మధ్యాహ్నం 12 గంటల నుంచి కంపెనీ యొక్క ఆన్‌లైన్ స్టోర్ మరియు Flipkart ద్వారా ప్రారంభం కానున్నాయి. ఈ అమ్మకంలో దీనిని రెండు వేరియంట్లలో కొనుగోలు చేయడానికి అవకాశం ఉంది. 3GB ర్యామ్ + 32GB స్టోరేజ్ బేస్ మోడల్‌ రూ.8,999 ధర వద్ద మరియు 4GB ర్యామ్ + 64GB స్టోరేజ్ వేరియంట్ రూ.9,999 ధర వద్ద డార్క్ గ్రీన్ మరియు లైట్ సిల్వర్ కలర్ ఆప్షన్‌లలో కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంది.

Realme C31 స్మార్ట్‌ఫోన్‌ స్పెసిఫికేషన్స్
 

Realme C31 స్మార్ట్‌ఫోన్‌ స్పెసిఫికేషన్స్

Realme C31 స్మార్ట్‌ఫోన్‌ స్పెసిఫికేషన్స్ విషయానికి వస్తే ఇది డ్యూయల్ సిమ్ (నానో) స్లాట్ కలిగి ఉండి ఆండ్రాయిడ్ 11-ఆధారిత Realme UI R ఎడిషన్‌పై నడుస్తుంది. హ్యాండ్‌సెట్‌లో 6.5-అంగుళాల HD+ (720x1,600 పిక్సెల్‌లు) LCD డిస్‌ప్లే 88.7 శాతం స్క్రీన్-టు-బాడీ రేషియోతో అమర్చబడింది. Realme C31 12nm Unisoc T612 ఆధారిత ప్రాసెసర్‌తో రన్ అవుతూ గరిష్టంగా 4GB RAMతో జత చేయబడి వస్తుంది. కెమెరా విభాగంలో Realme C31 ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. ఇందులో f/2.2 ఎపర్చరు లెన్స్ మరియు 4x డిజిటల్ జూమ్‌తో 13-మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, f/2.4 ఎపర్చరు లెన్స్‌తో కూడిన 2-మెగాపిక్సెల్ మాక్రో కెమెరా మరియు ఒక f/2.8 ఎపర్చరు లెన్స్‌తో పేర్కొనబడని మోనోక్రోమ్ సెన్సార్. హ్యాండ్‌సెట్‌లో సెల్ఫీలు మరియు వీడియో చాట్‌ల కోసం f/2.2 ఎపర్చరు లెన్స్‌తో 5-మెగాపిక్సెల్ కెమెరా అమర్చబడింది.

మైక్రో SD కార్డ్

Realme C31 మైక్రో SD కార్డ్ స్లాట్ ద్వారా విస్తరించదగిన (1 TB వరకు) UFS 2.2 స్టోరేజీని 64GB వరకు అందిస్తుంది. Realme C31లోని కనెక్టివిటీ ఎంపికలలో 4G LTE, Wi-Fi (2.4 GHz), బ్లూటూత్ v5, 3.5mm హెడ్‌ఫోన్ జాక్ మరియు USB టైప్-సి పోర్ట్ ఉన్నాయి. సెన్సార్‌లలో యాక్సిలరోమీటర్, సామీప్య సెన్సార్, లైట్ సెన్సార్, మాగ్నెటిక్ ఇండక్షన్ సెన్సార్ మరియు సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ ఉన్నాయి. అలాగే ఇది 5,000mAh బ్యాటరీతో ప్యాక్ చేయబడి వస్తుంది. ఇది స్టాండ్‌బైలో 45 రోజుల వరకు బ్యాటరీ లైఫ్ ను అందిస్తుంది అని కంపెనీ తెలిపింది.

Best Mobiles in India

English summary
Realme C31 Smartphone First Sale Starts Today at 12PM via Flipkart: Price, Discount offers and Deals

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X